
అల్లంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జుట్టుకు అల్లం రసాన్ని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా తలలో దురద, తీవ్రమైన చుండ్రు సమస్యలకు చికిత్స చేయడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అల్లం జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా వెంట్రుకల కుదుళ్లు ఉత్తేజితమై జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అల్లంలో జింజరోల్, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడంతోబాటు జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది. ఇందుకోసం మార్కెట్‌లో దొరికే జింజర్ ఆయిల్‌ను వాడవచ్చు.
మీ షాంపూతో అల్లం రసం కలపవచ్చు. లేదా అల్లం ఆధారిత షాంపూని ఉపయోగించవచ్చు. నూనెతో పాటు అల్లం రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీ హెయిర్ మాస్క్‌లకు అల్లం కూడా జోడించవచ్చు. (క్లిక్ చేయండి: డిజిటల్ అడిక్షన్‌ను గుర్తించడమెలా?)
Comments
Please login to add a commentAdd a comment