ప్రతీకాత్మక చిత్రం
జడ ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఆధునిక జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, సరైన పోషణ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు రాలే సమస్య వేధిస్తోంది చాలా మందిని. అలా కాకుండా కేశాలు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.
అల్లం, ఆవాలు, లవంగాలతో..
►అల్లం తురుము టేబుల్ స్పును, టీస్పూను ఆవాలు, ఐదు లవంగాలను తీసుకుని ఒక కాటన్ వస్త్రంలో మూటకట్టాలి.
►మీరు వాడుతోన్న హెయిర్ ఆయిల్‌ను గాజు సీసాలో పోసి, దానిలో ఈ మూటను మునిగేటట్లు పెట్టాలి.
►ఒకరోజంతా సీసాను ఎండలో ఉంచాలి.
►మరుసటిరోజు ఈ నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి.
►ఒకరోజంతా ఉంచుకుని తరువాతిరోజు తలస్నానం చేయాలి.
►ఇలా వారానికి ఒకసారి ఈ అయిల్‌ను తలకు పట్టించడం ద్వారా జుట్టురాలడం తగ్గి, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
►నూనె అయిపోయిన తరువాత మొదట చెప్పుకున్నట్లుగానే తాజాగా తయారు చేసుకుని వాడితే పదిహేను రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.
చదవండి: Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే!
Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే!
ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే!
Comments
Please login to add a commentAdd a comment