mustard oil
-
శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్!
ఇంతవరకు మనం రకరకాల నూనెలు వినియోగిస్తున్నాం. అలాగే ఒకే రకం నూనెను వాడకూడదని పోషకాహార నిపుణులు చెప్పడంతో మనం సన్‌ఫ్లవర్, వేరుశెనగా అంటూ నూనెలు మారుస్తున్నాం కూడా. కానీ పోషకాహార శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెటర్ అని తేలింది. ఈ నూనెని వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇంతకీ ఏంటా నూనె అంటే..శుద్ధి చేసిన నూనెల కంటే ఆవాల నూనె మంచిదని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపద్రాయ ఆవాల నూనె వాడటమే మంచి నొక్కి చెప్పారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి చెందని పోషకాహార శాస్త్రవేత్త మోనికా చౌదరి మాట్లాడుతూ.."మునుపటి అధ్యయనంలో సాంప్రదాయా ఆవాల నూనెతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలే ఆరోగ్యానికి మంచిదని తేలింది. కానీ కాలక్రమేణ ఎలుకలపై జరిపిన అధ్యయనంలో అది తప్పు అని నిరూపితమయ్యింది. ఆవ నూనెలో దాదాపు 35-48% ఎరుసిక్ యాసిడ్ ఉంటుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే శుద్ధి చేసిన నూనెల్లో చమురు కంపెనీ ఎరుక్ యాసిడ్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నాయని ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెగ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇటీవల ఎలుకలపై జరిపిన అధ్యయనంలో మానవులకు ఎరుసిక్ ఆమ్లాల ప్రభావం ఉండదని తేలింది. మొత్తం శరీరం బరువులో ఎరుసిక్ యాసిడ్ కిలోకు 7.5ఎంజీ అనుమతించదగినది అన్నారు. ఇక ఈ ఆవా నూనెలో కేవలం 2% కంటే తక్కువ ఎరుసిక్ యాసిడ్‌ని కలిగి ఉంటాయని, అందువల్ల ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని". చెబుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన నూనె అంటే కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా ఉండాలి. పైగా సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆవాల నూనెలో ఉంటాయని అన్నారు. ఇంతవరకు మంచివని చెప్పుకున్న శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా 6 కొవ్వు ఆమ్మాలు అధికంగా ఉంటాయని, ఇవి దీర్ఘకాల నిల్వకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఇలాంటి నూనెలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇలా చాలా స్థానికేతర నూనెల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సాంప్రదాయ నూనెలను తీసుకోవడమే మంచిదని సూచించారు. అందులోనూ ఆవాల నూనె ఇంకా మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ శుద్ధి చేసిన నూనెల్లో ఉన్న మరో సమస్య పొగ పాయింట్ అని చెప్పారు. ఇక్కడ నూనెలను వేడిచేసినప్పుడల్లా.. అవి పొగ , ఆవిరిని ఉత్పత్తి చేసే సమయంలో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు (PUFA) ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడం జరుగుతుంది. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి కాలక్రమేణ కేన్సర్ కారకాలుగా మారి వివిధ రకాల కేన్సర్లకు దారితీస్తుంది. అయితే సాంప్రదాయ నూనెల్లోనూ, ఆవాల నూనెలను మరిగించినప్పుడూ వాటిలో అధిక పొగ పాయింట్ ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడాన్ని నిరోధిస్తుందని, అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వివరించారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆవాల నూనెను వాడమని పదేపదే నొక్కి చెబుతున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు. (చదవండి: స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్..ధర ఎంతంటే..!) -
జుట్టు నిగనిగల కోసం... ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా
Hair Care Tips: నల్లని నిగనిగలాడే ఒత్తైన కురులు కావాలని కోరుకోని అమ్మాయి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాతో నల్లటి జుట్టు సొంతం చేసుకోవచ్చు. ఆవనూనె, మెంతి పొడి.. ఇంకా ►ఇనుప మూకుడు తీసుకుని దానిలో టీకప్పు ఆవనూనె, మరోకప్పు కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, అరకప్పు ►గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు సన్నని మంట మీద ఈ మూకుడు పెట్టి పదినిమిషాల పాటు మరగనివ్వాలి. ఆయిల్ రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి దించి పక్కనపెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత దీనిని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకుని ఒక పూటంతా పక్కన పెట్టాలి. ►దీనిని రోజూ తలకు రాసుకోవాలి. ►ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ►రోజూ వాడటం ఇష్టం లేనివాళ్లు వారానికి ఒకటి రెండుసార్లు తలకు పట్టించి రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ►ఈ ఆయిల్‌ను వాడటం వల్ల నల్లని ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! -
Hair Care: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా!
జడ ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఆధునిక జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, సరైన పోషణ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు రాలే సమస్య వేధిస్తోంది చాలా మందిని. అలా కాకుండా కేశాలు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. అల్లం, ఆవాలు, లవంగాలతో.. ►అల్లం తురుము టేబుల్ స్పును, టీస్పూను ఆవాలు, ఐదు లవంగాలను తీసుకుని ఒక కాటన్ వస్త్రంలో మూటకట్టాలి. ►మీరు వాడుతోన్న హెయిర్ ఆయిల్‌ను గాజు సీసాలో పోసి, దానిలో ఈ మూటను మునిగేటట్లు పెట్టాలి. ►ఒకరోజంతా సీసాను ఎండలో ఉంచాలి. ►మరుసటిరోజు ఈ నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి. ►ఒకరోజంతా ఉంచుకుని తరువాతిరోజు తలస్నానం చేయాలి. ►ఇలా వారానికి ఒకసారి ఈ అయిల్ను తలకు పట్టించడం ద్వారా జుట్టురాలడం తగ్గి, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ►నూనె అయిపోయిన తరువాత మొదట చెప్పుకున్నట్లుగానే తాజాగా తయారు చేసుకుని వాడితే పదిహేను రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. చదవండి: Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! -
Hair Care: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించారంటే!
Hair Care And Beauty Tips In Telugu: జుట్టు రాలడం తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. బాదం నూనెతో వీటిని కలిపి కురులకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో.. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని సన్నగా తురిమి రసం తియ్యాలి. ఈ రసాన్ని రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనెలో వేసి కలిపి, కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. నలభై నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరిపొడితో.. బాదం నూనెలో ఉసిరిపొడి లేదా రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసం వేసి కలిపి జుట్టుకు పట్టించాలి. మర్దనచేసి అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. కురులకు పోషణ అంది నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతాయి. ఆవనూనె వల్ల.. ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు, చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆవాలను మోతాదుకు మించి ఒకేసారిగా ఎక్కువగా వాడితే టాక్సిక్ కారణంగా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొటిమలను తగ్గించుకోవాలంటే.. కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు నీటితో ఈ నూనెను కలిపి ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి.. -
Mustard Oil: బరువు తగ్గాలా.. పెదాలు మృదువుగా మారాలా.. ఇది ట్రై చేయండి!
Mustard Oil For Weight Loss: Benefits Of Cooking With Mustard Oil In Telugu: వంటకం ఏదైనా సరే.. సగటు భారతీయ కుటుంబపు వంటగదిలో తప్పక దర్శనమిచ్చే పదార్థం నూనె. ఆయిల్ లేనిదే మనకు ఏ వంట మొదలు కాదు. సాధారణంగా చాలా మంది వేరు శెనగ, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు, తవుడు నూనెను వినియోగిస్తారు. కాస్త ధర ఎక్కువైనా సరే కొంతమంది ఆలివ్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతారు. మరి.. ఉత్తరాదిలో ఎక్కువగా ఉపయోగించే.. ఆవ నూనె(Mustard Oil) వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?! వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు యాంటీ బాక్టీరియల్గానూ ఇది పనిచేస్తుంది. జలుబు వంటి సీజనల్ వ్యాధులను నయం చేసే ఔషధంగానూ ఉపయోగపడుతుంది. రోగ నిరోధ శక్తిని పెంచడంతో పాటుగా... జట్టు, చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ ఉపయోగపడుతుంది. అంతేకాదు... బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. బెంగళూరుకు చెందిన న్యూట్రీషనిస్ట్ డాక్టర్ అంజూ సూద్ తెలిపిన వివరాల ప్రకారం... ఆవ నూనెలో మోనోసాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేగాక ఆవ నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించి మెటబాలిజం పెంపొందించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఆవ నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే, శరీర తత్వాలను, ఆరోగ్య పరిస్థితులను బట్టి తగు మోతాదులో ఈ నూనెను వాడితే మంచిది. ఆవనూనె వాడటం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు మస్టర్డ్ ఆయిల్‌తో శరీరాన్ని మర్దనా చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శీతాకాలంలో పగిలిన పెదాలకు ఆవనూనె రాసుకుంటే మృదువుగా మారతాయి. పసుపులో ఆవనూనె రాసుకుని చర్మానికి పట్టిస్తే నిగారింపు సంతరించుకుంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును ఆవనూనె నివారించగలదు. -
ఆవనూనె, నిమ్మరసంతో కరోనాకు చెక్
కోల్‌కతా : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కేవలం చికిత్సలో ఉపయోగించే ఔషధాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు సైతం అధిక సంఖ్యలో ఈ వైరస్ బారిన పడతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా బెంగాల్ పోలీసులు కొత్త పద్దతులను కనుగొన్నారు. ఆవనూనె, నిమ్మకాయ కలిపిన వేడినీళ్లు తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటామని ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇది ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా ఈ విధానాన్ని ఆచరించాలని పేర్కొంటూ ఓ సర్క్యులర్ విడుదల చేశారు. కమిషనరేట్‌లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ బంధువు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కరోనా బారినపడగా వాళ్లు ఈ పద్ధతులను అనుసరించి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. (రాందేవ్ బాబాకు మహా వార్నింగ్ ) అందరికి అందుబాటులో ఇంట్లోనే దొరికే ఆవనూనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుందనడానికి ఇలాంటివి ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. గతవారం రోజుల క్రితమే డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో ఉన్న పోలీసుకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు ఈ చిట్కాలనే పాటించారు. దీంతో రెండురోజుల్లోనే వారి ఆరోగ్యం మెరుగయ్యిందని పోలీస్ కమిషనర్ త్రిపురారీ ఆర్ధవ్ పేర్కొన్నారు. 'మేం డాక్టర్లు కాకపోయినా చిన్నప్పటి నుంచి మన పెద్ద వాళ్లు అనుసరించేవి చూస్తూ పెరిగినవాళ్లం. మన మూలాలను ఎప్పటికీ మరవద్దు. కరోనా నియంత్రణలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి మా ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ఈ జాగ్రత్తలు పాటించమని సెర్య్యులర్ విడుదల చేశాం. వీటిని పాటించి కరోనాను ధీటుగా ఎదుర్కొన్న వారి అనుభవాలను కూడా జోడించాం 'అని ఆర్థద్ తెలిపారు. (ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక రైల్వే స్టేషన్ ) -
శిరోజాలకు ఆవ...
అందం దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం.. చిన్నాపెద్దల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రభావం శిరోజాల మీద పడడంతో అతిగా వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు ఉపశమనంగా కొన్ని జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవచ్చు.. ఆవ నూనె ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది. 2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీని వల్ల వెంట్రుక పెళుసుబారి, తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా రీ బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. కేశాలంకరణలో తప్పనిసరి అయితే, నిపుణుల సూచనలు పాటించాలి. ప్రతిరోజూ వెంట్రుక పెరుగుదల ఉంటుంది. తాజా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి, నీరు వెంట్రుక బలానికి, నిగనిగలాడుతూ పెరగడానికి దోహదం చేస్తాయి. -గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్