Mustard Oil For Weight Loss: Benefits Of Coocking With Mustard Oil In Telugu - Sakshi
Sakshi News home page

Mustard Oil For Weight Loss: బరువు తగ్గాలా.. పెదాలు మృదువుగా మారాలా.. ఈ ఆయిల్‌ ట్రై చేయండి!

Published Mon, Nov 22 2021 12:56 PM | Last Updated on Mon, Nov 22 2021 5:17 PM

Mustard Oil For Weight Loss: Benefits Of Cooking With Mustard Oil In Telugu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Mustard Oil For Weight Loss: Benefits Of Cooking With Mustard Oil In Telugu: వంటకం ఏదైనా సరే.. సగటు భారతీయ కుటుంబపు వంటగదిలో తప్పక దర్శనమిచ్చే పదార్థం నూనె. ఆయిల్‌ లేనిదే మనకు ఏ వంట మొదలు కాదు. సాధారణంగా చాలా మంది వేరు శెనగ, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు, తవుడు నూనెను వినియోగిస్తారు. కాస్త ధర ఎక్కువైనా సరే కొంతమంది ఆలివ్‌ ఆయిల్‌ వైపు మొగ్గు చూపుతారు. మరి.. ఉత్తరాదిలో ఎక్కువగా ఉపయోగించే.. ఆవ నూనె(Mustard Oil) వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?!

వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు యాంటీ బాక్టీరియల్‌గానూ ఇది పనిచేస్తుంది. జలుబు వంటి సీజనల్‌ వ్యాధులను నయం చేసే ఔషధంగానూ ఉపయోగపడుతుంది. రోగ నిరోధ శక్తిని పెంచడంతో పాటుగా... జట్టు, చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ ఉపయోగపడుతుంది. అంతేకాదు... బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..
బెంగళూరుకు చెందిన న్యూట్రీషనిస్ట్‌ డాక్టర్‌ అంజూ సూద్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆవ నూనెలో మోనోసాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేగాక ఆవ నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించి మెటబాలిజం పెంపొందించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఆవ నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే, శరీర తత్వాలను, ఆరోగ్య పరిస్థితులను బట్టి తగు మోతాదులో ఈ నూనెను వాడితే మంచిది. 

ఆవనూనె వాడటం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు

  • మస్టర్డ్‌ ఆయిల్‌తో శరీరాన్ని మర్దనా చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
  • శీతాకాలంలో పగిలిన పెదాలకు ఆవనూనె రాసుకుంటే మృదువుగా మారతాయి.
  • పసుపులో ఆవనూనె రాసుకుని చర్మానికి పట్టిస్తే నిగారింపు సంతరించుకుంటుంది.
  • గుండె సంబంధిత వ్యాధుల ముప్పును ఆవనూనె నివారించగలదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement