జుట్టు నిగనిగల కోసం... ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా | Hair Care Tips: Mustard Oil Amla Powder Pack For Black Hair | Sakshi
Sakshi News home page

నిగనిగలాడే జుట్టు కోసం ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా

Published Fri, Jan 6 2023 3:27 PM | Last Updated on Fri, Jan 6 2023 4:09 PM

Hair Care Tips: Mustard Oil Amla Powder Pack For Black Hair - Sakshi

Hair Care Tips: నల్లని నిగనిగలాడే ఒత్తైన కురులు కావాలని కోరుకోని అమ్మాయి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాతో నల్లటి జుట్టు సొంతం చేసుకోవచ్చు.

ఆవనూనె, మెంతి పొడి.. ఇంకా
►ఇనుప మూకుడు తీసుకుని దానిలో టీకప్పు ఆవనూనె, మరోకప్పు కొబ్బరి నూనె, టేబుల్‌ స్పూన్‌ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్‌ స్పూన్‌ ఉసిరి పొడి, అరకప్పు ►గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి.
►ఇప్పుడు సన్నని మంట మీద ఈ మూకుడు పెట్టి పదినిమిషాల పాటు మరగనివ్వాలి. ఆయిల్‌ రంగు మారిన తరువాత స్టవ్‌ ఆపేసి దించి పక్కనపెట్టుకోవాలి.
►చల్లారిన తర్వాత దీనిని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకుని ఒక పూటంతా పక్కన పెట్టాలి.

►దీనిని రోజూ తలకు రాసుకోవాలి.
►ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి.
►రోజూ వాడటం ఇష్టం లేనివాళ్లు వారానికి ఒకటి రెండుసార్లు తలకు పట్టించి రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి.
►ఈ ఆయిల్‌ను వాడటం వల్ల నల్లని ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి.

చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్‌ అయ్యింది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement