Fenugreek leaf
-
జుట్టు నిగనిగల కోసం... ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా
Hair Care Tips: నల్లని నిగనిగలాడే ఒత్తైన కురులు కావాలని కోరుకోని అమ్మాయి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాతో నల్లటి జుట్టు సొంతం చేసుకోవచ్చు. ఆవనూనె, మెంతి పొడి.. ఇంకా ►ఇనుప మూకుడు తీసుకుని దానిలో టీకప్పు ఆవనూనె, మరోకప్పు కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, అరకప్పు ►గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు సన్నని మంట మీద ఈ మూకుడు పెట్టి పదినిమిషాల పాటు మరగనివ్వాలి. ఆయిల్ రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి దించి పక్కనపెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత దీనిని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకుని ఒక పూటంతా పక్కన పెట్టాలి. ►దీనిని రోజూ తలకు రాసుకోవాలి. ►ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ►రోజూ వాడటం ఇష్టం లేనివాళ్లు వారానికి ఒకటి రెండుసార్లు తలకు పట్టించి రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ►ఈ ఆయిల్‌ను వాడటం వల్ల నల్లని ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! -
Health: రాత్రి వేళ పాలలో మెంతి గింజల్ని ఉడకబెట్టి.. వాటిని తాగితే!
Menthi Podi- Milk- Health Tips In Telugu: మెంతుల్ని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అదే రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి లేదా చిటికడు మెంతి పొడిని పాలలో కలిపి తాగితే సుఖమైన నిద్ర పడుతుంది. మెంతి పొడి పాలల్లో కలిపి తాగడం వల్ల కలిగే అదనపు లాభాలు ►శరీరం అంతర్గతంగా పటిష్టమౌతుంది. ►వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ►శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు పాలు, మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ►అంతేకాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది. ►అందుకే చలికాలంలో మెంతిపొడిని పాలలో కలిపి తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ►గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మెంతులు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. ►బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తాయి. ►మెంతిపొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ►పాలలో తీసుకోలేనివారు రాత్రిపూట గ్లాసు నీళ్లలో అరచెంచా లేదా చెంచా మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులను నమిలి, నీటిని తాగినా మంచిదే. ►అయితే వేడిపాలలో చిటికడు మెంతుల పొడి కలుపుకుని తాగడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయని అనుభవజ్ఞుల సూచన. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు తగిన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్‌లో ఈ సమస్యలు.. Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. -
Beauty Tips: ముఖం మీది రంధ్రాలు మాయం చేసే.. మెంతి ప్యాక్!
మెంతి.. ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా దీని సొంతం. ఈ మెంతి ప్యాక్ ట్రై చేశారంటే ముఖం మీది రంధ్రాలు మాయం కావడం ఖాయం. ఇలా చేయండి 👉🏾రాత్రంతా నానబెట్టుకున్న టీస్పూను మెంతులను, నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేయాలి. 👉🏾దీనికి ఆరు వేపాకులు, రెండు కీరదోసకాయ ముక్కలు జోడించి పేస్టుచేయాలి. 👉🏾ఈ పేస్టులో టీస్పూను ముల్తానీ మట్టి, అరటీస్పూను నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి. 👉🏾ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. 👉🏾తరువాత చేతులని తడిచేసుకుని ఐదు నిమిషాలపాటు మర్దనచేసి చల్లటి నీటితో కడిగేయాలి. 👉🏾వారానికి ఒకసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద కనిపిస్తోన్న రంధ్రాలు, డార్క్ సర్కిల్స్, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. 👉🏾ముఖ చర్మం బిగుతుగా మారి, మృదువైన నిగారింపుని సంతరించుకుంటుంది. 👉🏾మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830 -
ఎంతెంత మెంతి.. అంతంత రుచి
మెంతి ఆకులు, గింజలు వంటింటి నేస్తాలని మనకు తెలిసిందే! కుండీల్లో పెరిగే ఆకులు కూరకు రుచినిస్తాయి. జీలకర్రతో దోస్తీ చేసే మెంతులు. ఘుమఘుమలతో మదిని దోచేస్తాయి. ఆరోగ్యప్రదాయినిగా పేరొందిన మెంతి. వేపుడుకైనా, గ్రేవీకైనా రెడీ అంటూ ముందుంటుంది. వెజ్, నాన్‌వెజ్ వంటకాలకు ఇంత అనేది లేకుండా ఎంతెంత మెంతి వేస్తే అంతంత రుచిని జత చేరుస్తుంది. ఖీమా సోయా మెంతి కావలసినవి: నూనె – పావు కప్పు; ఉల్లిపాయ – 2 (మీడియం సైజువి); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్లు; ఖీమా– పావు కేజీ; జీలకర్ర – టీ స్పూన్ (వేయించి, పొడి చేయాలి); ఎర్ర మిరపకాయలు – 2; పసుపు పొడి – పావు టీస్పూన్; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – 8–10; యాలకులు – 2; లవంగాలు – 4; సోంపు – అర టీ స్పూన్; టమోటా – 1 (సన్నగా తరగాలి); నీళ్లు – కప్పు; మెంతి ఆకులు – అర కప్పు; సోయా – పావు కప్పు; జావత్రి, జాజికాయ పొడులు – చిటికెడు; పచ్చిమిర్చి – 3; కొత్తిమీర – తగినంత. తయారీ: ∙బాణలిలో నూనె, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ∙అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ∙పచ్చిమిర్చి వేగాక, ఖీమా వేసి, రంగు మారే వరకు బాగా వేయించాలి. 8–10 నిమిషాలు లేదా నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ∙నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, సోంపు వేసి కలపాలి. ∙టొమాటోలు వేసి 2–3 నిమిషాలు ఉడికించాలి. ∙టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. దీంట్లో సోయా వేసి, మూత పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. ∙మెంతి ఆకులు, మెంతులు వేసి బాగా కలపాలి. ∙నూనె విడిపోయే వరకు మూతపెట్టి, తక్కువ మంటపై ఉడికించాలి. ∙జాపత్రి, జాజికాయ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ∙కొత్తిమీర తరుగు వేసి, మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచి, తర్వాత సర్వ్ చేయాలి. మెంతి ఫిష్ కర్రీ కావలసినవి: చేప ముక్కలు – 4; తాజా మెంతి ఆకులు – 4 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు – అర కప్పు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పెద్ద టమోటా – 1 (సన్నగా తరగాలి); కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్. తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పురాసి, రుద్ది, పక్కన పెట్టి, ఓ ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, మెంతులు వేసి ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అప్పుడు నూనె నుండి గింజలను బయటకు తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి, వేయించాలి. ∙అల్లం– వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, మిశ్రమం సాస్ లాగా మారే వరకు ఉడికించాలి. తర్వాత మెంతి ఆకులను వేసి, కలపాలి. ∙ చేప ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీరు (కావాలనుకుంటే) వేసి నెమ్మదిగా మంట మీద ఉడికించాలి. ∙వడ్డించే ముందు కొంచెం నిమ్మరసం పిండాలి. మెంతి కార్న్ మలాయ్ కావలసినవి: మెంతి ఆకులు – 2 కప్పులు; మొక్కజొన్న గింజలు – అర కప్పు; టొమాటోలు – 4; జీడిపప్పు – 15; పాలు – కప్పు; క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; పంచదార – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వంట నూనె – 2 టేబుల్ స్పూన్లు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక గిన్నెలో మెంతి ఆకులు, టీ స్పూన్ స్పూన్ ఉప్పు వేసి, మూతపెట్టి, 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ∙తర్వాత మెంతి ఆకులను మంచినీటితో బాగా కడగాలి.∙మొక్కజొన్న గింజలను ప్రెషర్ కుకర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, పక్కన పెట్టుకోవాలి. ∙జీడిపప్పును తరిగి 3 టేబుల్స్పూన్ల పాలలో 15 నిమిషాలు నానబెట్టాలి.∙నానబెట్టిన జీడిపప్పును గ్రైండ్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ∙తరిగిన టొమాటోను ప్రెజర్ కుకర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నీళ్లు కలపద్దు. ∙బాణలిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, యాలకుల పొడిని కలపాలి. ∙ ఇప్పుడు తరిగిన మెంతి ఆకులు వేసి, నిమిషం సేపు వేయించాలి. ∙ఇప్పుడు టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ∙టొమాటో, మసాలా నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి నిమిషం సేపు ఉడికించాలి. ∙దీంట్లో క్రీమ్ కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద నిమిషం సేపు ఉడికించాలి. ∙ఈ మలాయ్ కర్రీని నాన్ లేదా రోటీ లేదా పరాఠాతో వేడి వేడిగా వడ్డించాలి. ఓట్స్ మెంతి కావలసినవి: ఓట్స్ – ముప్పావు కప్పు (గ్రైండ్ చేసి, పక్కనుంచాలి); మెంతి ఆకులు – 2 కప్పులు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; కారం – ఒకటిన్నర టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; నువ్వులు – అర టీ స్పూన్. తయారీ: ∙ఒక పాత్రలో ఓట్స్, మెంతి ఆకులు, రవ్వ, పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి, బాగా కలపాలి. ∙కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, ఒత్తి పక్కనుంచాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న ముట్టీలను నూనె వేసి లేదా వేయకుండానే వేయించుకోవాలి. ∙విడిగా ఒక మూకుడును స్టౌ మీద పెట్టి వేడయ్యాక రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో ఆవాలు, నువ్వులు వేసి చిటపటలాడాక వేయించిన ముట్టీలను వేసి, మరోసారి వేయించాలి. వీటిని వేడి వేడిగా ఏదైనా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
రాహుల్.. కొత్తిమీరకు, మెంతికి తేడా తెలుసా?
గాంధీనగర్: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు రైతులకు మద్దతుగా రోడుపైకి వచ్చి నిరసన తేలుపుతున్నాయి. కానీ గుజరాత్లో మాత్రం భారత్ బంద్ పాటించమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉత్తర గుజరాత్‌లోని మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రూపానీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టారు. ఇప్పుడు వారు రైతులకు మద్దతు తెలపుతున్నాం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నీకు వ్యవసాయం, రైతుల గురించి ఏ మేరకు అవగాహన ఉందో అందరికి అర్థమవుతుంది. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలుసా నీకు.. సమాధానం చెప్పు’ అంటూ రూపానీ ఎద్దేవా చేశారు. (చదవండి: విశ్వాస పునరుద్ధరణ కీలకం) అంతేకాక నరేంద్ర మోదీ ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని సాల్వ్ చేస్నున్నారని తెలిపారు రూపానీ. ‘ప్రస్తుతం రైతుల పేరు చెప్పి కాంగ్రెస్ లబ్ది పొందాలని భావిస్తుంది. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధర, సాగు నీరు వంటి అంశాల గురించి అస్సలు పట్టించుకోలేదు. బీజేపీ హయాంలో వీటన్నింటిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతుంది’ అంటూ రూపానీ విమర్శించారు. -
మెంతితో మేలు ఎంతో...
లీఫ్ ఫ్యాక్ట్స్ మెంతి ఆకు అనగానే మధుమేహంతో బాధపడే వారు ఆహారంగా తీసుకోవాల్సిన ఆకుకూరగానే అనుకుంటారు కొందరు. కానీ మెంతులు, మెంతి ఆకు తీసుకోవడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలు అనేకం. మెంతులు, మెంతి ఆకు ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావాలు, బిడ్డ నెలలు నిండకుండా పుట్టడం వంటి సమస్యలు రావు. ప్రసవ నొప్పుల తీవ్రత తగ్గుతుంది. బాలింత మెంతి ఎక్కువగా వాడితే పాలు సమృద్ధిగా పడతాయి. మెంతి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రుతుక్రమ సమస్యలు, ఒంటి నుంచి ఆవిరి వచ్చినట్లు ఉండడం వంటి మెనోపాజ్ సమస్యల నుంచి నివారణకు మెంతి బాగా పనిచేస్తుంది. మెంతి ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కౌమారదశ నుంచి వార్ధక్యం వరకు మహిళలకు అన్ని వయసుల్లోనూ మెంతులు, మెంతి ఆకు వాడకం మంచి ఫలితాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. గుండె సంబంధిత అనారోగ్యాలను దూరం చేస్తుంది. సోడియం పనితీరును అదుపు చేసి రక్తప్రసరణ వేగాన్ని, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో చేరే చక్కెర పరిమాణాన్ని, వేగాన్ని తగ్గిస్తుంది. ఇందులోని అమినో యాసిడ్లు ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. జీర్ణక్రియకు ఉపకరిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది.