మెంతి.. ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా దీని సొంతం. ఈ మెంతి ప్యాక్ ట్రై చేశారంటే ముఖం మీది రంధ్రాలు మాయం కావడం ఖాయం.
ఇలా చేయండి
👉🏾రాత్రంతా నానబెట్టుకున్న టీస్పూను మెంతులను, నీళ్లు తీసేసి మిక్సీ జార్‌లో వేయాలి.
👉🏾దీనికి ఆరు వేపాకులు, రెండు కీరదోసకాయ ముక్కలు జోడించి పేస్టుచేయాలి.
👉🏾ఈ పేస్టులో టీస్పూను ముల్తానీ మట్టి, అరటీస్పూను నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి.
👉🏾ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి.
👉🏾తరువాత చేతులని తడిచేసుకుని ఐదు నిమిషాలపాటు మర్దనచేసి చల్లటి నీటితో కడిగేయాలి.
👉🏾వారానికి ఒకసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద కనిపిస్తోన్న రంధ్రాలు, డార్క్ సర్కిల్స్, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి.
👉🏾ముఖ చర్మం బిగుతుగా మారి, మృదువైన నిగారింపుని సంతరించుకుంటుంది.
👉🏾మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830
Comments
Please login to add a commentAdd a comment