కోల్‌కతా : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కేవలం చికిత్సలో ఉపయోగించే ఔషధాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు సైతం అధిక సంఖ్యలో ఈ వైరస్ బారిన పడతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా బెంగాల్ పోలీసులు కొత్త పద్దతులను కనుగొన్నారు. ఆవనూనె, నిమ్మకాయ కలిపిన వేడినీళ్లు తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటామని ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇది ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా ఈ విధానాన్ని ఆచరించాలని పేర్కొంటూ ఓ సర్క్యులర్ విడుదల చేశారు. కమిషనరేట్‌లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ బంధువు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కరోనా బారినపడగా వాళ్లు ఈ పద్ధతులను అనుసరించి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. (రాందేవ్ బాబాకు మహా వార్నింగ్ )
అందరికి అందుబాటులో ఇంట్లోనే దొరికే ఆవనూనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుందనడానికి ఇలాంటివి ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. గతవారం రోజుల క్రితమే డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో ఉన్న పోలీసుకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు ఈ చిట్కాలనే పాటించారు. దీంతో రెండురోజుల్లోనే వారి ఆరోగ్యం మెరుగయ్యిందని పోలీస్ కమిషనర్ త్రిపురారీ ఆర్ధవ్ పేర్కొన్నారు. 'మేం డాక్టర్లు కాకపోయినా చిన్నప్పటి నుంచి మన పెద్ద వాళ్లు అనుసరించేవి చూస్తూ పెరిగినవాళ్లం. మన మూలాలను ఎప్పటికీ మరవద్దు. కరోనా నియంత్రణలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి మా ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ఈ జాగ్రత్తలు పాటించమని సెర్య్యులర్ విడుదల చేశాం. వీటిని పాటించి కరోనాను ధీటుగా ఎదుర్కొన్న వారి అనుభవాలను కూడా జోడించాం 'అని ఆర్థద్ తెలిపారు. (ట్రాన్స్ జెండర్‌ల కోసం ప్రత్యేక రైల్వే స్టేషన్ )
Comments
Please login to add a commentAdd a comment