Clove
-
చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!
లవంగం అనగానేపురాతన కాలం నుంచి వంటలలో వాడే మసాలాగా మాత్రమే గుర్తొస్తుంది. అలాగే పంటినొప్పులకు వాడే లవంగ తైలం గురొస్తుంది. వాస్తవానికి మసాలా దినుసు లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలున్న లవంగ మొగ్గను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలి విపరీతంగా ఉన్న ప్రస్తుతం తరుణంలో లవంగాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.ఆహారానికి మంచి రుచి, వాసన ఇచ్చే లవంగాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి కాపాడుకునేందుకు లవంగాలు ఉపయోపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజుకి రెండు లవంగాలను నమలడం వల్ల బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.ప్రధాన ప్రయోజనాలు లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువముఖ్యమైన పోషకాలూ లభిస్తాయికడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది.కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.శీతాకాలంలో లవంగాలలో ఉండే విటమిన్ ‘సి’ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. శీతాకాలంలో లవంగాల తయారు చేసిన టీ తాగితే జలుబు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు, దగ్గ లాంటివాటికి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది. కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.లవంగాలలో యుజైనాల్ అనే మూలకం యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది, పంటి సమస్యల నివారణలో పనిచేస్తుంది. లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.ఇతర నొప్పుల నివారణలో కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.చర్మ దురదలను తగ్గించడంలో పెట్రోలియం జెల్లీ, ప్లేసిబో కంటే లవంగం నూనె బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్ -
Kitchen Tips: కిచెన్‌లో దుర్వాసనా? యాలకులు, లవంగాలు నీటిలో వేసి వేడి చేసి
కొన్ని రకాల వంటకాలు చేసినపుడు వంట గదిలో వాసనలు అలాగే ఉండిపోతాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి సులువైన చిట్కాలు మీకోసం.. చేపల వాసన పోవాలంటే కిచెన్‌లో చేపల వాసనను పోగట్టడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. గిన్నెలో వేడి నీరు తీసుకుని.. దానిలో నిమ్మరసం పిండండి. మీగిలిన తొక్కలను కూడా నీటిలోనే వేయండి. దీన్ని ఒక స్ప్రే డబ్బాలో పోసి వంటగదిలో స్ప్రే చేస్తే వాసన పోతుంది. నిమ్మకాయతో ఇలా మీ వంట గదిలో ఏదైనా ఘాటైన వాసన వస్తుంటే. నీటిలో నిమ్మకాయను సగం కట్ చేసి వేయండి. దీన్ని పది నిమిషాలు మరగనివ్వండి. తర్వతా గ్యాస్ కట్టేసి అలా వదిలేయండి. ఇలా చేస్తే మీ వంట గదిలోని ఘాటైన వాసన నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. దానిలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సుగంధ ద్రవ్యాలతో.. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి సువాసన వెదజల్లే మసాలా దినుసులను తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా వేడిచేయాలి. ఇవి నీటిలో వేసి వేడి చేస్తే వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి. వంటగదిలోని దుర్వాసన పోతుంది. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి మీ ఇంట్లో స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది. ఇది రూమ్ ఫ్రెష్నర్గా కూడా పనికొస్తుంది. వెనిగర్ ►ఇంట్లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసనను వెనిగర్ ఈజీగా పొగొడుతుంది. ►దీనికోసం మూడు గిన్నెల్లో వెనిగర్‌ని పోసి కిచెన్‌లో మూడు చోట్ల ఉంచాలి. ►10 నుంచి 15 నిమిషాల్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ►అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటే.. వెడల్పాటి గిన్నెలో నీరు, వెనిగర్ తీసుకుని, దానిలో నిమ్మతొక్కలు వేయాలి. ►తర్వాత ఈ నీటిని గ్యాస్ ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సిమ్‌లో పెట్టి వేడి చేయాలి. ►తర్వాత స్టౌ ఆఫ్ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్‌లో దుర్వాసన పోతుంది. కమలా తొక్కలతో.. ►డస్ట్బిన్లోని చెత్త కారణంగా కొన్ని సార్లు వంటగదిలో దుర్వాసన వస్తుంది. ►ఈ సమయంలో ఒక గిన్నెలో నీరు పోసి దానిలో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు మరిగించండి. ►గిన్నెను అలాగే ఉంచేస్తే.. దుర్వాసన పోయి.. సువాసన వస్తుంది. ►ఇక మీ వంటగదిలో కూర మాడిన వాసనలు పోగొట్టుకోవాలంటే... వంట గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే సరి! చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? మెదడులో కలవరం.. ఫిట్స్‌తో తస్మాత్ జాగ్రత్త -
Hair Care: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా!
జడ ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఆధునిక జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, సరైన పోషణ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు రాలే సమస్య వేధిస్తోంది చాలా మందిని. అలా కాకుండా కేశాలు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. అల్లం, ఆవాలు, లవంగాలతో.. ►అల్లం తురుము టేబుల్ స్పును, టీస్పూను ఆవాలు, ఐదు లవంగాలను తీసుకుని ఒక కాటన్ వస్త్రంలో మూటకట్టాలి. ►మీరు వాడుతోన్న హెయిర్ ఆయిల్‌ను గాజు సీసాలో పోసి, దానిలో ఈ మూటను మునిగేటట్లు పెట్టాలి. ►ఒకరోజంతా సీసాను ఎండలో ఉంచాలి. ►మరుసటిరోజు ఈ నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి. ►ఒకరోజంతా ఉంచుకుని తరువాతిరోజు తలస్నానం చేయాలి. ►ఇలా వారానికి ఒకసారి ఈ అయిల్ను తలకు పట్టించడం ద్వారా జుట్టురాలడం తగ్గి, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ►నూనె అయిపోయిన తరువాత మొదట చెప్పుకున్నట్లుగానే తాజాగా తయారు చేసుకుని వాడితే పదిహేను రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. చదవండి: Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! -
లవంగాలు, యాలకులు, జీలకర్ర.. ఈ టీ తాగి చూడండి!
వేసవి కాలంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు అతిగా దాహంవేయడం, ఆకలి తక్కువగా ఉండడం. ఇది క్రమేణా ఎసిడిటీకి దారితీస్తుంది. ఏదైనా తిన్నవెంటనే వాంతయ్యేలా అనిపిస్తుంది. అయితే, ఈ టీ తాగడం వల్ల ఈ సమస్యలు రావు. అంతేగాక ఇది డీహైడ్రేషన్‌కు గురి కానియ్యదు. శరీరానికి చలవ చేస్తుంది. కూలింగ్ టీ తయారీకి కావలసినవి: నీళ్లు – కప్పున్నర, లవంగాలు – రెండు, యాలకులు – రెండు, ధనియాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పంచదార – ఒకటిన్నర టీస్పూన్లు. తయారీ విధానం.. ►లవంగాలు, యాలకులను కచ్చాపచ్చాగా దంచి కప్పున్నర నీటిలో వేయాలి. ►వీటితోపాటు ధనియాలు, జీలకర్ర కూడా వేయాలి. ►ఈ నీటిని పదినిమిషాల పాటు సన్నని మంట మీద మరిగించాలి ►పది నిమిషాల తరువాత పంచదార వేసి ఐదు నిమిషాలు మరిగించి దించేయాలి. ►ఈ టీని ఉదయం అల్పాహారం తర్వాత గానీ సాయంత్రం గానీ తాగవచ్చు. చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
క్రిస్మస్ వేళ ఇంటి కళకు సువాసనలు అద్దే అభరణాలు
చలికి మరింత ముడుచుకుపోయే కాలం ఇది. ఈ సమయంలోనే ఆశలపల్లకి నీ.. ఆనందాల సంబరాన్నీ మోసుకువస్తుంది క్రిస్మస్. చల్లగా కొంచెం డల్‌గా ఉండే ఈ కాలంలో మంచి సువాసనలతో, కాంతిమంతమైన రంగులతో అలంకరించుకోవడం ఈ శుభదినాలలో చూస్తుంటాం. దాంట్లో భాగంగానే ఎన్నో అందమైన అలంకరణలు చోటుచేసుకుంటాయి ఇళ్లల్లో.. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకునేవి ఎండు ఫలాలు. మసాలా దినుసులు, సువాసనలు వెదజల్లే ఆకులు. వీటిని కూడా కలుపుతూ హారంలా కట్టి, తోరణంలా అలంకరించి, వేలాడదీసి.. గొప్పగా అలంకరించుకుంటారు. ఎండిన నారింజ తొనలు, లవంగ మొగ్గలు, ఇలాయిచీలు, బిర్యానీ ఆకులు.. ఇలాంటివన్నీ ఈ అలంకరణలో చోటుచేసుకుంటాయి. నారింజ తొనలు ► డైనింగ్ టేబుల్ ప్రత్యేక అలంకరణ కోసం కొన్ని పచ్చని ఆకులు, వాటి మధ్యన ఒకట్రెండు ఎండిన నారింజ తొనలను ఉంచవచ్చు. ఎండిన నారింజ తొనలు పచ్చని హరితాల మధ్య మరింత అందంగా కనిపిస్తాయి. ► ఆకులు పువ్వులతో చేసిన అందమైన పుష్పగుచ్ఛంపై కొన్ని నారింజ తొనలను డెకోరేట్ చేసి గోడలను అలంకరించుకోవచ్చు. హారంలా గుచ్చి, తోరణంలా గది గోడకు లేదా ఒక కార్నర్ ప్లేస్‌లో వేళ్లాడదీయవచ్చు. దాల్చిన చెక్క.. లవంగ మొగ్గ ► ఎండిన కొమ్మను ఆకులు లేకుండా పూర్తిగా తీసేసి, ఆ కొమ్మకు నారింజ తొనలు, బిర్యానీ ఆకులు, కొన్ని దాల్చిన చెక్కలు, మరికొన్ని లవంగ మొగ్గలు.. హారంలా గుచ్చి డైనింగ్ రూమ్‌లో ఒక గోడకు వేలాడదీయవచ్చు. దీని వల్ల ఆ గదికి ప్రత్యేకమైన అందంతో పాటు మంచి సువాసన వస్తుంది. ఈ దండలను క్రిస్మస్ చెట్టుకు కూడా అలంకరిస్తుంటారు. అందమైన బహుమతి ► ఎండిన నారింజ తొనలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, చెక్కపూసలు, దారపు పోగులతో అల్లిన టాసెల్స్, రిబ్బన్లతో అందమైన అలంకరణ వస్తువును తయారుచేయవచ్చు. దీనిని ఇంట్లో అలంకరించుకోవచ్చు. ఆత్మీయులకు క్రిస్మస్ కానుకగానూ ఇవ్వచ్చు. ► అలంకరణలో వాడుకున్న ఈ దినుసులను ఆహారపదార్థాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. అంటే, వీటి వల్ల ఇంటికి పండగ కళ రావడంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుందన్నమాట. ఈ అలంకరణ తయారీలో పిల్లలను పాలుపంచుకునేలా చేస్తే వారికి ఇదో అద్భుతమైన శిక్షణ అవుతుంది. కాలానుగుణంగా తీసుకునే దినుసులు, పదార్థాల పట్ల అవగాహన పెరుగుతుంది. ఆనందమూ కలుగుతుంది. ఇంటిల్లిపాదికి ఆరోగ్యమూ చేకూరుతుంది. -
టొమాటో కొబ్బరి బాత్
తయారి సమయం: 45 నిమిషాలు కావలసినవి: బియ్యం – ఒకటిన్నర కప్పులు; కరివేపాకు – రెండు రెబ్బలు; లవంగం – 1; దాల్చిన చెక్క – 1; ఉల్లిపాయ – 1; టొమాటోలు – 3; తరిగిన కొత్తిమీర – అర టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడా; నూనె– టేబుల్ స్పూన్, నెయ్యి – అర టేబుల్ స్పూన్; నీళ్లు – రెండున్నర కప్పులు పేస్ట్ కోసం:వేయించిన ధనియాలు – అర టేబుల్ స్పూన్; వేయించిన జీలకర్ర – అర టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; లవంగాలు – 3; దాల్చినచెక్క – 1, ఏలకులు – 2; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – 1 పై పదార్థాలన్నింటికీ కొద్దిగా నీటిని చేర్చి గ్రైంyŠ చేసి పేస్ట్ చేసుకోవాలి. తయారి: ∙పాత్రలో నూనె, నెయ్యి వేడయిన తరవాత లవంగాలు, దాల్చిన చెక్క వేసి అర నిమిషం వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు జత చేసి నాలుగు నిమిషాలు వేయించాలి. ∙దీంట్లో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఉప్పు, బియ్యం జత చేసి నిమిషంపాటు కలపాలి. ∙రెండున్నర కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి కలపాలి. ∙మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిన తరవాత దింపేయాలి. ∙చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇష్టమయిన గ్రైవీతో వేడివేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటుంది. -
లవంగం... స్ట్రెస్ బస్టర్!
లవంగాన్ని సుగంధద్రవ్యంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తున్నప్పుడు ఒక్క లవంగమొగ్గను బుగ్గన పెట్టుకుంటే ఆ దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. లవంగంతో కలిగే మరికొన్ని ప్రయోజనాలు. ►లవంగం నోటికి సంబంధించిన చాలా విషాలను లవంగం హరిస్తుంది. దాంతో శ్వాస తాజాగా ఉంటుంది. ►గొంతు బొంగురుగా ఉన్నప్పుడు, గొంతునొప్పి ఉండి, పట్టేసినట్లుగా ఉన్నప్పుడు లవంగాన్ని నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ, ఆ రసం కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే గొంతులోని ఇబ్బంది తగ్గుతుంది. ►లవంగం మంచి స్ట్రెస్‌బస్టర్. కొన్ని తులసి ఆకులు, కాసిన్ని పుదీనా ఆకులు, ఇంకొన్ని యాలకులతో పాటు రెండు లవంగం మొగ్గలను నీళ్లలో కాచి తాగితే ఒత్తిడి తొలగిపోయి, కొత్తగా శక్తి పుంజుకుంటారు. ►వాంతి వచ్చినట్లుగా ఉన్నప్పుడు ఒక లవంగం నోట్లో పెట్టుకొని చప్పరించడం మంచిది. లవంగం వల్ల వికారం, వాంతులు కూడా తగ్గుతాయి. ►లవంగం టీ కింది నుంచి వెళ్లే గ్యాస్ సమస్యను నివారిస్తుంది. అంతేకాదు... లవంగం జీర్ణశక్తిని పెంచి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ►లవంగాలు హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టిస్తాయి. అందుకే వాటిని నోటిలో ఉంచుకొని చప్పరించినప్పుడు చిగుర్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించడం వల్ల పళ్ల, చిగుర్ల ఆరోగ్యం బాగుంటుంది. ►లవంగం నుంచి తీసే యూజెనాల్ అనే రసాయనంలో నొప్పిని తగ్గించే గుణం ఉంది. అందుకే పంటి నొప్పికి లవంగం నూనెను ఉపయోగిస్తుంటారు. ►లవంగంలోని చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. -
హెల్త్ టిప్స్
పళ్లనొప్పులకు... అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పంటిపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గుకు... టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్లవచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్క , రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే అజీర్ణం, తేపులు రాకుండా ఉంటాయి. -
ఇంటిప్స్
చక్కెర డబ్బాకు, ఇతర స్వీట్లను ఎంత జాగ్రత్తగా, ఎత్తులో పెట్టినా... చీమలు కొత్త దారులు వెతుక్కుంటాయి. కిటికీలు, గోడల మీద నుంచి బాటలు వేసేస్తాయి. చీమల దారిలో దాల్చిన చెక్క లేదా లవంగం పెడితే ఇక ఆ దారిన చీమలు ప్రయాణించవు. ఇక అవి మరొక దారిని వెతుక్కునే దాకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే చక్కెర, స్వీట్ డబ్బాలో లవంగాలు లేదా దాల్చిన చెక్క పెడితే చీమలు దరిదాపులకు కూడా రావు. బుక్షెల్ఫ్ను శుభ్రం చేసి సర్దిన కొద్ది రోజులకే సన్నటి పురుగులు వస్తుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. షెల్ఫ్‌లో గంధపుచెక్కను ఉంచితే పురుగులు దరి చేరవు. మార్కెట్లో అసలైన గంధపు చెక్క దొరకడం కొంచె కష్టమే. గంధం పొడిలో కొద్దిగా నీటిని కలిపి గోళీలుగా చేసి ఆరిన తర్వాత పుస్తకాల మధ్య పెట్టవచ్చు. బట్టల బీరువా పాత వాసన రాకుండా ఉండాలన్నా కూడా ఇదే ఫార్ములా. ఆకుకూరలు వండేటప్పుడు ముదురుగా ఉన్న కాడలను తీసి పారేస్తుంటాం. అలాగే కొత్తిమీర కాడలు కూడా. ముదరు కాడలను చిన్న ముక్కలు చేసి లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి మొక్కలకు వేస్తే... చక్కటి ఎరువుగా పని చేసి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. -
తిండి గోల
లవంగాలు మనవి కావట! నోరు వికారంగా అనిపిస్తే వంటింటి డబ్బాలన్నీ వెతికి ఓ లవంగం తెచ్చిస్తుంది అమ్మ. కడుపు ఉబ్బరంగా అనిపిస్తే బామ్మ నోట, పంటి నొప్పి వస్తే నాన్న బుగ్గన లవంగం ఉండటం తెలిసిందే! ఆరోగ్య ప్రదాయినిగా, నొప్పి నివారిణిగా పేరుకొట్టేసిన లవంగ అంతమేరకే ఊరుకోలేదు. కోడి కూర, వేట కూర, చేపల పులుసు, బిర్యానీ.. శాకమైనా, మాంసమైనా వంటకాలు ఘుమ ఘుమలాడటానికి ‘నేనుండాల్సిందే’ అని తన ఘాటు మన నషాలానికంటించేస్తోంది లవంగ. మనకెప్పుడో పరిచయమైన లవంగ క్రీ.పూ. 330 ఏళ్ల క్రితమే చైనీయులు నోటి దుర్వాసనకు వాడారని, ఈజిప్టు వాళ్లు క్రీ.పూ 100 ఏళ్ల క్రితమే ఉపయోగించారని, రోమన్ల ద్వారా క్రీ.పూ 400 ఏళ్ల క్రితమే యూరప్ దేశాలకు వచ్చిందని. లవంగం గురించి చరిత్ర విస్తారంగా చెబుతోంది. అక్కడా ఇక్కడ విస్తరించి అరబ్బు మర్చెంట్స్ ద్వారా ఇండియాకు పరిచయం అయ్యి, మన కిచెన్ షెల్ఫ్ ఎక్కి దర్జాగా కూర్చుంది. డచ్ దేశాల్లో విస్తారంగా పండించే లవంగ పంటను మన దేశంలో కేరళ, కర్నాటక.. వంటి కొన్ని శీతల ప్రాంతాలలో మనం చూడవచ్చు. అయినప్పటికీ మనదగ్గర దీని దిగుబడి తక్కువేనట. లవంగ నూనె కోసం దీని చెట్టు ఆకులు, బెరడు, కొమ్మలు కూడా వాడతారు.