మనిషి నిత్యం శారీరక లేదా మానసిక ఒత్తిళ్లకు (స్ట్రెస్)కు లోనవుతున్నప్పుడు జుట్టు రాలిపోవడం చాలా సాధారణంగా జరిగే పరిణామం. మనం బాగా ఒత్తిడికి (స్ట్రెస్‌కు) గురైనప్పుడు మనలో స్రవించే హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అది జుట్టును రాల్చేలా చేస్తుంది. అంతేకాదు... మనం శారీరకంగా జబ్బుపడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో స్ట్రెస్ కూడా అలాంటి భౌతికమైన మార్పులు కలిగేలా చేసి, జుట్టును రాలిపోయేలా చేస్తుంది.
స్ట్రెస్‌తో లేదా శారీరకంగా కలిగే జబ్బుల వల్ల జుట్టు రాలడం అన్నది... జుట్టు రాలడం నుంచి మళ్లీ పెరగడం వరకు జరిగే ‘జుట్టు సైకిల్’లో ఒకటైన ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అనే దశ కారణంగా సంభవించే పరిణామం. ఈ టిలోజెన్ ఎఫ్లూవియమ్ దశలో వెంట్రుక ఫాలికిల్ పూర్తిగా విశ్రాంతి దశలోకి వెళ్తుంది. అందుకే ఈ దశలో జుట్టు రాలి మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. అందుకే జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు, తాము ఏ కారణంగానైనా ఒత్తిడికి లోనవుతున్నారేమో గమనించి, దాన్ని దూరం చేసుకోవాలి. ఒత్తిడి తొలగగానే మళ్లీ జుట్టు మామూలుగానే వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment