Conditioner
-
అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు ఎందుకంటే?...
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అదీగాక గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ సేనలు పుంజుకుంటూ రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయ ఢంకా మోగించనుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌కి అడ్డుకట్టేవేసేలా... రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను సమీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక వేళ రష్యా ఓడిపోతానన్న అనుమానం తలెత్తిన వెంటనే అణుదాడులకు దిగుతుందని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అణుయుద్ధం జరిగేటప్పుడూ జుట్టుకి కండిషనర్‌ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని స్వయంగా పుతిన్ చెప్పినట్లు అమెరికా చెబుతుంది. ఈ మేరకు అమెరికా తన పౌరులకు అలాంటి విపత్కర సమయాల్లో చేయాల్సినవి, చేయకూడనవి విషయాలు గురించి వివరించింది. అణు యుద్ధం సమయంలో హెయిర్ కండీషనర్ వినియోగించటం ప్రాణాంతకమని పేర్కొంది. అంతేగాదు అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళిని మేఘాలు గాల్లోకి నెట్టేస్తాయి. అలాంటి సమయాల్లో వీలైనంత త్వరగా షాంపుతో తల స్నానం చేయాలని సూచించింది. దీనివల్ల సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతమని తెలిపింది. తలస్నానం చేసిన వెంటనే కండీషనర్‌ని మాత్రం వినియోగించొద్దు అని సలహ ఇచ్చింది. షాంపూ జుట్టుని శుభ్రపరిస్తే..కండీషనర్‌లోని సర్ఫ్యాక్టెంట్లు నీటీని, నూనెను ఆకర్షిస్తాయని చెప్పింది. ఈ కండీషనర్, మీ జుట్టుకి రేడియోధార్మిక వంటి పదార్థాల మధ్య జిగురులా పని చేస్తుంది. దీంతో ఈ రేడియోథార్మిక పదార్థాలు జుట్టును గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోతాయని, దీంతో ప్రాణాంతకంగా మారుతోందని అమెరికా హెచ్చరించింది. అలాగే ఇలాంటి అణు విస్పోటనం జరిగినప్పుడూ...రేడియేషన్‌ని నివారించటానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనంలో ఆశ్రయం పొందాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకకూడదని సూచించింది. (చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్) -
Hair Care: జుట్టు చివర్లు చిట్లుతున్నాయా? ప్రతిరోజూ తలస్నానం చేస్తే..
Hair Care Tips: ఇటీవల వర్కింగ్ ఉమన్ ఎక్కువగా బైక్ వాడుతూ, ఎండల్లో తిరుగుతుంటారు. ఇలాంటి కొందరిలో హెల్మెట్ బయట ఉండే వెంట్రుకల చివర్లు చిట్లుతుండటం చాలా సాధారణం. తగిన రక్షణ లేకుండా ఇలా దుమ్ముకూ, కాలుష్యానికీ, ఎండకు ఎక్స్పోజ్ కావడం వల్ల జుట్టు / వెంట్రుకల చివర్లు చిట్లే ప్రమాదం ఉంటుంది. లుక్స్ పరంగా మహిళల్లో ఇది కొంత ఆవేదన కలిగిస్తుంది. దుమ్ము, కాలుష్యం, ఎండ అనే ఈ మూడు అంశాలూ ఇలా చిట్లేలా చేయడంతో పాటు నిర్జీవంగా కనిపించేలా చేయడం ద్వారా జుట్టుకు నష్టం చేస్తుంటాయి. ఇలాంటివారు కొన్ని జాగ్రత్తలతో జుట్టు చిట్లే ప్రమాదాన్నుంచి కాపాడుకోవచ్చు! ►టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలన్నీ దాదాపుగా పూర్తిగా కప్పి ఉండేలా చూసుకునేందుకు స్కార్ఫ్ వంటివి వాడండి. ►మరీ రోజూ తలస్నానం చేయడమూ మంచిది కాదు. వారానికి రెండు రోజులు మంచిది. అయితే జుట్టులో మరీ దురద ఎక్కువగా వచ్చేవారు రోజు మాత్రం విడిచి రోజు తల స్నానం చేయడం మేలు. రోజూ తలస్నానం చేయాలనుకున్నవారు కేవలం మైల్డ్ షాంపూలనే ఉపయోగించాలి. తలస్నానం తర్వాత కండిషనర్ వాడటం చాలావరకు మేలు చేస్తుంది. ►డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ షాంపూలూగానీ, హెయిర్‌కు సంబంధించిన ఉత్పాదనలుగానీ ఉపయోగించకూడదు. ►తలస్నానం తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే డైమిథికోన్, ట్రైజిలోగ్జేన్, విటమిన్–ఈ, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్... వంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉండే హెయిర్ సీరమ్ వాడటం జుట్టుకు జరిగే నష్టాన్ని చాలావరకు నివారించవచ్చు. ►అప్పటికీ జుట్టు చివర్లు చిట్లడం సమస్య తగ్గకపోతే డర్మటాలజిస్ట్/ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి. చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
వారంలోనే మెరుపు!
పళ్లు తెల్లగా మెరవాలంటే రోజూ బ్రషింగ్ అయ్యాక ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బ్రషింగ్ అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని ఓ రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే పళ్లు తళతళా మెరవడం ఖాయం. జుట్టుకు రకరకాల కండీషనర్లు వాడి, రసాయనాలతో విసిగిపోయారా? అయితే ఇంట్లో ఉండే కండీషనర్‌తో ఇటు ఆరోగ్యంగానూ అటు ఆర్థికంగానూ లాభం పొందండి. కుంకుడు రసంతో కానీ షాంపూతో కానీ తల స్నానం చేశాక తేనెను జుట్టుకు పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోండి. అంతే నిగనిగలాడే కండీషన్డ్ హెయిర్ మీ సొంతం. ముఖంపై మొటిమలతో బాధపడే వారు ఒక్క గుడ్డుతో వాటిని మాయం చేసుకోవచ్చు. ఒక చిన్న పాత్రలో గుడ్డును పగలగొట్టి తెల్ల సొనను వేయండి. చిన్న బ్రష్ సాయంతో మొటిమలపై ఆ సొనను రాసుకొని కాసేపు కునుకు తీయండి. లేచిన వెంటనే ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. గుడ్డు తెల్ల సొన మొటిమలపై ఎంతసేపు ఉన్నా ఎలాంటి నష్టం ఉండదు. ఈ చిట్కా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. -
శిరోజాలకు కండిషనర్...
పొడిగా మారిన వెంట్రుకల చివర్లు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారం.. * బాగా మగ్గిన అరటిపండును గుజ్జులా చేసి, దాంట్లో గుడ్డు సొన వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15-30 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం కురులకు సహజసిద్ధమైన కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. * పావు కప్పు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కప్పు నీటిలో కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఆ నీటితో వెంట్రుకలను తడపాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషన్‌ని ఇస్తుంది.