
ప్రతీకాత్మక చిత్రం
Hair Care Tips: ఇటీవల వర్కింగ్ ఉమన్ ఎక్కువగా బైక్ వాడుతూ, ఎండల్లో తిరుగుతుంటారు. ఇలాంటి కొందరిలో హెల్మెట్ బయట ఉండే వెంట్రుకల చివర్లు చిట్లుతుండటం చాలా సాధారణం. తగిన రక్షణ లేకుండా ఇలా దుమ్ముకూ, కాలుష్యానికీ, ఎండకు ఎక్స్‌పోజ్ కావడం వల్ల జుట్టు / వెంట్రుకల చివర్లు చిట్లే ప్రమాదం ఉంటుంది.
లుక్స్ పరంగా మహిళల్లో ఇది కొంత ఆవేదన కలిగిస్తుంది. దుమ్ము, కాలుష్యం, ఎండ అనే ఈ మూడు అంశాలూ ఇలా చిట్లేలా చేయడంతో పాటు నిర్జీవంగా కనిపించేలా చేయడం ద్వారా జుట్టుకు నష్టం చేస్తుంటాయి.
ఇలాంటివారు కొన్ని జాగ్రత్తలతో జుట్టు చిట్లే ప్రమాదాన్నుంచి కాపాడుకోవచ్చు!
►టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలన్నీ దాదాపుగా పూర్తిగా కప్పి ఉండేలా చూసుకునేందుకు స్కార్ఫ్ వంటివి వాడండి.
►మరీ రోజూ తలస్నానం చేయడమూ మంచిది కాదు. వారానికి రెండు రోజులు మంచిది. అయితే జుట్టులో మరీ దురద ఎక్కువగా వచ్చేవారు రోజు మాత్రం విడిచి రోజు తల స్నానం చేయడం మేలు. రోజూ తలస్నానం చేయాలనుకున్నవారు కేవలం మైల్డ్ షాంపూలనే ఉపయోగించాలి. తలస్నానం తర్వాత కండిషనర్ వాడటం చాలావరకు మేలు చేస్తుంది.
►డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ షాంపూలూగానీ, హెయిర్‌కు సంబంధించిన ఉత్పాదనలుగానీ ఉపయోగించకూడదు.
►తలస్నానం తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే డైమిథికోన్, ట్రైజిలోగ్జేన్, విటమిన్–ఈ, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్... వంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉండే హెయిర్ సీరమ్ వాడటం జుట్టుకు జరిగే నష్టాన్ని చాలావరకు నివారించవచ్చు.
►అప్పటికీ జుట్టు చివర్లు చిట్లడం సమస్య తగ్గకపోతే డర్మటాలజిస్ట్/ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.
చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
చదవండి👉🏾Hair Care Tips: వాల్‌నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల