White Hair Tips In Telugu: Top 4 Precautions To Take While Applying Henna - Sakshi
Sakshi News home page

Hair Care: తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే!

Published Thu, Sep 30 2021 11:24 AM | Last Updated on Thu, Sep 30 2021 1:39 PM

Beauty Tips In Telugu: Hair Care Henna Uses - Sakshi

Beauty Tips in Telugu: వయసుతో పనిలేకుండా అందరి జుట్టు తెల్లబడుతుంది. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు వివిధ రకాల రంగులు, హెన్నాలను వాడుతుంటారు. హెన్నా జుట్టుకు ఎంతో మేలు చేసినప్పటికీ హెన్నా తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. 

►జుట్టుకు కండీషనర్‌గా హెన్నా పెట్టాలనుకున్నప్పుడు హెన్నాలో ఉసిరిపొడి, పెరుగు లేదా గుడ్డు తెల్లసొన కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఉసిరిపొడి లేనప్పుడు బాదం నూనెను హెన్నాలో కలుపుకోవచ్చు. 

►హెన్నా పెట్టడడం వల్ల పొడిబారిన జుట్టును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెరుగు ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో రెండు స్పూన్ల ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.

►అరటి పండు గుజ్జుకు అలోవెరా జెల్‌ రెండు స్పూన్లు, స్పూను కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.

►ఆలివ్‌ ఆయిల్, తేనె, నిమ్మరసం, వెనిగర్, గుడ్డు తెల్ల సొనలను తీసుకుని అన్నిటినీ బాగా కలిపి జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత హెడ్‌బాత్‌ చేస్తే కురులు మృదువుగా మారతాయి. 

చదవండి: 

Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! డిప్రెషన్‌తోపాటు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement