White Hair
-
ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!
ప్రస్తుత రోజుల్లో తెల్లజుట్టు అనేది కామన్ అయ్యిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అంతేగాదు ఎవరూ పెద్దవాళ్లో, చిన్నవాళ్లో చెప్పడం కూడా కష్టంగా ఉంది. అలా అయిపోయింది మన జీవనశైలి. దీనికి తోడు బయట ఉండే కాలుష్యం కారణంగా మెరిసిపోవడం తోపాటు ఊడిపోతుంది. అందుకోసం బయట మార్కెట్లో కనిపించే హెయిర్ డైల పై ఆధారపడుతుంటాం. అవేమో నానా రకాల సైడ్ ఎఫ్‌క్ట్ ఇచ్చి మరో సమస్య ఎదురవ్వుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టి ఇంట్లోనే చక్కగా సహజ పద్ధతిలో డై చేసుకుంటే అంతకుమించి హాయి ఇంకొకటి ఉండదు. అయితే ఇదెలా చేయాలి. అందుకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి అని కంగారు పడొద్దు. అవన్నీ మనఇంట్లో దొరికేవే. మన నిత్యం చూసే వాటితోనే సులభంగా చేయ్యొచ్చు. అవేంటో చూద్ధాం. ! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గానే ఇంట్లోనే డైని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఉల్లి తొక్క. ఉల్లి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని రానియ్యకుండా చేస్తుంది. ఇందులోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకి మంచిది. ఉల్లితొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అలోవెరా జెల్‌లోనూ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి, జుట్టు, చర్మానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని దూరం చేసి జుట్టు మెరిసేలా, సాఫ్ట్‌గా చేస్తుంది. అంతే కాదు, జుట్టు మూలాలకు సహజ తేమని అందించడంలో అలోవెరా జెల్ ముందుంటుంది. ఎలా చేయాలంటే.. ఈ నేచురల్ డైకి ముఖ్యంగా కావాల్సింది ఉల్లితొక్క. ఫంగస్ లేని ఉల్లి తొక్కుని తీసుకుని ఓ పాన్వేసి బాగా వేయించండి. మొత్తం నల్లగా మారాలి. దీనిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇందులోని కలబంద జెల్ వేసి బాగా కలపండి. దీనిని జుట్టుకి రాయండి. ఇది మొత్తం నేచురల్ పద్ధతిలో తయారైన హెయిర్ డై. దీనిని వారానికి ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తలకి మొత్తంగా రాసి గంట తర్వాత క్లీన్ చేయాలి. ఇది జుట్టుని నల్లగా చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరీ..! (చదవండి: పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా? అతిగా తింటే సమస్యలు తప్పవు!) -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే!
Beauty Tips in Telugu: వయసుతో పనిలేకుండా అందరి జుట్టు తెల్లబడుతుంది. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు వివిధ రకాల రంగులు, హెన్నాలను వాడుతుంటారు. హెన్నా జుట్టుకు ఎంతో మేలు చేసినప్పటికీ హెన్నా తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. ►జుట్టుకు కండీషనర్‌గా హెన్నా పెట్టాలనుకున్నప్పుడు హెన్నాలో ఉసిరిపొడి, పెరుగు లేదా గుడ్డు తెల్లసొన కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఉసిరిపొడి లేనప్పుడు బాదం నూనెను హెన్నాలో కలుపుకోవచ్చు. ►హెన్నా పెట్టడడం వల్ల పొడిబారిన జుట్టును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెరుగు ప్యాక్ బాగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో రెండు స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనె, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►అరటి పండు గుజ్జుకు అలోవెరా జెల్ రెండు స్పూన్లు, స్పూను కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మరసం, వెనిగర్, గుడ్డు తెల్ల సొనలను తీసుకుని అన్నిటినీ బాగా కలిపి జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత హెడ్‌బాత్ చేస్తే కురులు మృదువుగా మారతాయి. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! డిప్రెషన్‌తోపాటు.. -
డై కానివ్వకండి
తెల్ల వెంట్రుకలను నల్లబరచడానికి వాడే రకరకాల రసాయనాల హెయిర్ డైలతో ఒక ఇబ్బంది ఉంది. అవి మాడుపైన సహజమైన నూనెలను తొలగించి, తెల్లవెంట్రుకల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు, వెంట్రుకల కుదుళ్లునూ బలహీనపరుస్తాయి. దీనివల్ల వెంట్రుకలు రాలడం, బలహీనపడటం జరుగుతుంది. అలా కాకుండా.. డై వాడుతున్నప్పటికీ.. జుట్టుకు పూర్వపుకాంతి పోకుండా ఉండాలన్నా, రసాయనాల రంగుల వల్ల వెంట్రుకలు దెబ్బతినకుండా ఉండాలన్నా తరచు కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. ఆముదం – కొబ్బరి నూనె టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న ఈ నూనెను వేళ్లతో అద్దుకుంటూ జుట్టుకుదుళ్లకు పట్టేలా మృదువుగా మర్దన చేయాలి. ఇలా తలంతా పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. రసాయనాలు గాఢత లేని షాంపూల వాడకం మేలు. మందార పువ్వు – ఉసిరి పొడి జుట్టుకు ప్రకృతిసిద్ధమైన మాస్క్. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలమవుతాయి. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడే సమస్య దరిచేరదు. చుండ్రు సమస్య ఉండదు. 2–3 మందార పువ్వులను 2 టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి కలిపి మెత్తగా నూరాలి. మిశ్రమం చిక్కగా తయారవ్వడానికి పెరుగు లేదా కొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌లా పనిచేస్తుంది. హెన్నా లేదా గోరింటాకు పొడి చాలా మంది తెలుపు, నలుపులుగా ఉండే జుట్టుకు హెన్నా (గోరింటాకు పొడి)ను మొట్టమొదటి ఎంపికగా వాడుతుంటారు. ముఖ్యంగా హెయిర్ కలర్స్‌లో రసాయనాలు ఉండి జుట్టు ఊడిపోతుందనే భయం వల్ల కూడా చాలా మంది హెన్నా వాడుతుంటారు. తెల్లవెంట్రుకలకు సరైన చికిత్స ఇవ్వాలంటే.. 5–6 టేబుల్ సూన్ల హెన్నా పౌడర్ని తగినన్ని నీళ్లలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 3–4 గంటల సేపు ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. -
తెల్ల జుట్టుకు బై చెప్పచ్చు
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మనం తరచూ చూస్తూంటాం. విపరీతమైన ఒత్తిడి దీనికి కారణమన్న విషయమూ మనకు తెలుసు. అయితే కారణమేమిటన్నది మాత్రం నిన్న మొన్నటివరకూ ఎవరికీ తెలియదు. ఈ లోటును పూరించారు హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఒత్తిడికి, జుట్టు నెరుపుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది తెలుసుకునేందుకు తాము విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టామని హార్వర్డ్ శాస్త్రవేత్త యా ఛీ హూ తెలిపారు. వృద్ధాప్య లక్షణాలు వేగంగా చోటు చేసుకునేందుకు ఒత్తిడి కారణమవుతుందని, అందువల్లనే జుట్టు తెల్లబడుతోందని ఇప్పటివరకూ అనుకునేవారు. కానీ పరిశోధనల్లో మాత్రం భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఒత్తిడి ఎక్కువైనా వెంట్రుకల కుదుళ్లలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలు తక్కువేమీ కాలేదు. అలాగే.. కార్టిసాల్ అనే హార్మోన్‌కూ వెంట్రుకల నెరుపుకూ సంబంధం లేదని స్పష్టమైంది. వెంట్రుకల కుదుళ్లలో ఉండే కొన్ని రకాల మూలకణాలు ఒత్తిడి ఎక్కువయినప్పుడు అతిగా స్పందిస్తున్నట్లు ఎలుకలపై జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిందని, ఈ క్రమంలో ఆ మూలకణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలూ తగ్గిపోతున్నట్లు తెలిసిందని హూ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ స్థితిలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలుగా మారే మూలకణాలు ఒత్తిడి సమయంలో అతిగా స్పందించడం వల్ల జుట్టు నెరుస్తోందన్నమాట! అంతా బాగుందికానీ.. ఒత్తిడి సమయాల్లో మన శారీరక వ్యవస్థలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ విడుదల చేసే నోరీపైనిఫ్రైన్ అనే రసాయనం మూలకణాలను చైతన్యవంతం చేస్తోందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంట్రుకలు తెల్లబడకుండా కొత్త మందులు కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. -
తెల్లజుట్టుకు కరివేపతో చెక్!
వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా నేటి యువతకు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేసింది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. తెలుపు జుట్టు పోవాలంటే ఏం చేయాలంటే.. మెంతుల పొడిని పెరుగులో కలుపుకుని తలకు రాసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకసారి తలంటు స్నానం చేయాలి.ఉసిరికాయ ముక్కలు, పుదీనా, కరివేపాకును ఓ గుడ్డలో చుట్టి సూర్యకిరణాలు పడేలా మూడు రోజుల పాటు ఉంచండి. మూడు రోజులు తర్వాత పొడి చేసుకుని.. ఈ పొడితో వారానికి ఒకసారి తలకు ప్యాక్ వేసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఉసిరి పొడి ప్యాక్... నిమ్మరసం, బీట్రూట్ రసం, పెరుగు, టికాషన్తో ఈ పొడిని చేర్చి తలకు రాసుకోవాలి. తద్వారా మీ జుట్టు దృఢంగా ఉంటుంది. ఇలా చేస్తే తెల్లజుట్టు మాయమైపోతుంది. -
తెల్లజుట్టు, బట్టతలకు కారణమేంటో తెలిసింది!
న్యూయార్క్: చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం, బట్టతల రావడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే ఈ రెండు సమస్యలకు కారణమేంటో శాస్త్రవేత్తలు గుర్తించారు. కేఆర్‌ఓఎక్స్20 అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదల కారకంగా పనిచేస్తే, మూల కణకారకం (ఎస్సీఎఫ్) జుట్టుకి మంచి రంగును ఇస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ఇవి రెండూ ఉంటేనే జుట్టు మంచి రంగుతో, ఒత్తుగా పెరుగుతుంది. దీనిని నిర్ధారించుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు. మొదట వారు కేఆర్‌ఓఎక్స్20 ప్రోటీన్‌ను ఓ చిట్టెలుక కణాలనుంచి తొలగించారు. వెంటనే దాని జుట్టుపెరుగుదల ఆగిపోయింది. తరువాత వారు మూలకణ కారకాన్ని తొలగించడంతో చిట్టెలుక జుట్టు రంగు తెల్లగా మారింది. దీన్ని బట్టి ఈ రెండు కారకాలపైనే జుట్టుపెరుగుదల, రంగు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. -
తెల్లజుట్టు ఉంటే హృద్రోగ ముప్పు!
లండన్: తెల్లజుట్టు ఉన్న పురు షులకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. అథెరోస్లె్క రోసిస్(రక్తనాళాలు బిరుసెక్క డం), జుట్టు తెల్లబడటంల మధ్య కొన్ని పోలికలు ఉన్నట్లు ఈజిప్టు లోని కైరో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 545 మంది పురుషులపై వీరు పరిశోధన సాగించి ఈ విషయం తేల్చారు. వయసుతో సంబంధం లేకుండా, తెల్లజుట్టు ఎక్కు వగా ఉన్నవారికి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువనీ, తెల్లజుట్టు తక్కు వ ఉంటే ముప్పు తక్కువని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘అథెరోస్లె్కరోసిస్, జుట్టు తెల్లబడటం.. ఇవి వచ్చినప్పుడు శరీరంలో ఒకేరకమైన మార్పులు కలుగుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ వీటి సమస్యా అధికమవుతుంది’ అనే శామ్యూల్ అనే వైద్యుడు చెప్పారు. -
తెల్లదనమా? వద్దు!
నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజంగా వచ్చే మార్పే కాని, ఈ జనరేషన్లో పదేళ్లకే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. సమస్య స్పష్టంగా అద్దంలో కనిపించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ముందుగా జాగ్రత్తపడితే మంచిది కదా! ⇔ రెండు వందల మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూను కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలి. ⇔ కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజూ తలకు పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గడంతోపాటు కేశాలు నల్లబడతాయి. ⇔ మల్లెతీగ వేళ్లను నిమ్మరసంతో కలిపి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి. ⇔ తలస్నానానికి కుంకుడుకాయ, శీకాయవంటి సహజమైన షాంపూలనే వాడాలి. ⇔ తలస్నానం పూర్తయిన తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలని మసాజ్ చేయడం వల్ల సెబాసియస్ గ్రంథులు ఉత్తేజితం కావడంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ⇔ తాజా కొత్తిమీర ఆకుల రసం రాస్తే జుట్టుకి మంచి నిగారింపు వస్తుంది. ⇔ వీటితోపాటు చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారించాలంటే కాఫీ, టీ, మసాలాలు తగ్గించాలి. -
గ్రేట్ లుక్
నల్లని వెంట్రుకల నడుమ తెల్ల వెంట్రుక కనపడితే విలవిల్లాడిపోయి, ఆ ఒక్కటి కాస్తా తన ఫ్యామిలీని పెంచుకుంటూ పోతే.. వేటాడడానికి కత్తెరతో వీలైనంత కాలం విఫలయత్నం చేసి చివరికి రంగుల లోకంలోకి ‘డై’వర్ట్ అయిపోవడం అందరూ చేసే పని. ఈ రోజులకు బై బై అంటూ, ‘బ్లాక్’ మ్యాజిక్ మాటున దాగిపోకుండా వైట్హెయిర్కు వెలుగొస్తోంది. నలుపు తెలుపు మిశ్రమమైన వెరైటీ లుక్ సాల్ట్ అండ్ పెప్పర్‌కు సిటీ సైతం వెల్కమ్ చెబుతోంది. - ఎస్.సత్యబాబు యూరప్‌లో మెచ్యూర్డ్ మెన్ని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. పరిణతి కలిగిన మగవాళ్ల నుంచి బెస్ట్ సెక్యూరిటీ లభిస్తుందని అమ్మాయిలు భావిస్తున్నారట. ఏజ్ కవర్ చేసుకోవడానికి తంటాలు పడడాన్ని వాళ్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడంగా ట్రీట్ చేస్తున్నారట. వుమెన్ నుంచి ఈ తరహా అభిప్రాయాలు వ్యక్తం కావడంతో మెన్ లుక్స్‌ని అవి సహజంగానే ప్రభావితం చేశాయి. దీంతో నెరసిన వెంట్రుకలను అలాగే ఉంచేసే ధోరణికి అది నాంది పలికిందట. హాలీవుడ్‌తో క్రేజ్... పాశ్చాత్య ఆడవాళ్ల ఆలోచనల్లో మార్పు లేదా మరొకటి కావచ్చు.. హాలీవుడ్ నటీనటులు నెరసిన జుత్తుతోనే తెరపై కనిపించడం మొదలైంది. మిడిల్ ఏజ్డ్ మగవాళ్ల ముఖాల మీద కనిపించే తమాషా బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్ హెయిర్‌కి సాల్ట్ అండ్ పెప్పర్ అని ఫ్యాషనీతిజ్ఞులు పేరు పెట్టేశారు. అది తర్వాత తర్వాత హాలీవుడ్ నటుల ఏజ్‌తో పాటు పెరిగి పూర్తి గ్రే హెయిర్‌స్టైల్‌కు రూపాంతరం చెందడం తర్వాతి సంగతి. హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ, రాబర్ట్ డౌనీ వంటి హీరోలు, జెమ్మీ లూ కర్టిస్ వంటి హీరోయిన్ల ద్వారా బాగా పాప్యులరై అక్కడ యువ నటీనటులు, టాప్ మోడల్స్ అనుకరించే దశకు చేరుకుందీ స్టైల్. మేగజైన్ షూట్స్‌కు, ర్యాంప్‌వాక్‌కు సైతం గ్రే హెయిర్ ఆకర్షణగా మారింది. అక్కడ ఈ సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ సరికొత్త ఫ్యాషన్ అనిస్టైలిస్ట్లు అంటుంటే కొన్ని శతాబ్దాల క్రితమే ఉందని మరికొందరు వాదిస్తూ చర్చలు సాగిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్లకూ వైట్నర్... ఆ తెల్ల నల్లని హవా... మెల్లగా మన బాలీవుడ్‌కీ అంటుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖులు పలువురు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ని ఫాలో అవుతున్నారు. మిడిల్ ఏజ్డ్ మోడల్ కమ్ యాక్టర్ మిలింద్ సోమన్ వంటివారు ఈ స్టైల్‌ని పూర్తిగా ఫాలో అవుతూ పరోక్షంగా దీన్ని గ్లామరైజ్ చేస్తున్నారు. దీంతో ఇండియన్ హెయిర్స్టైలిస్ట్లూ సాల్ట్ అండ్ పెప్పర్‌కు సై అంటున్నారు. నసీఫా అలీ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ ఫ్యాషన్ విజృంభణతో సంబంధం లేకుండా ఎప్పటి నుంచో తెల్లని కేశాలతో నిండుగా కనిపించేవారు. అయితే ఈ లుక్కు వచ్చిన క్రేజ్‌ను కొందరు వారికీ ఆపాదించేస్తున్నారు. మరోవైపు ఈ తరహా లుక్కు సూపర్‌స్టార్ డమ్ తెచ్చాడు తమిళ హీరో అజిత్. ఈయన గత కొన్ని సినిమాల నుంచి ఈ ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ.. తమిళనాడులో యూత్‌ను ఇన్స్పైర్ చేస్తున్నాడు. దీంతో అక్కడి యువత వెంట్రుకలు నెరవకున్నా సిల్వర్ కలర్ కోసం పార్లర్లకు క్యూ కడుతున్నారట. మన టాలీవుడ్లో ప్రస్తుతం ఈ లుక్ గురించి చెప్పాలంటే వైవిధ్య నటుడు జగపతిబాబునే చెప్పుకోవాలి. ఆయన విలన్‌గా మారి నటించిన లెజండ్ ద్వారా సాల్ట్ అండ్ పెప్పర్‌ని టాలీవుడ్లో తెరంగేట్రం చేయించారు. ఈ నేపథ్యంలో నగరంలో డై కు బై చెబుతున్నారు కొందరు మిడిల్ ఏజ్డ్ మెన్. ‘గ్రే’ట్ ఫ్యూచర్... ఆహారపు అలవాట్లు, పొల్యూషన్.. కారణాలేవైనా గత తరంతో పోలిస్తే ఇప్పటి తరంలో జుత్తు నెరసిపోవడమనేది చిన్న వయసులోనే సంభవిస్తోంది. అదే సమయంలో నలభైల్లోనూ ఫిట్నెస్ పరంగా బాగుంటున్నారు. ఫిజికల్‌గా ఎనర్జిటిక్‌గా కనపడుతూ, బాగున్నప్పుడు నెరసిన జుత్తు గురించి వర్రీ అవడం దేనికనే ఆలోచన ఈ సాల్ట్ అండ్ పెప్పర్ ట్రెండ్‌కు మరింత ఊతమిస్తోంది. మరోవైపు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. అందంగా, యంగ్‌గా కన్నా కాన్ఫిడెంట్‌గా కనపడేవాళ్లే త్వరగా నలుగురినీ ఆకర్షించగలుగుతున్నారు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మరింతగా తమ కాన్ఫిడెన్స్‌ను ప్రొజెక్ట్ చేస్తుందని ‘సిటీ’జనులు భావిస్తుండడంతో నగరంలో ఈ తరహా లుక్కు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. పర్ఫెక్ట్ అంటున్నారు.. కొంతకాలంగా డై వేసుకోవడం లేదు. ఇప్పుడు అందరూ చాలా బాగుందంటున్నారు. నేచురల్‌గా ఉందంటున్నారు. నా భార్య, సన్నిహితులు మొదట్లో డై వేసుకోమని బలవంతం చేశారు. అయితే పార్టీ సర్కిల్లో నా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కి వచ్చిన క్రేజ్ వారిని కూడా ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఇదే బాగుందని వాళ్లు కూడా అంటున్నారు. - అమీర్ అలీ, వ్యాపారి కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ యూరప్ దేశాల్లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ని బాగా లైక్ చేస్తున్నారు. అయితే అక్కడ ఫ్యాషన్‌గా కాకుండా నేచురల్‌గా స్టార్ట్ అయిందీ ట్రెండ్. ఆ తర్వాత వరల్డ్ అంతా ఫ్యాషన్‌గా మూవ్ అయింది. చెన్నై వంటి నగరాల్లో యూత్ సైతం తమ హెయిర్స్‌ను ఎక్స్ట్రీమ్ లెవల్‌కు బ్లీచ్ చేయించుకుని మరీ ఈ లుక్‌ని ఫాలో అవడం కనిపిస్తోంది. మన దగ్గర యూత్ ఇంకా అంతగా ఆసక్తి చూపడం లేదు కానీ, మిడిల్ ఏజ్డ్ వాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. - సచిన్, మేనియా సెలూన్ -
తెలుపకనే తెలుసుకునే ‘తెలుపు’ కథ!
సమస్య మగాడికి ‘తెలుపు’ అంటే భయం! ‘తెలుపు’... ఒక ఆలోచన! ‘తెలుపు’... ఒక పరిశోధన! ‘తెలుపు’.. ఒక స్థిత ప్రజ్ఞత! తెలుపే సమస్య... తెలుపే పరిష్కారం. ఇప్పుడు ఈ విషయాన్ని మరింత వివరంగా ‘తెలుపు’కుందాం. . ఆ క్షణం... మిన్ను విరిగి వెన్నుమీద పడ్డట్టు... కిరీటం జారి కిందపడ్డట్టు... అధికారం ఆవిరైపోయినట్టు... కాళ్లకింద నేలను ఎవడో లాగేసినట్టు... ఒక్క మాటలో చెప్పాలంటే... ఒక మగాడికి అదో అవమానభరిత క్షణం! భవిష్యత్తు అగమ్యంగా గోచరించే క్షణం. అరచేతిలోని అద్దం అబద్ధం చెప్పదని తెలిసినా... ‘ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు’ అనే అత్యాశ అలముకునే క్షణం. ఆ క్షణం ఏదంటే... మగాడి తలలో తొలి తెల్లవెంట్రుక తలెత్తిన క్షణం! తొలి ‘తెలుపు’ దశ: ‘ఏముంది... ఒక్క వెంట్రుకే కదా నెరిసింది. పీకిపారేస్తే సరి’ అని మగాడు సరిపెట్టుకోలేడు. కానీ, తక్షణ కర్తవ్యం మాత్రం అదే! ఆ తరువాత అంతర్మథనం మొదలు. ‘నాకు ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది?’... ఒక్క తెల్ల వెంట్రుక ఇలా మగాడికి మనశ్శాంతిని దూరం చేయడం మొదలుపెడుతుంది. ఈ మనోవేదన నుంచి బయటపడేందుకు... మగాడు బయట ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడతాడు! అంటే... ‘నా ఫ్రెండ్స్‌లో ఎవరికైనా తెల్ల వెంట్రుకలు వచ్చాయా..? నా వయసులో ఉన్న మరెవరికైనా తల నెరిసిందా?’... అంటూ వెతకడం మొదలుపెడతాడు. సినిమాకి వెళ్లినా... షికారుకి వెళ్లినా... తన వయసు మగాడు కనిపించగానే చూపులు చురకత్తుల్లా అతడి తలలోకి దూరిపోతాయి. ఒక్క తెల్లవెంట్రుక కనిపిస్తే చాలు... ‘హమ్మయ్య... ఫర్వాలేదు. నాకు ఒక్కడికే కాదు, వీడికీ తెల్ల వెంట్రుకలు ఉన్నాయి’ - అనే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. తనకున్న సమస్య తనొక్కడికే కాదు, చాలామందికి ఉందనుకుంటే అదో రకమైన ఉపశమనం! ఆరోజుకి హాయిగా నిద్రపోతాడు. మలి ‘తెలుపు’ దశ: రోజురోజుకీ తెల్లబడుతున్న వెంట్రుకల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అద్దం ముందు నిలబడితే అది వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. గాలింపు చర్యలకు దిగుతాడు మగాడు! తల్లోని తెల్లవెంట్రుకల్ని వెతికివెతికి వాటి పనిపట్టేస్తాడు. అవసరమైతే కత్తెర అనే ఆయుధాలని రంగంలోకి దించుతాడు. అయినా, మనశ్శాంతి కరువు అవుతుంది. దినదిన ప్రవర్ధమానమౌతున్న ‘శ్వేత వర్ణ’ కేశ సంపద వెక్కిరిస్తుంటుంది. ‘ఎవరూ నా తలవైపు చూడకూడదు. చూసినా వాళ్లకి నా తెల్ల వెంట్రుకలు కనిపించకూడదు. కనిపించినా వాళ్లు వాటి గురించి మాట్లాడకూడదు’... ఈ తరహా అనుమానంతో కూడిన భయం లాంటి ఒక వేదన వెంట తరుముతూ ఉంటుంది. ముఖ్యంగా.. అందమైన అమ్మాయిలు ఎదురైనా పక్కనుంచి పలకరిస్తూ వెళ్లినా ఇంతకుముందున్న ఆనందం ఉండదు. ఒకరకమైన కంగారు! ఈ దశలో మగాడికి చేతినిండా పనే. అస్సలు ఖాళీ ఉండదు. ఇంట్లో ఉంటే ఒకచేతిలో అద్దం... మరో చేతిలో జుత్తు! కూంబింగ్ జరుగుతూనే ఉంటుంది. తొలి ‘వర్ణ’ దశ: ‘ఇలా పీక్కుంటూ పోతే ఏం మిగలదు. ఏదో చేయాల్సిందే. తలకి ఏదో పుయ్యాల్సిందే’ - పై రెండు దశలూ దాటాక మగాడికి వచ్చే క్లారిటీ ఇది. ఎవరు చూసినా చూడకపోయినా.. చూసి నవ్వుతున్నా... నవ్వుకుని జోకులు వేసుకుంటున్నా... తెల్లవెంట్రుకలు తెగపెరిగిపోతున్నాయన్న సత్యాన్ని మగాడు గుర్తిస్తాడు. ఒకసారి సత్యాన్ని గుర్తించాక అనుమానాలు తొలగిపోతాయి. అపోహలు చెరిగిపోతాయి. రంగేద్దాం అని నిర్ణయించుకుంటాడు. తెల్ల జుత్తును కవర్ చేద్దాం అన్న ఆలోచన రాగానే మగాడు ‘టీ డికాక్షన్ మరిగించడం’లో ఎక్స్పర్ట్ అయిపోతాడు! హెన్నా తయారు చేసుకోవాలంటే ఇది ఉండాలి కదా! కలర్ కాస్త డార్క్‌గా రావాలంటే ఎవరో చెప్పారని నిమ్మకాయ రసం అందులో పిండుతాడు. తొలిసారి హెన్నా పెట్టుకుంటాడు. గంట తరువాత స్నానం చేసి, అద్దం ముందు నిలబడి... రంగుమారిన జుత్తును చూస్తూ మురిసిపోతాడు. ‘హెయిర్ కాస్త రెడిష్గా ఉండటం ఇప్పుడు ఫ్యాషన్’ అని సర్ది చెప్పుకుంటాడు. ఒకటి... రెండు.. మూడు... నాలుగు... మహా అయితే ఐదేళ్లు... అంతే, తరువాత మరో దశకి చేరుకుంటాడు మగాడు! మలి ‘వర్ణ’ దశ: తల తెలుపును హెన్నా కప్పిపుచ్చలేని స్థితికి చేరుకుంటాడు మగాడు. ‘హెయిర్ మరీ రెడ్‌గా ఉంటోంది. నేచురల్ లుక్ ఉండటం లేదు’- ఇలా ఒక కొత్త రూల్‌ని ఫ్రేమ్ చేసుకుంటాడు. హెయిర్ డై మీదికి దృష్టి మళ్లుతుంది. ప్రకాష్‌రాజ్, బొమన్ ఇరానీ, ఐశ్వర్యారాయ్, మలైకా అరోరా, సోనమ్ కపూర్... వీళ్లందరికీ మగాడు అభిమానిగా మారిపోతాడు. ఎందుకంటే, రకరకాల హెయిర్ డైలకి అంబాసిడర్లు వీళ్లే మరి! వీళ్లలో ఎవరిదో ఒకరి మాట తలకెక్కేస్తుంది. ‘హెయిర్ డై వేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయటగా..? ఆ... ఎంతమంది వేయడం లేదు. హెయిర్ డై వేసుకున్నట్టు అందరికీ తెలిసిపోతుందా..? ఆ... మా వెంకిగాడు వేసుకున్నట్టు ఎవరికైనా తెలుస్తోందా’ - ప్రశ్నకి సమాధానం వెంటనే దొరికేస్తుంటుంది. మొత్తానికి రంగు వేసుకోవడం అలవాటైపోతుంది. మగాడి అలమరలోకి ఒక డై ప్యాకెట్, ఒక బ్రష్ వచ్చి చేరిపోతాయి. తెల్లవెంట్రుకలు మటుమాయం. అక్కణ్నుంచీ మగాడి జీవితంలో ఓ కొత్త రంగు! మగాడు... మళ్లీ మగాడిగా మారిపోతాడు. (నోట్: బట్టతలకి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ప్రతీ దశలోనూ ‘తెల్ల వెంట్రుక‘ స్థానంలో ‘బట్టతల’ అనే మాటను పెట్టుకొని ఆలోచిస్తే చాలు. మగాడు స్థితప్రజ్ఞుడైపోతాడు.) -
వెంట్రుకలు తెల్లబడుతుంటే...!
చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనే సమస్యను ఇటీవల ఎక్కువగా గమనిస్తున్నాం. వంశపారంపర్యం, పోషకాహార లోపం... వీటికి ప్రధానకారణాలు అవుతున్నాయి. జుట్టుకు డై వేయడం ఇష్టపడని వారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ మెంతిపొడి, టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పుదీన రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం బాగా కలపాలి. గంట సేపు అలాగే ఉంచి, తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నేచురల్ షాంపూతో శుభ్రపరుచుకోవాలి. ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. నోట్: అల్లం, తేనె సమపాళ్లలో కలిపి, రోజూ టీ స్పూన్ చొప్పున ఉదయం పూట తీసుకోవాలి. ఉసరి (సి-విటమిన్), ఆకుకూరలు, ఖర్జూర (ఐరన్), చేప ఉత్పత్తులు (విటమిన్-ఇ) ఉండేవి ఆహారంగా తీసుకోవాలి. మసాజ్‌కు నల్లనువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు వెంట్రుకలు తెల్లబడటం, పొడిబారడం సమస్యను నివారిస్తాయి. నల్లని వలయాలకు చక్కని మందు... ముఖం జీవకళ కోల్పోయినట్టుగా కనిపిస్తుందనిపిస్తే ముందుగా చెక్ చేయాల్సింది కంటి చుట్టూత భాగాన్ని. కంటి కింద చర్మం వదులుగా అవడం, నల్లబడటం వంటి సమస్యను గుర్తిస్తే నిద్రవేళలను సరిగ్గా పాటించడం లేదని, పోషకాహారం మీద దృష్టిపెట్టడం లేదని, మానసిక ఒత్తిడి పెరుగుతోందని గుర్తించాలి. అంతేకాదు చర్మం ముడతలు పడుతుంది అనే విషయాన్నీ కంటిచుట్టూత చర్మమే ముందుగా తెలియపరుస్తుంది. అందుకని... నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీని వల్ల ద్రవాలు సక్రమంగా చేరి, కంటిచుట్టూత చర్మం బిగువును కోల్పోదు. చర్మం ముడతలు తగ్గడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూత మృదువుగా రెండు నిమిషాలు రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం తగ్గుతుంది. కంటి చుట్టూత చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నల్లని వలయాలకు మనం తీసుకునే జాగ్రత్తలే మంచి రెమిడీగా పనిచేస్తాయి.