
వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా నేటి యువతకు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేసింది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. తెలుపు జుట్టు పోవాలంటే ఏం చేయాలంటే.. మెంతుల పొడిని పెరుగులో కలుపుకుని తలకు రాసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకసారి తలంటు స్నానం చేయాలి.ఉసిరికాయ ముక్కలు, పుదీనా, కరివేపాకును ఓ గుడ్డలో చుట్టి సూర్యకిరణాలు పడేలా మూడు రోజుల పాటు ఉంచండి.
మూడు రోజులు తర్వాత పొడి చేసుకుని.. ఈ పొడితో వారానికి ఒకసారి తలకు ప్యాక్ వేసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఉసిరి పొడి ప్యాక్... నిమ్మరసం, బీట్రూట్ రసం, పెరుగు, టికాషన్తో ఈ పొడిని చేర్చి తలకు రాసుకోవాలి. తద్వారా మీ జుట్టు దృఢంగా ఉంటుంది. ఇలా చేస్తే తెల్లజుట్టు మాయమైపోతుంది.