తెల్లదనమా? వద్దు!
నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజంగా వచ్చే మార్పే కాని, ఈ జనరేషన్‌లో పదేళ్లకే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. సమస్య స్పష్టంగా అద్దంలో కనిపించిన తర్వాత ట్రీట్‌మెంట్ తీసుకోవడం కంటే ముందుగా జాగ్రత్తపడితే మంచిది కదా!
⇔ రెండు వందల మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూను కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలి.
⇔ కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజూ తలకు పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గడంతోపాటు కేశాలు నల్లబడతాయి.
⇔ మల్లెతీగ వేళ్లను నిమ్మరసంతో కలిపి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.
⇔ తలస్నానానికి కుంకుడుకాయ, శీకాయవంటి సహజమైన షాంపూలనే వాడాలి.
⇔ తలస్నానం పూర్తయిన తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలని మసాజ్ చేయడం వల్ల సెబాసియస్ గ్రంథులు ఉత్తేజితం కావడంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
⇔ తాజా కొత్తిమీర ఆకుల రసం రాస్తే జుట్టుకి మంచి నిగారింపు వస్తుంది.
⇔ వీటితోపాటు చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారించాలంటే కాఫీ, టీ, మసాలాలు తగ్గించాలి.