బ్యూటిప్స్
కొబ్బరి నూనెలో భృంగరాజ్, ఉసిరిక పొడి కలిపి మరిగించి ఆ నూనెతో తలకు మర్దన చేస్తే కేశాలు తెల్లబడకుండా, నల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ నూనెను తలస్నానం చేయడానికి ముందు రోజు రాత్రి మర్దన చేసుకోవచ్చు లేదా రోజూ తలకు పెట్టుకోవచ్చు. తులసి ఆకులు, భృంగరాజ, ఉసిరిక, కలబంద, మందార ఆకులు, కరక్కాయ, కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పెరుగుదల అనూహ్యంగా ఉంటుంది. జుట్టుకు నలుపుదనం వస్తుంది. తలకు చల్లదనాన్నిస్తుంది. తలనొప్పి దూరమవుతుంది.
కలబందను రెండుగా చీల్చి మధ్యలో ఉలవలను పెట్టి కట్టేయాలి. రెండు రోజుల తర్వాత మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అలాగే తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఉలవలలోని పోషకాలు జుట్టు కుదుళ్లను పటిష్ఠపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కలబంద జుట్టుకు మెరుపునిస్తుంది.