
ప్రతి రోజూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు తలకు మసాజ్ చేసినట్లయితే జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. రోజూ తలస్నానం చేసేవాళ్లు తల రుద్దుకునేటప్పుడే పది నిమిషాల సేపు మసాజ్ చేసినట్లు రుద్దితే రెండు పనులూ అవుతాయి.
ఉసిరిక పొడి, కుంకుడుకాయ, శీకాయపొడి అన్నీ సమపాళ్లలో అంతా కలిసి రెండు టేబుల్‌స్పూన్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో కోడిగుడ్డు సొన కలిపి అవసరమైతే కొద్దిగా నీటిని కలిపి పేస్టు చేసుకుని తలంతా పట్టించి పది నిమిషాల సేపు మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన తర్వాత ఇరవై నిమిషాలకు కడిగేయాలి. అవసరమనిపిస్తే కొద్దిగా గాఢత తక్కువగా ఉన్న షాంపూ వాడవచ్చు. వారానికి కనీసం మూడుసార్ల చొప్పున నెల రోజుల పాటు ఈ ట్రీట్‌మెంట్ చేస్తే హెయిర్‌లాస్‌ను పూర్తిగా నివారించవచ్చు.
హెయిర్‌లాస్‌ను కంట్రోల్ చేయడానికి ఆముదం, బాదం నూనె చక్కటి కాంబినేషన్. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన అరగంటకు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిఫలితం ఉంటుంది. ఆముదం, బాదం బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. రోజూ పది నిమిషాల సేపు ఆల్మండ్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలదు.
Comments
Please login to add a commentAdd a comment