కుదుళ్లకు కలబంద
బ్యూటిప్స్
కలబంద జిగురులో కోడిగుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. ఆపైన టవల్ చుట్టేసి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే కుదుళ్లు బలపడి, జుత్తు రాలడం ఆగిపోతుంది. రెండు కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని బాగా గిలకొట్టాలి. ఇందులో రెండు చెంచాల తేనె, మూడు చెంచాల ఆలివ్ ఆయిల్, ఒక చెంచాడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీన్ని మాడుకు, జుత్తుకు బాగా పట్టించి, గంట తర్వాత తలంటుకోవాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
కొబ్బరి నూనెలో అరచెంచాడు లవంగాల పొడి, కొద్దిగా చిదిమిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసి బాగా మరిగించాలి. చల్లారాక మాడుకు, జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత తలంటుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... జుత్తు రాలడం ఆగిపోవడమే కాక కుదుళ్లు గట్టిపడతాయి.