ప్రస్తుత రోజుల్లో తెల్లజుట్టు అనేది కామన్ అయ్యిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అంతేగాదు ఎవరూ పెద్దవాళ్లో, చిన్నవాళ్లో చెప్పడం కూడా కష్టంగా ఉంది. అలా అయిపోయింది మన జీవనశైలి. దీనికి తోడు బయట ఉండే కాలుష్యం కారణంగా మెరిసిపోవడం తోపాటు ఊడిపోతుంది. అందుకోసం బయట మార్కెట్లో కనిపించే హెయిర్ డైల పై ఆధారపడుతుంటాం. అవేమో నానా రకాల సైడ్ ఎఫ్‌క్ట్ ఇచ్చి మరో సమస్య ఎదురవ్వుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టి ఇంట్లోనే చక్కగా సహజ పద్ధతిలో డై చేసుకుంటే అంతకుమించి హాయి ఇంకొకటి ఉండదు. అయితే ఇదెలా చేయాలి. అందుకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి అని కంగారు పడొద్దు. అవన్నీ మనఇంట్లో దొరికేవే. మన నిత్యం చూసే వాటితోనే సులభంగా చేయ్యొచ్చు. అవేంటో చూద్ధాం. !
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గానే ఇంట్లోనే డైని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఉల్లి తొక్క. ఉల్లి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని రానియ్యకుండా చేస్తుంది. ఇందులోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకి మంచిది. ఉల్లితొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఇక అలోవెరా జెల్‌లోనూ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి, జుట్టు, చర్మానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని దూరం చేసి జుట్టు మెరిసేలా, సాఫ్ట్‌గా చేస్తుంది. అంతే కాదు, జుట్టు మూలాలకు సహజ తేమని అందించడంలో అలోవెరా జెల్ ముందుంటుంది.
ఎలా చేయాలంటే..
ఈ నేచురల్ డైకి ముఖ్యంగా కావాల్సింది ఉల్లితొక్క. ఫంగస్ లేని ఉల్లి తొక్కుని తీసుకుని ఓ పాన్‌వేసి బాగా వేయించండి. మొత్తం నల్లగా మారాలి. దీనిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇందులోని కలబంద జెల్ వేసి బాగా కలపండి. దీనిని జుట్టుకి రాయండి.
ఇది మొత్తం నేచురల్ పద్ధతిలో తయారైన హెయిర్ డై. దీనిని వారానికి ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తలకి మొత్తంగా రాసి గంట తర్వాత క్లీన్ చేయాలి. ఇది జుట్టుని నల్లగా చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరీ..!
(చదవండి: పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా? అతిగా తింటే సమస్యలు తప్పవు!)
Comments
Please login to add a commentAdd a comment