చలికాలం చుండ్రుతో జుట్టు పొడిబారనట్లుగా అయిపోయి డల్‌గా ఉంటుంది. దీనిక తోడు ఈ కాలంలో హెయిర్ గ్రోత్ కూడా స్పీడ్‌గా ఉండదు. సీజన్ల వారిగా మన జుట్టుని సంరక్షణ పద్ధతులను కూడా అందుకు తగ్గట్టు కాస్త మార్పులు చేసుకుంటూ కొద్దిపాటి రెమిడ్సిని అనుసరిస్తే కుచ్చులాంటి కురులు మీ సొంతం. అందుకోసం ఫాలో అవ్వాల్సిన రెమిడీలు ఏంటంటే..
- మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్,ఒక టీ స్పూను తేనె తీసుకుని రెండింటినీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తుంటే పొడిబారిపోయిన జుట్టు కూడా చాలా అందంగా తయారవుతుంది.
- మూడు టీ స్పూన్ల ఆముదాన్ని గోరువెచ్చ చేసుకుని, తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. తర్వాత జుట్టంతా చిక్కు లేకుండా దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకుని, వేడి నేటిలో తడిపిన టవల్‌ను తలకు చుట్టి పావుగంటపాటు ఆవిరి పట్టించాలి. తర్వాత నీటితో జుట్టును కడిగేసి, మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి.
- రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెలో టీస్పూను నిమ్మరసం వేసి తలకు మసాజ్ చేసుకోవాలి.
- కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు లేదా కరివేపాకు పేస్ట్ లేదా వేపాకుల పేస్ట్ కలిపి గోరువెచ్చగా అయ్యేంతవరకూ వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి మసాజ్ చేసి మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి.
- కప్పు నీటిలో టీ స్పూను నిమ్మరసం, రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ (మార్కెట్‌లో లభిస్తుంది) వేసి కలుపుకోవాలి. షాంపూతో తలస్నానం చేసిన పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమంతో తలను తడపాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ కనబడుతుంది.
(చదవండి: పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment