కళ్ల చుట్టూ నల్లటి వలయాలు అలసటకు, ఒత్తిడికి అద్దం పడుతూంటాయి. చంద్రబింబం లాంటి ముఖమున్నా, డార్క్ సర్కిల్స్ వేధిస్తూ ఉంటాయి. అందంగా లేమా? అనే అత్మన్యూనత వారిని వెంటాడుతుంది. నిజానికి నల్లటి వలయాలకు కారణాలు అనేకం. జీవనశైలి మార్పులు, వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, నిద్రలేమి , మరికొన్ని ఇతర సమస్యల మూలంగా చాలామందికి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటికి కారణాలు ఏంటి? తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. చాలా మంది డార్క్ సర్కిల్స్‌తో బాధపడతారు. తొందరగా వృద్ధాప్య రూపం వచ్చేసిందని ఆందోళనపడతారు. అయితే కొన్ని జాగ్రత్తలు, ఇంట్లోనే లభించే వస్తువులతో తయారు చేసిన చిట్కాలతో డార్క్ సర్కిల్స్‌నుంచి విముక్తి పొందవచ్చు.
డార్క్ సర్కిల్స్ కారణాలు
ఆందోళన , అలసట
రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం
ఎక్కువ సేపు స్క్రీన్‌కు ఎక్స్‌పోజ్ కావడం, కంటి ఒత్తిడి
అలర్జీలు, డీహైడ్రేషన్, థైరాయిడ్
వయసు మీద పడటం అనేది ప్రధాన సమస్య.
ఇంటి చిట్కాలు
దోసకాయ: దోసకాయ ముక్కలను చక్రాల్లా తరిగి రిఫ్రిజిరేటర్‌లో చల్లబరచండి. వాటిని మూసిన కనురెప్పలపై సుమారు 10-15 నిమిషాల పాటు ఉంచండి. దోసకాయలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కళ్ల వాపు తగ్గి, ,నల్లటి వలయాలు మాయమవుతాయి.
టీ బ్యాగ్‌లు: రెండు టీ బ్యాగ్‌లను (నలుపు లేదా ఆకుపచ్చ) వేడి నీటిలో నానబెట్టి, ఆపై వాటిని రిఫ్రిజిరేటర్‌లో చల్లబరచాలి. వాటిని కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. టీలోని కెఫిన్ , యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శాంతపరుస్తాయి.
బాదం నూనె: పడుకునే ముందు మీ కళ్ల కింద కొన్ని చుక్కల బాదం నూనెను సున్నితంగా మసాజ్ చేయండి. బాదం నూనెలో విటమిన్లు ఇ , కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపర్చి, కాలక్రమేణా పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి.
బంగాళాదుంప రసం: పచ్చి బంగాళాదుంపను తురిమి రసాన్ని తీసుకోవాలి. ఈజ్యూస్‌లో కాటన్ ప్యాడ్‌ను నానబెట్టి, కంటి కింద భాగంలో 10-15 నిమిషాల పాటు అప్లై చేయండి. బంగాళాదుంపలలో ఎంజైమ్‌లు , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి నల్లటి వలయాలను తగ్గించి, కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి.
రోజ్ వాటర్: కాటన్ ప్యాడ్‌లను రోజ్ వాటర్‌లో నానబెట్టి, మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. రోజ్ వాటర్‌లోయాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నల్లటి వలయాలను తగ్గించి, కంటి ప్రాంతాన్ని రిఫ్రెష్ చేస్తాయి.వ
టొమాటో గుజ్జు: తాజా టొమాటో గుజ్జును కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. టొమాటోల్లోలైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగాఉంటాయి. నల్లటి వలయాలను పిగ్మెంటేషన్‌ను తొలగిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
పచ్చి పాలు: చల్లని (ముడి) పాలలో కాటన్ ప్యాడ్‌లను నానబెట్టి, వాటిని మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. పాలలో లాక్టిక్ యాసిడ్ ,విటమిన్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని శాంతపరచడానికి, పిగ్మెంటేషన్‌ను కాంతివంతం చేయడానికి కళ్ల చుట్టూ ఉబ్బినట్లు తగ్గడానికి సహాయపడతాయి.
వీటితోపాటు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకూడదు. చక్కటి నిద్ర, తగినన్ని నీళ్లు అవసరం. కెఫిన్, ఆల్కహాల్ వినియోగం, స్క్రీన్స్ వాడకాన్ని బాగా తగ్గించాలి. అలాగే ఇంటి చిట్కాలతో నయం కాక పోవచ్చు. అంతమాత్రాన బెంగపడాలసిన అవసరం లేదు. నిపుణైలైన వైద్యుల సమక్షంలో లేజర్ థెరపీ, ఫిల్లర్స్, హైలురోనిక్ యాసిడ్, ఇంజెక్షన్స్‌లాంటివా వాడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment