Conditioners
-
చలికాలంలో జుట్టు పొడిబారి డల్‌గా ఉంటుందా?
చలికాలం చుండ్రుతో జుట్టు పొడిబారనట్లుగా అయిపోయి డల్‌గా ఉంటుంది. దీనిక తోడు ఈ కాలంలో హెయిర్ గ్రోత్ కూడా స్పీడ్‌గా ఉండదు. సీజన్ల వారిగా మన జుట్టుని సంరక్షణ పద్ధతులను కూడా అందుకు తగ్గట్టు కాస్త మార్పులు చేసుకుంటూ కొద్దిపాటి రెమిడ్సిని అనుసరిస్తే కుచ్చులాంటి కురులు మీ సొంతం. అందుకోసం ఫాలో అవ్వాల్సిన రెమిడీలు ఏంటంటే.. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్,ఒక టీ స్పూను తేనె తీసుకుని రెండింటినీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తుంటే పొడిబారిపోయిన జుట్టు కూడా చాలా అందంగా తయారవుతుంది. మూడు టీ స్పూన్ల ఆముదాన్ని గోరువెచ్చ చేసుకుని, తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. తర్వాత జుట్టంతా చిక్కు లేకుండా దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకుని, వేడి నేటిలో తడిపిన టవల్‌ను తలకు చుట్టి పావుగంటపాటు ఆవిరి పట్టించాలి. తర్వాత నీటితో జుట్టును కడిగేసి, మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెలో టీస్పూను నిమ్మరసం వేసి తలకు మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు లేదా కరివేపాకు పేస్ట్ లేదా వేపాకుల పేస్ట్ కలిపి గోరువెచ్చగా అయ్యేంతవరకూ వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి మసాజ్ చేసి మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి. కప్పు నీటిలో టీ స్పూను నిమ్మరసం, రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ (మార్కెట్లో లభిస్తుంది) వేసి కలుపుకోవాలి. షాంపూతో తలస్నానం చేసిన పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమంతో తలను తడపాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ కనబడుతుంది. (చదవండి: పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..) -
తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే!
Beauty Tips in Telugu: వయసుతో పనిలేకుండా అందరి జుట్టు తెల్లబడుతుంది. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు వివిధ రకాల రంగులు, హెన్నాలను వాడుతుంటారు. హెన్నా జుట్టుకు ఎంతో మేలు చేసినప్పటికీ హెన్నా తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. ►జుట్టుకు కండీషనర్‌గా హెన్నా పెట్టాలనుకున్నప్పుడు హెన్నాలో ఉసిరిపొడి, పెరుగు లేదా గుడ్డు తెల్లసొన కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఉసిరిపొడి లేనప్పుడు బాదం నూనెను హెన్నాలో కలుపుకోవచ్చు. ►హెన్నా పెట్టడడం వల్ల పొడిబారిన జుట్టును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెరుగు ప్యాక్ బాగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో రెండు స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనె, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►అరటి పండు గుజ్జుకు అలోవెరా జెల్ రెండు స్పూన్లు, స్పూను కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మరసం, వెనిగర్, గుడ్డు తెల్ల సొనలను తీసుకుని అన్నిటినీ బాగా కలిపి జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత హెడ్‌బాత్ చేస్తే కురులు మృదువుగా మారతాయి. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! డిప్రెషన్‌తోపాటు.. -
కురులకు పండుగ కళ
జుత్తు అందంగా మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలనే ఆశ చాలామందికే ఉంటుంది. పండుగ రోజుల్లో ఇంకాస్త స్పెషల్‌గా కనిపించాలనుకుంటారు. అది సహజమే. అయితే ఆ ఆశ నిజం కావాలంటే హెయిర్‌కేర్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మనలో చాలా మంది షాంపూ చేసుకోవడంలోనే పొరపాటు చేస్తుంటారు. షాంపూ చేసుకోవడానికీ ఓ పద్ధతుంది. చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. అందరు మనుషులూ ఒకలా ఉండనట్లే, అందరి చర్మతత్వాలు ఒకలా ఉండనట్లే.. జుట్టు కూడా ఒకలా ఉండదు. జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి. ►పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్షాంపూ వాడితే మంచిది. నార్మల్ హెయిర్ అయితే ఎక్కువ గాఢత లేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి. ►తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకుంటే చాలు. ►టీ డికాక్షన్ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. కండిషనింగ్ ఎలా చేయాలి? షాంపూ చేయడం పూర్తయిన తర్వాత కేశాలకున్న నీటిని పిండేయాలి. కేశాలను వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్ను జుట్టు కుదుళ్లకు, చర్మానికి పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది. ఏ కండిషనర్ మంచిది? చిట్లిపోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్ కండిషనర్ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్ లేదా ఇన్టెన్సివ్ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్ లేదా ఆయిల్ ఫ్రీ కండిషనర్ వాడాలి. సహజసిద్ధమైన కండిషనర్ మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే కండిషనర్ వాడడానికి ఇష్టపడని వాళ్లు హెన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇది సహజసిద్ధమైన కండిషనర్. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే హెన్నా కండిషనర్‌లో ఉపయోగించే వస్తువులను జుట్టు తత్వాన్ని బట్టి మార్చుకోవాలి.గోరింటాకు పొడిలో కోడిగుడ్డు, నిమ్మరసం, కాఫీ లేదా టీ డికాక్షన్, మందార ఆకుల పొడి, ఉసిరిక పొడి (కాస్మొటిక్ ఉత్పత్తులు దొరికే షాపుల్లోను, సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి) ఇనుపపాత్రలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఆరుగంటల సేపు నానిన తర్వాత తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూ వాడకుండా తలస్నానం చేయాలి (హెన్నా ప్యాక్‌ని షాంపూ చేసి ఆరిన జుట్టుకు వేయాలి). హెన్నా ట్రీట్మెంట్ చేస్తే జుట్టురాలడం, చుండ్రు తగ్గడమే కాకుండా మెత్తగా పట్టుకుచ్చులా ఉంటుంది. కనీసం నెలకొకసారి హెన్నా ట్రీట్మెంట్ చేస్తే కేశ సౌందర్యం ఇనుమడిస్తుంది. -
ఏ షాంపూ... ఏకండిషనర్!
ఆనందం చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. టీ డికాక్షన్ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. అలాగే జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి. పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్షాంపూ వాడితే మంచిది. నార్మల్ హెయిర్ అయితే ఎక్కువ గాఢతలేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి. తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకోవాలి. కండిషనింగ్ ఇలా షాంపూ చేయడం పూర్తయిన తర్వాత జుట్టుకున్న నీటిని పిండేయాలి. వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్ను జుట్టు కుదుళ్లకు, మాడుకి (చర్మానికి) పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది. ఏ రకానికి ఏ కండిషనర్ చిట్లి పోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్ కండిషనర్ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్ లేదా ఇన్టెన్సివ్ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్ లేదా ఆయిల్ ఫ్రీ కండిషనర్ వాడాలి.