ఏ షాంపూ... ఏకండిషనర్‌! | which shampoo is best | Sakshi
Sakshi News home page

ఏ షాంపూ... ఏకండిషనర్‌!

Published Fri, Apr 21 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఏ షాంపూ... ఏకండిషనర్‌!

ఏ షాంపూ... ఏకండిషనర్‌!

ఆనందం

చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. టీ డికాక్షన్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. అలాగే జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి. పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్‌షాంపూ వాడితే మంచిది. నార్మల్‌ హెయిర్‌ అయితే ఎక్కువ గాఢతలేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి. తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకోవాలి.

కండిషనింగ్‌ ఇలా
షాంపూ చేయడం పూర్తయిన తర్వాత జుట్టుకున్న నీటిని పిండేయాలి. వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్‌ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్‌ను జుట్టు కుదుళ్లకు, మాడుకి (చర్మానికి) పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది.

ఏ రకానికి ఏ కండిషనర్‌
చిట్లి పోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్‌ కండిషనర్‌ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్‌ లేదా ఇన్‌టెన్సివ్‌ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్‌ లేదా ఆయిల్‌ ఫ్రీ కండిషనర్‌ వాడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement