ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి జుట్టు తొందరగా జిడ్డుపట్టే తత్త్వం ఉంటుంది. వీటినుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాల మాట ఎలా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతుంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది.
తలకు నూనె పట్టించడం
షాంపూ చేయడానికి ముందు జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాలి. తలకు నూనెను పట్టించిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయడం మంచిది.
తల దువ్వుకోవడం
షాంపూ చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వాలి. దువ్విన తర్వాత షాంపూను అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
సల్ఫేట్ రహిత షాంపూలు సో బెటర్
ప్రస్తుతం చాలా మంది బాగా గాఢంగా ఉండే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా మైల్డ్‌గా.. సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను వినియోగించడం మంచిది.
తలకు చన్నీరే మంచిది
జుట్టు సమస్యలతో బాధపడేవారు తలస్నానం చేసే సమయంలో చల్లని లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(చదవండి: అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!)
Comments
Please login to add a commentAdd a comment