Normal hair
-
ఏ షాంపూ... ఏకండిషనర్!
ఆనందం చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. టీ డికాక్షన్ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. అలాగే జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి. పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్షాంపూ వాడితే మంచిది. నార్మల్ హెయిర్ అయితే ఎక్కువ గాఢతలేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి. తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకోవాలి. కండిషనింగ్ ఇలా షాంపూ చేయడం పూర్తయిన తర్వాత జుట్టుకున్న నీటిని పిండేయాలి. వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్ను జుట్టు కుదుళ్లకు, మాడుకి (చర్మానికి) పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది. ఏ రకానికి ఏ కండిషనర్ చిట్లి పోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్ కండిషనర్ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్ లేదా ఇన్టెన్సివ్ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్ లేదా ఆయిల్ ఫ్రీ కండిషనర్ వాడాలి. -
మృదువైన కురులు...
బ్యూటిప్స్ రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు సమతూకంలో ఉండాలి. నార్మల్ హెయిర్ గలవారు చేపలు, చికెన్, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొడి జుట్టు గల వారు పచ్చికూరగాయలు, ముడిబియ్యంతో వండిన అన్నం, అరటిపండ్లు, నట్స్, విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్స్ తప్పనిసరి. జుట్టు జిడ్డుగా ఉండేవారు తాజా ఆకుకూరలు-కూరగాయలతో చేసిన సలాడ్స్, పండ్లు, పెరుగు తీసుకోవాలి. షాంపూ: పొడి జుట్టు గలవారు మాడుపై ఉన్న సహజ నూనెలు పీల్చేయని షాంపూలను వాడాలి. షాంపూతో పాటు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే వెంట్రుకలు ఎక్కువగా పొడిబారకుండా ఉంటాయి. జుట్టు జిడ్డుగా ఉండేవారు వారానికి మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయాలి. గుడ్డు: కోడి గుడ్డులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. మాయిశ్చరైజర్‌ని కోల్పోనివ్వవు. వారానికి ఒకసారి పొడిజుట్టు గలవారు గుడ్డులోని పసుపు సొనను, జిడ్డు గలవారు తెల్లసొనను ప్యాక్ వేసి 15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చుండ్రు నివారణకు : దుమ్ము, వాతావరణ, శుభ్రత లోపాలు చుండ్రుకు కారణం అవుతుంటాయి. 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది.