మార్కెట్లోకి రెండు హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు | Two Hero Electric Bicycles in market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి రెండు హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు

Published Thu, Oct 30 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

మార్కెట్లోకి రెండు హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు

మార్కెట్లోకి రెండు హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు

ధరలు రూ.18,990-19,290 రేంజ్‌లో
న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఏవియర్ మోడల్‌లో రెండు ఈ-సైకిళ్లను బుధవారం మార్కెట్లెకి తెచ్చింది. వీటి ధరలను రూ.18,990, రూ.19,290గా (ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ) నిర్ణయించామని హీరో గ్రూప్ మేనేజిండ్ డెరైక్టర్ నవీన్ ముంజాల్ తెలిపారు. యువ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన ఈ సైకిళ్లు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నైల్లో కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు. ఢిల్లీతో పోల్చితే ఈ నగరాల్లో ఈ సైకిళ్ల ధర అధికంగా ఉంటుందని వివరించారు.

ఢిల్లీ ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా ఎలాంటి వ్యాట్‌ను విధించడం లేదని, అందుకే అక్కడ ధరలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. లిధియమ్ బ్యా టరీలతో తయారైన ఈ ఏవియర్ ఈ-సైకిళ్లలో ఆరు గేర్లు ఉన్నాయని,  5 నుంచి 6 గంటల పాటు చార్జింగ్ చేస్తే గంటకు 25 కిమీ గరిష్ట వేగాన్ని అందుకోగలవని వివరించారు.  వీటిని ఆన్‌లైన్‌లో కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement