పట్టణాలు, నగరాల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. మార్కెట్‌లో దొరుకుతున్న ఈ–సైకిళ్లు, ఈ–మోపెడ్స్, ఈ–స్కూటర్స్‌కు భిన్నంగా కాలిఫోర్నియాకు చెందిన ‘సిక్స్‌త్రీజీరో’ ఇటీవల మూడుచక్రాల ఈ–సైకిల్‌ను ‘ఎవ్రీజర్నీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది 250 వాట్ రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది.
ఏడుస్థాయిల్లో దీని వేగాన్ని మార్చుకోవచ్చు. రోడ్డు బాగుంటే, పవర్ ఆఫ్ చేసుకుని మామూలు సైకిల్ మాదిరిగానే పెడల్స్ తొక్కుకుంటూ కూడా పోవచ్చు. ఒకసారి దీని బ్యాటరీని చార్జ్ చేసుకుంటే, 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించగలదు. ముందువైపు ఒక చక్రం, వెనుకవైపు రెండు చక్రాలు, వెనుక ఉన్న రెండు చక్రాల మధ్య సరుకులు పెట్టుకోవడానికి అనువైన బుట్టతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ మూడుచక్రాల ఈ–సైకిల్ ధర 3,999 డాలర్లు (రూ.3.27 లక్షలు) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment