న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ పలు మోడళ్లపై 33 శాతం వరకు ధరలను తగ్గించింది. ఫేమ్–2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీలను పెంచిన నేపథ్యంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్‌నుబట్టి 12 నుంచి 33 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. మహమ్మారి ఉన్నప్పటికీ గతేడాది అమ్మకాలు జోరుగా సాగాయని కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు.
2024 మార్చి వరకు ఫేమ్–2
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫేమ్–2 స్కీమ్‌ను 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. 2015లో ఫేమ్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే కస్టమర్‌కు రాయితీ కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment