Hero Electric CEO Sohinder Gill
-
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారులకు ఎస్బీఐ బంపరాఫర్, రూ.250కే ఈఎంఐ లోన్!!
ఎలక్ట్రిక్ కొనుగోలుదారులకు ఎస్బీఐ-ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ హీరో బంపరాఫర్లు ప్రకటించాయి. నిబంధలనకు అనుగుణంగా ఎంపికైన కస్టమర్లకు అతితక్కువకే ఫైనాన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపాయి. హీరో సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై కస్టమర్లకు ఫైనాన్స్ అందించేందుకు ఎస్ బీఐతో జతకడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఎస్బీఐ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ యోనో యాప్ ద్వారా చేసిన చెల్లింపులపై అదనంగా రూ.2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాదు అర్హులైన కొనుగోలుదారులు ఎస్బీఐ యోనో యాప్‌లో ఎస్బీఐ ఈజీ రైడ్ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్‌పై 4 సంవత్సరాల పాటు రూ.251 కంటే తక్కువ ఈఎంఐ సౌకర్యంతో రూ.10వేల లోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో ఈఎంఐను మరింత సులభతరం చేయడం ద్వారా దేశంలోని గ్రీన్ మొబిలిటీ విప్లవానికి నాంది పలికినట్లవుతుందని ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బిజినెస్ యూనిట్ చీఫ్ జనరల్ మేనేజర్ దేవేంద్ర కుమార్ అన్నారు. హీరోఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ..ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈనేపథ్యంలో కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఎస్బీఐతో భాగస్వామి అవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ భాగస్వామ్యం గ్రీన్ మొబిలిటీ విప్లవానికి ఆజ్యం పోసేందుకు ఉత్తమ వడ్డీ రేట్లు, ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!
మీరు దసరా, దీపావళి పండుగ సందర్భంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తునారా? అయితే, మీకు అదిరిపోయే శుభవార్త. హీరో ఎలక్ట్రిక్ '30 రోజులు, 30 స్కూటర్లు' పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. మీరు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాలంటే అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 700+ హీరో డీలర్ షిప్ లేదా వెబ్సైట్ లో స్కూటర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసే వినియోగదారులలో ఒక లక్కీ కస్టమర్ తను కోరుకున్న హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ 30 రోజుల్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు అందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా తీయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనం కొన్న తర్వాత వాహనం ఎక్స్ షోరూమ్ ధరను పూర్తిగా రీఫండ్ చేస్తారు. హీరో ఎలక్ట్రిక్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ సర్వీసులు అందిస్తుంది. కస్టమర్లు హీరో ఎలక్ట్రిక్ వెబ్సైట్ లేదా దేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. హీరో ఎలక్ట్రిక్ తక్కువ ధరతో ఈఎమ్ఐ సులభమైన ఫైనాన్సింగ్ సౌకర్యం అందిస్తుంది. అంతేగాక, వినియోగదారులకు లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అయితే, నాలుగు ఏళ్ల తర్వాత బ్యాటరీ, చార్జర్ పై ఎటువంటి వారంటీ వర్తించదు. (చదవండి: టాటా రయ్.. ఝున్‌ఝున్‌వాలా ఖాతాలో 375 కోట్లు!) -
తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ పలు మోడళ్లపై 33 శాతం వరకు ధరలను తగ్గించింది. ఫేమ్–2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీలను పెంచిన నేపథ్యంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్‌నుబట్టి 12 నుంచి 33 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. మహమ్మారి ఉన్నప్పటికీ గతేడాది అమ్మకాలు జోరుగా సాగాయని కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. 2024 మార్చి వరకు ఫేమ్–2 ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫేమ్–2 స్కీమ్‌ను 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. 2015లో ఫేమ్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే కస్టమర్‌కు రాయితీ కల్పిస్తారు. -
హీరో ఎలక్ట్రిక్ రిక్షా వచ్చింది..
ధర రూ. 1.10 లక్షలు న్యూఢిల్లీ: విద్యుత్తుతో నడిచే వాహనాలను తయారు చేసే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ రాహి పేరుతో ఒక ఎలక్ట్రిక్ రిక్షాను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా ధర రూ.1.10 లక్షలు(ఆన్ రోడ్, ఢిల్లీ) అని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. రోజూ నగరాల్లో ప్రయాణించేవారికి, డ్రైవర్లకు ఇబ్బందులు తగ్గించేలా ఈ ఎలక్ట్రిక్ రిక్షాను రూపొందించామని పేర్కొన్నారు. 1,000 వాట్ల మోటార్ ఉన్న ఈ రిక్షాను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 కి.మీ. ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ధ్రువీకరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ రిక్షాలో ప్రయాణికులు, డ్రైవర్ల కోసం అంతర్గత ఎల్ఈడీ లైట్లు, డ్రైవర్ కోసం యూఎస్బీ మొబైల్ చార్జర్, సైడ్ కర్టెన్స్, ప్రయాణికుల వెన్నెముకకు బ్యాక్ సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 120 మంది డీలర్ల నెట్వర్క్ ద్వారా వీటిని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ మోడల్లో అప్‌గ్రేడేడ్ వేరియంట్‌ను త్వరలో అందిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌ల్లో భారీ సంఖ్యలో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలను విక్రయించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దక్షిణ భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్లను విక్రయించామని తెలిపారు.