
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా చార్జింగ్ మౌలిక వసతుల రంగంలో ఉన్న బోల్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశవ్యాప్తంగా 50,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు.
అలాగే 4.5 లక్షల పైచిలుకు వినియోగదార్లకు ప్రయోజనం కలిగించేందుకు 750కిపైగా హీరో ఎలక్ట్రిక్ విక్రయ కేంద్రాల్లో బోల్ట్ చార్జర్స్‌ను అందుబాటులో ఉంచుతారు. 2,000 మంది హీరో ఎలక్ట్రిక్ కస్టమర్ల ఇళ్ల వద్ద చార్జింగ్ యూనిట్లను ఉచితంగా నెలకొల్పుతారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 10 లక్షలకుపైగా చార్జింగ్ పాయి ంట్లను ఏర్పాటు చేయాలన్నది బోల్ట్ లక్ష్యం.
చదవండి: రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్ గుడ్‌బై