Bolt
-
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా చార్జింగ్ మౌలిక వసతుల రంగంలో ఉన్న బోల్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశవ్యాప్తంగా 50,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే 4.5 లక్షల పైచిలుకు వినియోగదార్లకు ప్రయోజనం కలిగించేందుకు 750కిపైగా హీరో ఎలక్ట్రిక్ విక్రయ కేంద్రాల్లో బోల్ట్ చార్జర్స్‌ను అందుబాటులో ఉంచుతారు. 2,000 మంది హీరో ఎలక్ట్రిక్ కస్టమర్ల ఇళ్ల వద్ద చార్జింగ్ యూనిట్లను ఉచితంగా నెలకొల్పుతారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 10 లక్షలకుపైగా చార్జింగ్ పాయి ంట్లను ఏర్పాటు చేయాలన్నది బోల్ట్ లక్ష్యం. చదవండి: రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్ గుడ్‌బై -
ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!
ప్రజలకు రెవోస్ కంపెనీ శుభవార్త తెలిపింది. మరో ఆదాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం రెవోస్ కంపెనీ అద్భుతమైన ఆఫర్ మీ ముందు ఉంచింది. పోర్టబుల్ ఛార్జర్లకు అనుకూలమైన ఛార్జింగ్ పాయింట్లను ఇక ఎవరైనా కొనుగోలు చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు అని తెలిపింది. యూనియన్ స్క్వేర్ వెంచర్స్ మద్దతు గల రెవోస్ కంపెనీ బోల్ట్ పేరుతో ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. దీనిని ఎవరైనా కొనుగోలు చేసి దుకాణాలు, గ్యారేజీలు, వాణిజ్య పార్కింగ్ స్థలాల వద్ద ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లు పోర్టబుల్ ఛార్జర్లు ఇంటి వద్ద ప్రస్తుతం ఉన్న ఎసీ పవర్ సప్లైతో కూడా ఇవి పనిచేస్తాయి. ఈ ఛార్జింగ్ పాయింట్లను సాధారణంగా అయితే ₹3,000కు కొనుగోలు చేసి ఛార్జింగ్ పాయింట్ తెరవవచ్చు. అయితే, ఆఫర్ లో భాగంగా కంపెనీ అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ చివరి వరకు ₹1 ప్రారంభ ధరకు బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లను అందిస్తోంది. ఎనర్జీ కాలిక్యులేటర్ ఛార్జింగ్ యూనిట్లు, పవర్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఎనర్జీ కాలిక్యులేటర్ తో ఈ పాయింట్స్ వస్తాయి. అలాగే, ఛార్జింగ్ పాయింట్ పక్కన ఉంచిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కస్టమర్ బిల్లు చెల్లింపులు కూడా చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఛార్జర్ సెట్ చేయడానికి అయ్యే ప్రాథమిక ఖర్చు తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఇతర ఖర్చులను వసూలు చేయడం లేదు. ప్రీ లాంఛ్ దశలో కంపెనీ భారతదేశంలోని 60 నగరాల్లో సుమారు 2,000 ఛార్జింగ్ పాయింట్లను 3,600 కెడబ్ల్యు సామర్థ్యం గల పాయింట్స్ ఇన్ స్టాల్ చేసింది. రెవోస్ బోల్ట్ మొబైల్ యాప్ ఉపయోగించి ఈవీ యజమానులు ఛార్జింగ్ పాయింట్లను గుర్తించవచ్చు. ఆర్ఈవీవోఎస్ సహ వ్యవస్థాపకుడు జ్యోతిరంజన్ హరీచందన్ బిజినెస్ లైన్‌తో మాట్లాడుతూ.. "మా ఛార్జింగ్ పాయింట్లు ఒక గంటలో ప్రతి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫుల్ ఛార్జ్ చేయగలవు. అంత సామర్థ్యం ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలకు లేదు. ప్రస్తుతం మాతో కొన్ని ఓఈఎమ్ లు పనిచేస్తున్నాయి. వారు తమ ఈవీలను 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే, ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పట్టే ఇతర ఈవీలు కూడా ఉన్నాయి. ఇది ఈవీ బ్యాటరీ టెక్నాలజీ, పోర్టబుల్ ఛార్జర్ పై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు. (చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!) యూరప్, ఆగ్నేయ ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో త్వరలో ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో, ఆర్ఈవీవోఎస్ భారతదేశంలోని 500 నగరాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో 1 మిలియన్ బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లకు పైగా ఇన్ స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెవోస్ కంపెనీని యాదవ్, హరిచందన్ 2017లో స్థాపించారు. యూనియన్ స్క్వేర్ వెంచర్స్, ప్రైమ్ వెంచర్ పార్టనర్స్ నుంచి కంపెనీ 4.5 మిలియన్ డాలర్ల నిధులను ఇప్పటికే సేకరించింది. బెంగళూరు, సింగపూర్లలో కార్యాలయాలను కలిగి ఉంది. రెవోస్ సహవ్యవస్థాపకుడు మోహిత్ యాదవ్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య వేగంగా పెరిగాలి అంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. గతంలో దేశ వ్యాప్తంగా ఉన్న పసుపు పచ్చ ఫోన్ బాక్స్ మాదిరిగానే, ప్రస్తుతం దేశం నలుమూలల ఆకుపచ్చ బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు" తెలిపారు. కంపెనీ బోల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అభివృద్ది చేసింది. ఇది పేటెంట్ పెండింగ్ మాడ్యులర్ సిస్టమ్, ఇది ఏదైనా ఈవీతో ఇంటిగ్రేట్ చేయబడుతుంది. (చదవండి: ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో మొబైల్ దిగ్గజ కంపెనీ) -
Shocking: వ్యక్తి కడుపులో కేజీకీ పైగా నట్టులు, బోల్టులు
విల్నియస్: కొందరు వ్యక్తులు.. వెంట్రుకలను, బోల్ట్లను తినడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాం. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి లిత్వేనియాలో జరిగింది. ఒక వ్యక్తి కడుపులో దాదాపు కిలోగ్రాము స్క్రూలు, నట్టులు, బోల్టులను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో.. అనుకోకుండా నట్టులు, బోల్టులు, గోర్లు వంటివి తినడం అలవాటు అయింది. దీంతో కొన్ని రోజులుగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు.. అతడిని అంబులెన్స్‌లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వ్యక్తికి డాక్టర్లు స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ వైద్యుల బృందం అతని కడుపులో నుంచి దాదాపు కిలోగ్రాము బరువున్న స్క్రూలు, నట్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
Lightning Bolt: విద్యుత్ స్తంభంపై పిడుగుపాటు..
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): మండలంలోని ఎక్స్‌రోడ్డు లింగోజీ తండాలో విద్యుత్ స్తంభంపై బుధవారం పిడుగుపడింది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్తంభంపై పిడుగు పడడంతో ఎర్తింగ్ వైర్ తెగిందని సర్పంచ్ హరినాయక్ పేర్కొన్నారు. నెట్వర్క్ లేక ఏఎన్ఎంల పాట్లు నార్నూర్(గాదిగూడ): గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోపాటు, గర్భిణి, బాలింతల మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లకు ట్యాప్‌లు అందజేసింది. ప్రతిరోజు ఫీల్డ్ వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటోంది. మంగళవారం గాదిగూడ మండలంలో నెట్వర్క్ సౌకర్యం లేక ఏఎన్ఎంలు పడరాని పాట్లు పడ్డారు. ఝరి పీహెచ్సీ ఏఎన్ఎంలు గుట్ట ఎత్తు ప్రాంతానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వైద్యాధికారి పవన్‌కుమార్.. ఆస్పత్రి భవనం ఎక్కి సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. చదవండి: Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త -
మృత్యువులోనూ వీడని స్నేహం
ముగ్గురు స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతుంటారు. నూతన వస్త్రాలు ధరించి పండగ రోజు కూడా కలుసుకున్నారు. మరికొందరితో కలిసి కాలనీ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం కొందరు ఇంటికి వెళ్లారు. నలుగురు మాత్రం సమీపంలోని ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకున్నారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. అందులో ఒకరు కొద్ది దూరంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. మూత్ర విసర్జనకు వెళ్లిన యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషాదకర∙సంఘటన ముదిగొండలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సాక్షి, ముదిగొండ: ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన బలంతు ప్రవీణ్(20), ఇరుకు శ్రీను(20), గుద్దేటి నవీన్(19) ముగ్గురు ప్రాణ స్నేహితులు. సూర్యాపేటలో బీఎస్సీ ఎంఎల్టీ చదువుతున్న బలంతు ప్రవీణ్ పండగకు మూడు రోజుల ముందే ఇంటికి వచ్చాడు. ఇరుకు శ్రీను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్నాడు. గుద్దేటి నవీన్ ముదిగొండలోనే ఇంటర్ సెంకడియర్ చదువుతున్నాడు. వీరు వేర్వేరుగా చదువుకుంటున్నా, పండగ, శుభకార్యాలలో, సెలవు దినాలలో కలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో విజయదశమి పండగ రోజు కూడా ముగ్గురు కలుసుకున్నారు. వీరితోపాటు మరో యువకుడు ఉసికల గోపి, మరికొందరు స్నేహితులు కలిసి సరదాగా తమ కాలనీ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం పక్కనే ఉన్న ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు ప్రవీణ్, శ్రీను, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. మూత్ర విసర్జనకు కొద్ది దూరం వెళ్లిన మరో యువకుడు ఉసికల గోపి స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలో ఉన్న స్నేహితులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికే ముగ్గురు యువకులు విగతజీవులుగా పడి ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు బలంతు ప్రవీణ్ మృతదేహం; గుద్దేటి నవీన్ మృతదేహం; ఇరుకు శ్రీను మృతదేహం గ్రామంలో ఒకేసారి ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణస్నేహితులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. యువకుల తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూపరులను కంటతడి పెట్టించింది. దసరా పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు రెక్కాడితే కాని డొక్కాడనవి. మూడూ దళిత కుటుంబాలే. చదువుకుని ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివిస్తున్నారు. బలంతు ప్రవీణ్ తల్లిదండ్రులు బాబు, వెంకటమ్మ నిరుపేదలు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు చందు పదో తరగతి చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్న కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఇరుకు శ్రీను తల్లిదండ్రులు ఏసు, అలివేలు. సోదరికి వివాహమయింది. వీరిదీ పేద కుటుంబమే. డిగ్రీ చదువుతున్న కుమారుడు తమకు ఆసరా అవతాడనుకుంటున్న సమయంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గుద్దేటి నవీన్ తల్లిదండ్రులు గాలయ్య, విజయమ్మలు కూడా పేదలే. తమ్ముడు కార్తీక్ పదో తరగతి చదువుతున్నాడు. ఇంటర్ చదువుతున్న కుమారుడు పండగపూట మృతవాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పలువురి పరామర్శ మృతదేహాలను సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ముదిగొండ సర్పంచ్ మందరపు లక్ష్మి, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, టీఆర్ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్‌యాదవ్, కొమ్మినేని రమేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ మందరపు నాగేశ్వరరా వులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇన్చార్జి తహసీల్దా ర్ కరుణాకర్‌రెడ్డి బుధవారం మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున నగదు అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ సంఘటనా స్థలాన్ని బుధవారం ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజు రమేష్ సందర్శించారు. వివరాలను ఎస్ఐ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఎస్ఐ మహేష్, సిబ్బంది ఉన్నారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు ఒకేసారి ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో క్రికెట్ ఆడిన మిత్రులు ఇక లేరనే విషయాన్ని మిగతా స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరితో కలివిడిగా ఉంటారని, ముగ్గురు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు, బంధువులతోపాటు గ్రామస్తులందరూ కదిలివచ్చి యువకులకు కన్నీటి వీడ్కోలు పలికారు. విషణ్ణ వదనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. -
గుండెల్లో 'బోల్ట్' దిగింది!
►ట్రాక్‌పై బోల్ట్ విలవిల ►గాయంతో ఆగిన పరుగు ►పతకం లేకుండానే కెరీర్‌కు వీడ్కోలు జీవితంలో రెండు ఘటనలు ఎప్పుడూ జరగవని నమ్మాను... ఒకటి బోల్ట్ ఓడిపోవడం, రెండు బోల్ట్ పరుగు పూర్తి చేయలేకపోవడం... కానీ వారం వ్యవధిలో ఈ రెండింటినీ చూసేశాను... ఒక అభిమాని బాధ ఇది. నంబర్‌వన్‌గా నిలవకుండా మూడో స్థానంలో వచ్చిన రోజే ఆ పరుగు తడబడుతోందని అర్థమైంది. కానీ ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరో అవకాశం ఉందని ప్రపంచం సర్ది చెప్పుకుంది. కానీ ఆ వేదన ఇప్పుడు రెట్టింపయింది. బంగారు పతకాన్ని అందుకోవటాన్ని మార్నింగ్ వాక్కు వెళ్లినంత సులువుగా మార్చుకున్న ఆ పాదాలు... చివరకు దారి మధ్యలోనే ఆగిపోయాయి. మరో పది అంగల్లో ఎదురుగా లక్ష్యం కనిపిస్తున్నా ఇక నా వల్ల కాదంటూ, అడుగు పడలేదంటూ మొరాయించాయి. అవును...ఉసేన్ బోల్ట్ పరుగు పరాజయంతో ముగిసిపోయింది. ఇక ఈ ‘బ్యాటన్’ను ముందుకు తీసుకువెళ్లలేను అన్నట్లుగా కుప్పకూలిపోయి అతను పరుగు చాలించాడు. ట్రాక్‌కు కళ్లు లేవు... లేదంటే కన్నీరు కార్చేది. పతకానికి నోరు లేదు... ఉంటే గోడు వెళ్లబోసుకునేది. బ్యాటన్‌కు హృదయం లేదు... ఉంటే ద్రవించేది. నిజమే! వాటికి ఇవేవీ లేవు కాబట్టే... బోల్ట్ కథని ఇలా ముగించాయి. పరుగే ప్రాణంగా... పతకమే శ్వాసగా... విజయమే లక్ష్యంగా... ఇన్నాళ్లు సాగిన పయనం చివరకు విషాద గాయంతో ముగిసింది. బోల్ట్ అంటే చిరుత. బోల్ట్ అంటే విజేత. అతని అడుగుల వేగానికి మురిసిపోయిన అథ్లెటిక్స్ ట్రాక్‌లు కూడా ఇకపై వెక్కివెక్కి ఏడుస్తాయేమో! కానీ నిజం. ఈ వీడ్కోలు బాధించింది. 4గీ100 మీటర్ల రిలేలో విజయం చేరువైనంతలోపే దూరమైంది. పది సెకన్ల కాలం తీరని వేదనను మిగిల్చింది. పాదాల తాకిడినే మధుర స్పర్శగా భావించే ట్రాక్‌కు గుండె పగిలినంత పనైంది. బరిలోకి దిగితే పతకాల పనిపట్టే ఓ యోధుడి చివరి మజిలీ ఇలా అర్ధంతరంగా ముగిసింది. లక్ష్యం చేరే చివరి అంచెలో రాకాసి గాయం బోల్ట్‌కు అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కే ఊహించని మలుపునిచ్చింది. లండన్: ఒక్క ఉసేన్ బోల్ట్నో... కోట్లాది మంది అభిమానుల్నో... ఆతిథ్య వేదికనో కాదు... యావత్ అథ్లెటిక్స్ ప్రపంచాన్నే నిరాశకు గురి చేసిన దృశ్యం ఆవిష్కృతమైంది. బోల్ట్ చివరి పరుగు అనూహ్యంగా ముగిసింది. కళ్లకు అందని విషాదాన్ని మిగిల్చింది. తొడ కండరాల గాయంతో జమైకన్ స్టార్ ట్రాక్‌పైనే కూలబడ్డాడు. మెరుపు టైమింగ్‌లతో రికార్డులు బద్దలు కొట్టిన అతని పరుగు అసలు లక్ష్యాన్నే పూర్తిచేయకపోవడం కెరీర్లో ఇదే తొలిసారి. చివరిసారి కూడా! క్రీడాలోకమే మూగబోయే రేస్ శనివారం అర్ధరాత్రి జరిగింది. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో బోల్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎప్పట్లాగే నాలుగో రేసర్‌గా బోల్ట్ చివరి అంచెలో ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నాడు. సహచరుడు యోహన్ బ్లేక్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్ రివ్వున దూసుకెళ్తున్నాడు. అతని కంటే ముందు ఇద్దరే ఉన్నారు. ఇంకో ఏడెనిమిది సెకన్లలో స్వర్ణం, లేదంటే రజతంతో ముగించే రేసును ఎడమ తొడ కండరాల గాయం మింగేసింది. అంతే బోల్ట్ విలవిలలాడాడు. జమైకన్ ప్రజలు, అభిమానుల ‘బోల్ట్... బోల్ట్...’ కేకలు ఒక్కసారిగా నిశబ్దాన్ని ఆవహించాయి. రేసు ముగియకుండానే కెరీర్ ముగిసింది. అయ్యో... బోల్ట్‌కు ఏమిటీ విషమ పరీక్ష అంటూ క్రీడాలోకమే నివ్వెరపోయింది. నిజానికి ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు బోల్టే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్‌పైనే అందరి కళ్లున్నాయి. కానీ ఆ కళ్లే అతని ట్రాక్ విలాపాన్ని చూశాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2012)... ఇదే ఒలింపిక్ స్టేడియంలో బోల్ట్ తన బీజింగ్ (2008) విశ్వరూపాన్ని మరోమారు కళ్లకు కట్టాడు. ట్రిపుల్ గోల్డ్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకొని ప్రపంచంలోనే చురుకైన దిగ్గజంగా ఘనతకెక్కాడు. ఇప్పుడు మాత్రం కెరీర్‌ను వీడాల్సిన సమయంలో పతకాన్ని జారవిడుచుకోవాల్సి వస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు. కానీ ఊహకందనిదే జరిగింది. బోల్ట్ పరుగు పూర్తిచేయకుండానే... టైమింగ్ నమోదు కాకుండానే రేసు ఓటమితో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 40 నిమిషాలకు జరిగిన ఈ రిలే రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. కూలబడిన బోల్ట్‌ను సహచరులు మెక్లీడ్, జులియన్ ఫోర్ట్, బ్లేక్‌లు ఊరడించారు. ట్రాక్‌పై అతని వెన్నంటే నడిచి రేస్‌ను తోడుగా ముగించి వీడ్కోలు పలికించారు. ఫలితాల జాబితాలో డీఎన్‌ఎఫ్... రికార్డు టైమింగ్‌లతో లేదంటే విజయ బావుటాతో ఫలితం జాబితా (రిజల్ట్ షీట్)లో అగ్రస్థానంలో ఉండే బోల్ట్ బృందం తొలిసారి డీఎన్‌ఎఫ్ (డిడ్ నాట్ ఫినిష్–రేసును ముగించలేదు)తో కనబడింది. అన్నీ స్వర్ణాలే... ఇక్కడికి రాకముందు బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. ఈ సారి కాంస్యం (100 మీ.) అంతకుముందు ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4గీ100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. ఆ పోజు ఇక చరిత్రే... పరుగుల చిరుతగా చరిత్రకెక్కిన బోల్ట్ రేసును విజయనాదంతో ముగించగానే ‘లైట్నింగ్ బోల్ట్’గా రెండు చేతుల్ని ఆకాశానికెత్తి చూపించే ‘టు ద వరల్డ్’ పోజు ఇక చరిత్రలో కలిసిపోయింది. మైదానంలో, టీవీల్లో ఇక ప్రత్యక్షంగా కనిపించదు. ‘బోల్ట్ గాయం నన్ను బాధపెట్టింది. నేను అర్థం చేసుకోగలను. టీవీల కోసం, ఇతరత్రా హైలైట్ల కోసం మమ్మల్ని నిరీక్షించేలా చేశారు. కానీ ట్రాక్ సూట్లను విడిచి రేస్‌కు సిద్ధం కావడంతో చలి కాస్త ఇబ్బంది పెట్టింది. అలా చాలాసేపు ఉండటం ఫలితాన్ని ప్రభావితం చేసింది.’ – గాట్లిన్, రజతం నెగ్గిన అమెరికా రిలే జట్టు సభ్యుడు నిర్వాహకులు మమ్మల్ని అదే పనిగా నిరీక్షణలో ఉంచారు. ఇది చాలా దుర్మార్గం. వార్మప్‌లో సుదీర్ఘ నిరీక్షణ వల్లే బోల్ట్ గాయపడ్డాడు. ఎవరైనా పోటీకి సిద్ధమై ఉండి... 20 నిమిషాల వెయిటింగ్లో ఉంచుతారా? దీని వల్లే ఆ దిగ్గజం (బోల్ట్) సతమతమయ్యాడు. పతకం గెలవకపోవడంతో బోల్ట్ సారీ చెప్పాడు. కానీ అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్లో అతనెంతో సాధించాడు. – జమైకన్ అథ్లెట్ యోహన్ బ్లేక్ -
భారత్ ఆశాకిరణం నీరజ్
నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: అంతర్జాతీయస్థాయిలో మరో క్రీడా పండగకు రంగం సిద్ధమైంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈనెల 13 వరకు జరిగే ఈ పోటీలకు ఒలింపిక్ స్టేడియం వేదికగా నిలువనుంది. భారత్ తరఫున 25 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 34 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో భారత్‌కు ఒక్కటంటే ఒక్కటే పతకం వచ్చింది. అదీ కాంస్యమే. 2003 పారిస్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జ్ మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఏకైక కాంస్య పతకాన్ని అందించింది. ఆ తర్వాత పలుమార్లు భారత అథ్లెట్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చారు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రాపై భారత్‌కు ఆశలున్నాయి. గతేడాది ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ 86.48 మీటర్లతో ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ పసిడి పతకాన్ని సాధించాడు. దాంతో నీరజ్ చోప్రాపై అంచనాలు పెరిగాయి. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో ఆగస్టు 10న క్వాలిఫయింగ్... 12న ఫైనల్ జరుగుతాయి. మొత్తం 33 మంది బరిలో ఉండగా... 12 మంది ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచం దృష్టి బోల్ట్‌పైనే.. లండన్‌లోని ఒలింపిక్ స్టేడియంలో శుక్రవారం మొదలయ్యే ఈ పోటీల్లోనే బోల్ట్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈసారి బోల్ట్ రెండు ఈవెంట్స్‌లలో (100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలే) బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 5న 100 మీటర్ల ఫైనల్... ఆగస్టు 12న 4్ఠ100 మీటర్ల రిలే ఫైనల్ జరగనున్నాయి. రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించి కెరీర్‌కు అద్భుతమైన ముగింపు ఇవ్వాలని బోల్ట్ పట్టుదలతో ఉన్నాడు. -
‘లండన్’లో రెండు ఈవెంట్స్‌లో పోటీ పడతా: బోల్ట్
మోంటెకార్లో (మొనాకో): వచ్చే నెలలో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తాను 100 మీటర్లు, 4గీ100 మీటర్ల రిలే విభాగాల్లో పాల్గొంటానని జమైకా విఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. ‘లండన్‌లో గెలవడమే నా లక్ష్యం. విజయంతో నా కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను’ అని ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం ఎనిమిది స్వర్ణాలు నెగ్గిన ఈ జమైకా స్టార్ తెలిపాడు. -
అప్పుడే రెండు లక్షల మంది బుక్ చేశారు!
బోల్ట్ చివరి పరుగుకు భారీ డిమాండ్ లండన్: జస్ట్ ఇప్పుడే ఒలింపిక్స్ ముగిశాయి... మూడు ఈవెంట్లలో స్వర్ణాలు గెలిచి ఉసేన్ బోల్ట్ అందరినీ మురిపించాడు. కానీ వచ్చే ఏడాది జరిగే అతని ఆఖరి పరుగు చూసేందుకు అభిమానులు అప్పుడే ఎగబడిపోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరుగుతుంది. బోల్ట్‌తో పాటు బ్రిటన్ స్టార్ మో ఫరాకు కూడా ఇదే ఆఖరి ఈవెంట్ కావడంతో ఈ రెండు పోటీలపై ఆసక్తి మరింత పెరిగింది. బోల్ట్ 100 మీటర్ల రేస్‌లో పరుగెత్తనున్న స్టేడియం సామర్థ్యం 50 వేలు కాగా... ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు రావడం విశేషం. స్థానిక అథ్లెట్ కావడంతో ఫరా కోసం కూడా పెద్ద ఎత్తున టికెట్లు కొనేందుకు ఫ్యాన్స ఉత్సాహం చూపిస్తున్నారు. అన్ని ఈవెంట్లకు కలిపి 7 లక్షల వరకు టికెట్లు అందుబాటులో ఉంటే టికెట్లు కొనేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య దానిని ఎప్పుడో దాటిపోయింది. మొత్తం 92 దేశాలనుంచి వరల్డ్ చాంపియన్‌షిప్ చూసేందుకు అభిమానులు టికెట్లు కోరుతుండటంతో నిర్వాహకులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
నభూతో... నభవిష్యతి!
⇒ బోల్ట్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం ⇒ 4*100 రిలేలోనూ పసిడి పతకం ⇒ ‘ట్రిపుల్’ ట్రిపుల్ సాధించిన జమైకా స్టార్ ⇒ చివరి ఒలింపిక్స్ ఆడేసిన ‘స్ప్రింట్ కింగ్’ అపరాజితుడు... ఎవరూ అందుకోలేనివాడు... అందరిలో అత్యుత్తముడు... యుగానికొక్కడు... ఇంకా ఏమైనా విశేషణాలు ఉంటే అవన్నీ తనకే చెందాలని జమైకా పరుగువీరుడు ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. తన ఒలింపిక్స్ కెరీర్‌ను తాను కోరుకున్నట్లే అజేయుడిగా ముగించాడు. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ మూడు స్వర్ణాలు సాధించి ‘ట్రిపుల్’ ఘనతను మూడోసారి పునరావృతం చేశాడు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ పరిస్థితిని పరిశీలిస్తే బోల్ట్ ఒలింపిక్స్ ‘ట్రిపుల్ గోల్డ్’ రికార్డు భవిష్యత్‌లో బద్దలయ్యే అవకాశం కనిపించడంలేదు. బోల్ట్‌లాంటి అథ్లెట్ మరొకరు వచ్చినా ఈ ‘జమైకా చిరుత’ రికార్డు కనీసం 12 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. రియో డి జనీరో: అదే ట్రాక్... అదే ఫలితం... అదే పతకం... విభాగం మారినా పతకం రంగు మారలేదు. జమైకా ‘స్ప్రింట్ కింగ్’ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించాడు. శనివారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. అసాఫా పావెల్, యోహాన్ బ్లేక్, నికెల్ యాష్మెడ్, బోల్ట్‌లతో కూడిన జమైకా జట్టు 37.27 సెకన్లలో పోటీని ముగించి అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ జట్టు (37.60 సెకన్లు) రజతం సొంతం చేసుకోగా... కెనడా జట్టు (37.64 సెకన్లు) ఖాతాలో కాంస్యం చేరింది. వాస్తవానికి అమెరికా జట్టుకు మూడో స్థానం లభించింది. అయితే అమెరికా అథ్లెట్ మైక్ రోడ్జర్స్ బ్యాటన్‌ను తన సహచరుడు జస్టిన్ గాట్లిన్‌కు నిర్ణీత వ్యవధిలో అందించడంలో విఫలమయ్యాడని రిప్లేలో తేలింది. దాంతో అమెరికా జట్టుపై అనర్హత వేటు వేశారు. దీంతో నాలుగో స్థానంలో నిలిచిన కెనడాకు కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. 1995 నుంచి ఇప్పటివరకు రిలే రేసుల్లో అమెరికా జట్టుపై అనర్హత వేటు పడటం తొమ్మిదోసారి కావడం గమనార్హం. అందనంత వేగంగా... రిలే రేసు తొలి అంచెలో అసాఫా పావెల్ పరుగెత్తి... రెండో అంచెలో ఉన్న బ్లేక్‌కు బ్యాటన్ అందించాడు. అతను కూడా వేగంగా దూసుకెళ్లి మూడో అంచెలో యాష్మెడ్కు ఇచ్చాడు. యాష్మెడ్ ద్వారా నాలుగో అంచెలో బోల్ట్ బ్యాటన్ అందుకున్నాడు. అప్పటికే అస్కా కేంబ్రిడ్జ్ (జపాన్), ట్రెవెన్ బ్రోమెల్ (అమెరికా) బోల్ట్ కంటే ముందుకు వెళ్లిపోయారు. అయితే తన చేతికి బ్యాటన్ అందగానే బోల్ట్ పెద్ద పెద్ద అంగలు వేస్తూ 30 మీటర్లలోపే ఈ ఇద్దరిని వెనక్కి నెట్టాడు. మిగతా 70 మీటర్లను బోల్ట్ వాయువేగంతో పరుగెత్తి లక్ష్యానికి చేరుకున్నాడు. ఈసారి కూడా జమైకా బృందం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పలేకపోయినా లండన్ ఒలింపిక్స్‌కంటే మెరుగైన సమయాన్ని నమోదు చేసింది. -
చిరుత కూడా ఒప్పుకుంది బోల్ట్ గొప్పోడని
ప్రపంచంలోనే నేనే గొప్పవాడిని... ఎంత మంది ఇలా ధైర్యంగా రొమ్ము విరిచి చెప్పుకోగలరు... మూడు పదుల వయసు అంటే ముసలితనం కాదు, మళ్లీ ‘మూడు’ కొడతా చూడమని సవాల్ చేసి మరీ బరిలోకి దిగేందుకు ఎంత ధైర్యం ఉండాలి, తనపై తనకు ఎంత నమ్మకం ఉండాలి. త్రీ ఇంటూ త్రీ నైన్ అనేది సాధారణ లెక్క మాత్రమే. కానీ బోల్ట్‌కు సంబంధించి అదో చరిత్ర. ప్రపంచ క్రీడా పటంపై మరే అథ్లెట్‌కూ సాధ్యం కాని, ఎవరూ ఊహించేందుకు కూడా సాహసించని నవ స్వర్ణాల ఘనత అది. మూడు ఒలింపిక్స్‌లో అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఆ పరుగు విశ్వ క్రీడా సంబరంలో ముగిసింది. వెళుతూ వెళుతూ కూడా ఆ బంగారపు అడుగులు తమదైన ముద్ర వేశాయి. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా తొమ్మిది పసిడి పతకాలను మెడలో వేసుకొని దర్జాగా అతను ‘తొమ్మిది సెకన్లలో’ ఒలింపిక్స్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక ‘చిరుత’ చింత కూడా తీరిపోయింది... మళ్లీ తన పరుగును ప్రపంచం గుర్తిస్తుందని. చిరుత కూడా బోల్ట్ గొప్పతనాన్ని ఒప్పుకుంది... అతనితో పోటీ పడి అడవిలో కూడా తాను తొమ్మిది స్వర్ణాలు సాధించలేనని. ‘నేను ప్రపంచంలోనే గొప్పవాడిని అని నిరూపించుకునేందుకే రియోలో అడుగు పెట్టాను. ఇప్పుడు దానిని చేసి చూపించాను. ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు. ఈ క్రీడల తర్వాత మొహమ్మద్ అలీ, పీలేల సరసన నిలబడతానని నమ్ముతున్నా’... రిలేలో విజయం తర్వాత సింహనాదం చేస్తూ బోల్ట్ తన గురించి తాను ఒక్క వాక్యంలో చెప్పుకున్న మాట అక్షర సత్యం. అతనొక్కడే కాదు... ప్రపంచం మొత్తం దీనిని అంగీకరించింది. వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో మూడేసి చొప్పున అతను సాధించిన 9 స్వర్ణ పతకాలు ఈ దిగ్గజం గురించి చెబుతున్నాయి. ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచ అథ్లెటిక్స్ను ఒక ఊపు ఊపిన ఈ సూపర్ స్టార్ ఆదివారం (నేడు) తన 30వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. స్ప్రింట్‌కు పర్యాయపదంగా నిలిచిన అతను తాజా స్వర్ణంతో తన ఒలింపిక్స్ ప్రస్థానాన్ని ముగించాడు. 2008 బీజింగ్‌లో బంగారు పతకాలు గెల్చుకున్నా... ఇంత గొప్పగా కెరీర్ ముగించగలడంటే నమ్మలేదు. ‘బీజింగ్‌నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొనగలనని నేనూ ఊహించలేదు. మొదటి ఒలింపిక్స్ కాస్త సంతోషాన్నిచ్చింది. రెండో ఒలింపిక్స్ నాకు సవాల్‌గా నిలిచింది. మూడోది నమ్మలేనంత అద్భుతంగా సాగింది’ అని తన ‘మూడు’ విజయాల గురించి బోల్ట్ విశ్లేషించాడు. ఇప్పటికీ దరిదాపుల్లో లేరు ఒలింపిక్స్‌లో ఇక ముందు తొమ్మిది సెకన్లలో ప్రపంచాన్ని గెలిచే ఆ పరుగు కనిపించదు. ఒక్కో పతకానికి తన స్థాయిని ఆకాశానికి పెంచుకుంటూ తారాపథానికి ఎదిగిన ఆ వ్యక్తి విశ్వ క్రీడా సంబరంలో భాగం కాలేడు. రియో ఒలింపిక్స్‌తోనే ఆఖరు అని బోల్ట్ చాలా ముందే చెప్పేశాడు. బహుశా మళ్లీ పునరాగమనం లాంటి ఆలోచన కూడా చేయకపోవచ్చు. ఈ ఒలింపిక్స్‌లో తన టైమింగ్కంటే చాలా తక్కువగా నమోదు చేయడం, అలవాటైన రీతిలో నెమ్మదిగా పరుగు ప్రారంభించడం... ఇలా ఎన్ని చేసినా బోల్ట్ ఇప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన అథ్లెటే. రియోలో ఎవరూ అతని దరిదాపులకు కూడా రాలేకపోయారు. రిలేలో కూడా చివరి లెగ్‌లో అతను మిగతావారితో పోలిస్తే ఆలస్యంగా బ్యాటన్ అందుకున్నాడు. అయినా సరే మరోసారి ఎలాంటి డ్రామా కనిపించలేదు. ఆ గొప్పతనంలో తేడా రాలేదు. ప్రశాంతంగా అతను ఫినిషింగ్ లైన్‌ను దాటడమే అందరి మనసుల్లో నిలిచిపోయింది. అమెరికా ఆధిపత్యానికి గండి బోల్ట్ రాకముందు స్ప్రింట్‌లో అమెరికా ఆధిపత్యమే కొనసాగింది. ఒక్కసారిగా అతను వచ్చాక దీనికి గండిపడింది. 2008నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికా అథ్లెట్లు బోల్ట్ జోరును ఆపలేకపోయారు. పావెల్, బ్లేక్వంటి సహచరులు కూడా అండగా నిలవడంతో స్ప్రింట్‌ను జమైకా శాసించడం మొదలు పెట్టింది. అమెరికాకు అడ్డుకట్ట వేస్తూ ప్రారంభమైన బోల్ట్ పరుగు... ఈ సారి అదే జట్టు ‘డిస్క్వాలిఫై’ సాక్షిగా ముగియడం యాదృచ్ఛికం. జమైకాను ఓడించాలనే ఒత్తిడిలో తమ ఆటను మరిచి వారు దారి తప్పినట్లు పావెల్ వ్యాఖ్యానించినా... అసలు జమైకాను కాదు బోల్ట్‌ను ఓడించే ప్రయత్నంలో అమెరికా ఒత్తిడికి లోనైంది. ‘నా చేతికి బ్యాటన్ రాగానే నేను గెలిచేశానని నమ్మాను. నేనేం చెబుతున్నానో మీకు అర్థం అయింది కదా. ట్రాక్‌పై నన్ను వెనక్కి తోసేవారెవరూ అప్పుడు నాకు కనిపించలేదు’ అని ఒకరకమైన గర్వంతో బోల్ట్ చెప్పాడు. 2004 ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచి ఆ తర్వాత నాలుగేళ్ల నిషేధానికి గురైన అమెరికన్ గాట్లిన్... మిగిలిన తన కెరీర్ ఆసాంతం బోల్ట్ వెనకే ఉండిపోవాల్సి వచ్చింది. వెనక్కి వెళ్లిన ప్రతిసారీ పుంజుకుని 2008లో అనామకుడిగా వచ్చి స్వర్ణం గెలిచిన కొద్ది రోజులకే బోల్ట్ గాయపడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు బ్లేక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ సారి కూడా గాయాలు వేధించాయి. జూన్‌లో గాయం కారణంగా జమైకా జాతీయ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకోవడంతో అందరికీ సందేహాలు తలెత్తాయి. కానీ అతను అన్నీ పటాపంచలు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు... అనేక సందర్భాల్లో రేసులో వెనుకబడి కూడా మళ్లీ విజేతగా నిలవడం అతనికే చెల్లింది. ఒలింపిక్స్‌లో బోల్ట్ స్వర్ణాలు చూస్తే పరుగు ఇంత సులువా అని అనిపించవచ్చు. కానీ తన కఠోర శ్రమతో అతను గాయాలను గెలిచి అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించాడు. అసలు సమయంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలగడం అతనికే చెల్లింది. 9 ఒలింపిక్స్ ఫైనల్స్... 9 స్వర్ణాలు... ఖేల్ ఖతం! ‘నేను ఇన్నేళ్ల పడిన శ్రమ, తీవ్రమైన ఒత్తిడి, గాయాల సమస్య తర్వాత ఒలింపిక్స్‌లో పరుగు ముగించడం... ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తోంది. అయితే ఇదే నా ఆఖరు పరుగు అని, ఒలింపిక్స్‌లో మళ్లీ ఆడలేనని కాస్త బాధగా కూడా అనిపిస్తోంది’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. స్వచ్ఛమైన పరుగు బీజింగ్ నుంచి రియో వరకూ ఒలింపిక్స్ పతకాలు గెలిచిన ఎనిమిదేళ్లలో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో 11 స్వర్ణాలు, 2 రజతాలు కూడా సాధించాడు. 2011లో ఫాల్స్ స్టార్ట్ మినహా పాల్గొన్న ప్రతీసారి 100 మీ., 200 మీ. లలో స్వర్ణం దక్కింది. ప్రపంచంలో 100 మీ. పరుగులో అత్యుత్తమ టైమింగ్ సాధించిన టాప్-5లో బోల్ట్ మినహా మిగతా నలుగురు టైసన్ గే, బ్లేక్, పావెల్, గాట్లిన్ ఏదో ఒక దశలో డోపింగ్‌లో పట్టుబడినవారే! ఈ స్వచ్ఛమైన పరుగే బోల్ట్‌ను మరింత గొప్పగా నిలబెట్టింది. ఒక దశలో డోపింగ్ చేస్తే తప్ప బోల్ట్‌ను గెలవలేరేమోనని పరిస్థితి కనిపించింది. అయితే అలా చేసినా బోల్ట్‌ను వారు కొట్టలేకపోయారు! ఎనిమిదిగా మారతాయా..! బోల్ట్ స్వర్ణం నెగ్గిన బీజింగ్ 4 100 మీ. రిలే పోటీల్లో భాగస్వామిగా ఉన్న నెస్టా కార్టర్ ఇటీవలే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. త్వరలో జరిగే రెండో పరీక్షలోనూ అతను పాజిటివ్‌గా తేలితే ఆ స్వర్ణం కోల్పోతాడు. అంటే బోల్ట్ నంబర్ కూడా 9నుంచి 8కి పడిపోవచ్చు! ‘ఇది నా గొప్పతనాన్ని తగ్గిస్తుందని అనుకోవడం లేదు. క్లీన్‌గా ఉంటూనే నన్ను నేను నిరూపించుకున్నాను. నిజంగా పతకం పోతే నిరాశకు గురవుతాను. జీవితంలో నా ప్రమేయం లేకుండానే కొన్ని ఇలాంటివి జరిగిపోతాయి’ అని బోల్ట్ అభిప్రాయ పడ్డాడు. ఇంతింతై... వటుడింతై... జమైకాలాంటి ఓ పేద దేశంలో ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బోల్ట్... ఇవాళ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచే ఘనతలు సాధించాడు. కానీ నిజానికి చిన్నతనంలో తను క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ స్కూల్ క్రికెట్ కోచ్ సలహా మేరకు అథ్లెటిక్స్వైపు మళ్లాడు. 2001లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల రేసులో తొలిసారి పాల్గొన్నప్పుడు ఫైనల్‌కు చేరలేకపోయాడు. 15 ఏళ్లు వచ్చేసరికి బోల్ట్ ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలకు చేరింది. 2002లో స్వదేశంలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 200 మీటర్లలో స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కాలి గాయంతోనే 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 200 మీటర్ల రేసులో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. 2007 జపాన్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 200 మీటర్ల విభాగంలో రజతం సాధించాడు. ఈ ఫలితం ద్వారా బోల్ట్ తన కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాడు. ప్రపంచ రికార్డుతో వెలుగులోకి: న్యూయార్క్ వేదికగా 2008 మేలో జరిగిన అంతర్జాతీయ మీట్లో బోల్ట్ 100 మీటర్ల రేసును 9.72 సెకన్లలో ముగించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దాంతో అథ్లెటిక్స్ ట్రాక్‌పై కొత్త సంచలనం వచ్చాడంటూ బోల్ట్ పేరు మార్మోగిపోయింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ బోల్ట్ 100, 200 మీటర్లు, 4*100 మీటర్ల రిలేలో కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పడంతోపాటు స్వర్ణాలను సొంతం చేసుకొని పెను సంచలనం సృష్టించాడు. బెర్లిన్‌లో మెరుపులు: బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు ప్రపంచ రికార్డులు సాధించిన బోల్ట్... 2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల విభాగంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. 4*100 మీటర్ల రిలేలోనూ స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత బోల్ట్‌కు ఎదురులేకుండా పోయింది. ‘ఫౌల్ స్టార్ట్’ చేసి 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల ఫైనల్ రేసు నుంచి నిష్ర్కమించిన బోల్ట్... ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు తాను పాల్గొన్న రేసుల్లో అజేయంగా నిలిచాడు. లండన్‌లో వీడ్కోలు: నేటితో (ఆదివారం) 30 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బోల్ట్ రియోనే తనకు చివరి ఒలింపిక్స్ అని ప్రకటించాడు. వచ్చే ఏడాది ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపాడు. బోల్ట్ వెలుగులోకి రాకముందు డోపింగ్ ఆరోపణలతో అథ్లెటిక్స్ ప్రతిష్ట మసకబారిపోయింది. అయితే ఈ జమైకా స్టార్ రాకతో అథ్లెటిక్స్‌కు మళ్లీ ప్రాణం లేచొచ్చింది. -
బంగార్రాజుకు మళ్లొకటి
-
అథ్లెటిక్స్‌కు వేళాయె..!
ఒలింపిక్స్‌లో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే అథ్లెటిక్స్ పోటీలు నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 2008, 2012 గేమ్స్‌లో 100మీ. 200మీ. 4ఁ100మీ.లలో స్వర్ణాలతో అదరగొట్టిన బోల్ట్ ఆదివారం తొలిసారిగా ట్రాక్‌పై మెరవనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు 100మీ. హీట్స్‌లో, సోమవారం ఉదయం గం.6.55ని.కు ఫైనల్స్‌లో బోల్ట్ బరిలోకి దిగుతాడు. మహిళల 10 వేల మీ. పరుగులో వరుసగా మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచేందుకు చాంపియన్ తిరునేష్ దిబాబా (ఇథియోపియా) ఎదురుచూస్తోంది. మరోవైపు భారత్ నుంచి 36 మంది అథ్లెటిక్స్ బరిలోకి దిగుతున్నారు. -
తప్పక చూడండి
బోల్ట్ పరిగెడుతుంటే... టీవీల ముందు కూర్చున్న మనం ఊపిరి బిగబడతాం..! ఫెల్ప్స్ ఈత కొలనులో చేపలా దూసుకుపోతుంటే సంబరపడతాం..! లిన్ డాన్ స్మాష్‌లు, సెరెనా ఏస్‌లకు మంత్ర ముగ్ధులమై పోతుంటాం..! ఒలింపిక్స్ అంటే ఇలాంటి ఎన్నో గొప్ప విన్యాసాల కలయిక. ప్రతి ఒలింపిక్స్‌లోనూ కచ్చితంగా కొంతమంది ఈవెంట్స్‌ని చూసి తీరాలి. లేకపోతే క్రీడాభిమానికి ఆ వెలితి నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఈసారి రియోలో తమ ప్రదర్శనలతో సంచలనాలు సృష్టిస్తారని భావిస్తున్న దిగ్గజాలు చాలామందే ఉన్నారు. కచ్చితంగా వీరి ఆటను మాత్రం చూసి తీరాల్సిందే. ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్) పురుషుల 100 మీటర్లు (ఆగస్టు 15న ఫైనల్- ఉ. గం. 6.55 ని.కు), 200 మీటర్లు (19న ఫైనల్-ఉ.గం. 7.00కు), 4్ఠ100 మీటర్ల రిలే (20న -ఫైనల్ ఉ.గం. 7.05 ని.కు). అంతా అనుకున్నట్లు జరిగితే ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో ఏ అథ్లెట్ కూడా పురుషుల 100 మీటర్ల విభాగంలో వరుసగా మూడు లేదా ఓవరాల్‌గా మూడు స్వర్ణాలు నెగ్గిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఫామ్, గత రికార్డులను పరిశీలిస్తే... 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 94 కేజీల బరువున్న బోల్ట్ స్వీయ తప్పిదం చేస్తే తప్ప అతణ్ని ఓడించే వారు రియోలో కనిపించడంలేదు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా), యోహాన్ బ్లేక్ (జమైకా) నుంచి బోల్ట్‌కు పోటీ లభించే అవకాశమున్నా... ఇప్పటివరకైతే మెగా ఈవెంట్స్‌లో ఈ జమైకా స్టార్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రికార్డు ఉంది. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మాదిరిగా రియోలో 100 మీటర్లతోపాటు 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ స్వర్ణాలు నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా జరిగితే వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో ‘ట్రిపుల్ గోల్డ్’ సాధించిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్ నిలుస్తాడు. యాష్టన్ ఈటన్ (అథ్లెటిక్స్) పురుషుల డెకాథ్లాన్ (ఆగస్టు 17 నుంచి 19 వరకు) ఒకట్రెండు ఈవెంట్స్‌లో పోటీపడాలంటేనే ఎంతో శ్రమించాలి. అలాంటిది పది అంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) నిలకడగా రాణించి స్వర్ణం సాధించడమంటే మాటలు కాదు. అమెరికాకు చెందిన 28 ఏళ్ల యాష్టన్ ఈటన్ వరుసగా రెండో ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా రియోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 1912 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో బాబ్ మథియాస్ (అమెరికా-1948, 1952), డేలీ థాంప్సన్ (బ్రిటన్-1980, 1984) మాత్రమే డెకాథ్లాన్‌లో రెండుసార్లు స్వర్ణాలు సాధించారు. 2013, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన ఈటన్... ఓవరాల్‌గా 9000 పాయింట్లకుపైగా స్కోరు చేసిన రెండో డెకాథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గతేడాది 9045 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈటన్ రియోలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. కింబర్లీ రోడ్ (షూటింగ్) మహిళల స్కీట్ (ఆగస్టు 12న-క్వాలిఫికేషన్స్, సెమీఫైనల్స్ సా.గం. 5.30 నుంచి రా.గం. 11.30 వరకు), 13న ఫైనల్స్ (రాత్రి గం. 12.00 నుంచి 12.30 వరకు). ఒక్కసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే తమ కెరీర్‌కు సార్థకత లభించిందని భావించే క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. కింబర్లీ రోడ్ మాత్రం వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 37 ఏళ్ల ఈ అమెరికా మహిళా షూటర్ ఈసారీ పతకం సాధిస్తే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో పతకం నెగ్గిన తొలి మహిళా క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. పురుషుల విభాగంలో మాత్రం ఇటలీకి చెందిన అర్మీన్ జోగ్జెలెర్ (వింటర్ ఒలింపిక్స్; ల్యూజ్ ఈవెంట్) మాత్రమే ఈ ఘనత సాధించాడు. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న కింబర్లీ రోడ్ 17 ఏళ్ల ప్రాయంలో తొలిసారి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో పోటీ పడి స్వర్ణం సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ‘డబుల్ ట్రాప్’లో కాంస్యం, 2004 ఏథెన్స్లో ‘డబుల్ ట్రాప్’లో స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ‘స్కీట్’ ఈవెంట్లో రజతం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో ‘స్కీట్’ ఈవెంట్లో స్వర్ణం సొంతం చేసుకుంది. మరి రియో ఒలింపిక్స్‌లో రోడ్ ‘గన్’ గురికి పతకం రాలుతుందో లేదా వేచి చూడాలి. లిన్ డాన్ (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ (ఆగస్టు 11 నుంచి 20 వరకు) బ్యాడ్మింటన్ క్రీడలో ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా పేరొందిన చైనా సూపర్ స్టార్ లిన్ డాన్ ‘హ్యాట్రిక్’ లక్ష్యంతో రియోలో అడుగుపెట్టాడు. 32 ఏళ్ల ఈ చైనా ప్లేయర్ 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణాలు సాధించాడు. బ్యాడ్మింటన్‌లో ‘సూపర్ గ్రాండ్‌స్లామ్’ (తొమ్మిది ప్రముఖ టైటిల్స్ సాధించడం: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, వరల్డ్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్) ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందిన లిన్ డాన్‌కు మలేసియా స్టార్ లీ చోంగ్ వీ, తన దేశానికే చెందిన చెన్ లాంగ్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశముంది. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 70 కేజీల బరువున్న లిన్ డాన్‌కు మెగా ఈవెంట్స్‌లో అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టే అలవాటుంది. రియోలోనూ అదే దూకుడు కొనసాగించి అరుదైన ‘హ్యాట్రిక్’ సాధించి లిన్ డాన్ మరో మైలురాయి చేరుకుంటాడో లేదో చూడాలి. సవోరి యోషిదా (రెజ్లింగ్) మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగం (క్వాలిఫయింగ్, ఫైనల్స్ ఆగస్టు 18న సాయంత్రం గం. 6.30 నుంచి రాత్రి 1.30 వరకు) కవోరి ఇచో (రెజ్లింగ్) మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగం (క్వాలిఫయింగ్, ఫైనల్స్ ఆగస్టు 17న సాయంత్రం గం. 6.30 నుంచి రాత్రి 2.20 వరకు) గతంలో ఏ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని రికార్డును సాధించేందుకు జపాన్ రెజ్లర్లు సవోరి యోషిదా, కవోరి ఇచో ‘రియో’ రంగంలోకి దిగనున్నారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ తొలిసారి ప్రవేశపెట్టినప్పటి నుంచి యోషిదా (55 కేజీలు)... కవోరి ఇచో (63 కేజీలు) వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించారు. 2013లో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఒలింపిక్ వెయిట్ కేటగిరిలో మార్పులు చేయడంతో ఈసారి రియోలో యోషిదా 53 కేజీల విభాగంలో, కవోరి ఇచో 58 కేజీల విభాగంలో పోటీపడనున్నారు. 33 ఏళ్ల యోషిదా తన కెరీర్లో కేవలం రెండు బౌట్లలో మాత్రమే ఓడిపోయింది. వరుసగా 13 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2002 నుంచి 2015 వరకు) స్వర్ణాలు నెగ్గి రెజ్లింగ్ చరిత్రలోనే ఎవరీకి సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్న యోషిదా వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లోనూ (2002 నుంచి 2014 వరకు) పసిడి పతకాలు సాధించడం విశేషం. మరోవైపు 32 ఏళ్ల కవోరి ఇచో 10 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సాధించింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశంలో ఇద్దరు మాత్రమే (అల్ ఒయెర్టర్ (డిస్కస్ త్రో) అమెరికా; 1956, 1960, 1964, 1968... కార్ల్ లూయిస్ (లాంగ్‌జంప్) అమెరికా; 1984, 1988, 1992, 1996) వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించారు. ఈసారీ యోషిదా, కవోరి ఇచో స్వర్ణాలు నెగ్గితే కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఒక్సానా చుసోవితినా (జిమ్నాస్టిక్స్) మహిళల వ్యక్తిగత ఆల్‌రౌండ్, వాల్ట్, ఫ్లోర్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్ఈవెన్ బార్స్ (ఆగస్టు 7న క్వాలిఫయింగ్, 14న వాల్ట్ ఫైనల్) కెరీర్‌కు వీడ్కోలు పలికి కోచ్‌గా లేదా కుటుంబ బాధ్యతల్లో స్థిరపడే వయస్సులోనూ పతకం కోసం బరిలోకి దిగుతున్న జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన 41 ఏళ్ల ఒక్సానా గత ఏడేళ్లుగా జర్మనీ తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటోంది. రియో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న క్రీడాకారుల్లో పెద్ద వయస్కురాలు ఒక్సానాయే కావడం విశేషం. ఒక్సానాకిది వరుసగా ఏడో ఒలింపిక్స్. ఇప్పటి వరకు ఏ జిమ్నాస్ట్ కూడా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొనలేదు. 1991కు ముందు సోవియెట్ యూనియన్ తరఫున పాల్గొన్న ఒక్సానా 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో యూనిఫైడ్ (విచ్ఛిన సోవియట్ యూనియన్ దేశాలతో కూడిన జట్టు) టీమ్ తరఫున ఆడి టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. తన మూడేళ్ల కుమారుడు అలీషెర్కు బ్లడ్ క్యాన్సర్ రావడంతో ఒక్సానా కుటుంబం చికిత్స కోసం జర్మనీకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జర్మనీ తరఫున ఒక్సానా వాల్ట్ ఈవెంట్లో రజతం సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత ఈవెంట్స్‌లో పాల్గొంటున్నా... ఆమె తన ఫేవరెట్ ఈవెంట్ వాల్ట్‌లోనే పతకంపై గురి పెట్టింది. ఈ ఏడాది వాల్ట్ స్కోరింగ్‌లో ఒక్సానా మూడో స్థానంలో (15.325 పాయింట్లు) ఉండటం విశేషం. మైకేల్ ఫెల్ప్స్ (స్విమ్మింగ్) పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (ఆగస్టు 10న ఫైనల్-ఉ.గం. 6.48 ని.కు), 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే (ఆగస్టు 12న ఫైనల్-ఉ.గం. 7.31 ని.కు), 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ (ఆగస్టు 13న ఫైనల్-ఉ.గం. 6.42 ని.కు). ‘ఈత కొలనులో బంగారు చేప’ మైకేల్ ఫెల్ప్స్ తన రిటైర్మెంట్ను ఉపసంహరించుకొని మరీ ‘రియో’లో అడుగుపెట్టాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 15 ఏళ్ల ప్రాయంలోనే బరిలోకి దిగిన ఫెల్ప్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో పోటీపడి ఫైనల్‌కు చేరుకొని ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సిడ్నీ నుంచి రిక్తహస్తాలతో తిరిగొచ్చిన తర్వాత 31 ఏళ్ల ఈ అమెరికా స్టార్ స్విమ్మర్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే అత్యధికంగా 22 పతకాలు (18 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు) సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 88 కేజీల బరువున్న ఫెల్ప్స్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 6 స్వర్ణాలు, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించాడు. రియోలో మాత్రం ఫెల్ప్స్ మూడు ఈవెంట్స్‌లోనే బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఫెల్ప్స్ రియోలోనూ పసిడి పతకాలపై గురి పెట్టాడు. షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్: అయోనికా పాల్, అపూర్వీ చండీలా (సాయంత్రం గం. 5.00 నుంచి) ఫైనల్: రాత్రి గం. 7.00 నుంచి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: జీతూ రాయ్, గుర్ప్రీత్ సింగ్ (రాత్రి గం. 9.30 నుంచి) ఫైనల్: రాత్రి గం. 12.00 నుంచి ఇటీవల కాలంలో జీతూ రాయ్ నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే అతను పతకం తెస్తాడని ఆశించవచ్చు. మహిళా షూటర్లు అపూర్వీ, అయోనికా పాల్ ఫైనల్‌కు చేరితే మాత్రం ఒకరి నుంచి పతకం వచ్చే అవకాశముంది. రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (హీట్-1) దత్తూ బబన్ భోకనాల్ (సాయంత్రం. గం. 5.00కు) ఏడు నిమిషాల్లోపు రేసును పూర్తి చేస్తే ఈ భారత రోయర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. మొత్తం ఆరు హీట్స్ నుంచి 18 మంది క్వార్టర్ ఫైనల్ చేరుకుంటారు. పురుషుల హాకీ భారత్ ఁ ఐర్లాండ్ (గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్) రాత్రి గం. 7.30 నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతోన్న ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకుండా భారత్ ఆడాలి. మ్యాచ్‌పై దృష్టి సారించేందుకు భారత హాకీ జట్టు ప్రారంభోత్సవానికి దూరంగా ఉంది. పురుషుల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్ లియాండర్ పేస్-రోహన్ బోపన్న ఁ లుకాస్ కుబోట్-మట్కోవ్‌స్కీ (పోలాండ్) రాత్రి గం. 7.30 నుంచి డబుల్స్‌లో అపార అనుభవజ్ఞులైన పేస్-బోపన్న తమ స్థాయికి తగ్గట్టు పూర్తి సమన్వయంతో ఆడితేనే విజయాన్ని దక్కించుకుంటారు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో కుబోట్ 25వ, మట్కోవ్‌స్కీ 27వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరిని తక్కువ అంచనా వేస్తే తొలి రౌండ్లోనే షాక్ తగలొచ్చు. అన్ని సమయాలు భారత కాలమానం ప్రకారం -
పిడుగుపాటుకు మహిళ మృతి
ఐదుగురికి గాయాలు ఒక దుక్కిటెద్దు మతి పినపాక: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ఓ మహిళ మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఒక దుక్కిటెద్దు మతిచెందింది. పినపాక మండలం గోపాలరావుపేటకు చెందిన అనిపెద్ది లలిత(25) పొలంలో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మతిచెందింది. మతురాలు లలితకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నలుగురికి గాయాలు ఇల్లెందు : సుదిమళ్ల గ్రామ పంచాయతీ పూబెల్లి గ్రామ సమీపంలోని చేనులో మూతి చంటి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్షం పడుతుండటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. అప్పుడే పిడుగు పడటంతో చంటికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే చెట్టు కింద ఉన్న ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే రొంపేడు గ్రామ పంచాయతీ నాయకులగూడెం గ్రామానికి చెందిన సూర్నపాక చుక్కయ్యకు చెందిన దుక్కి టెద్దు పిడుగు పడటంతో అక్కడికక్కడే మతిచెందింది. దీని విలువ సుమారు రూ.50వేలు ఉంటుంది. యువ రైతుకు తీవ్ర గాయాలు టేకులపల్లి : కొప్పురాయి పంచాయతీ మోదుగులగూడెంకు చెందిన పాయం విజయ్‌భాస్కర్ గ్రామ సమీపంలోని తన పత్తి చేనులో మందు కొడుతున్నాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వెంటనే పెద్ద శబ్దంతో యువకుడు ఉన్న సమీపంలో పిడుగు పడింది. దీంతో విజయభాస్కర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సర్పంచ్ పూనెం మోహన్‌రావు తెలిపారు. వెంటనే టేకులపల్లికి చెందిన 108 అంబులెన్స్‌లో సులానగర్ పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బోల్ట్.. ఫిట్
డైమండ్ లీగ్ మీట్లో స్వర్ణం లండన్ : స్ప్రింట్ విభాగాల్లో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణంపై గురి పెట్టిన ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ పూర్తి ఫిట్నెస్ సాధించే దిశలో ఉన్నట్టు నిరూపించుకున్నాడు. లండన్ డైమండ్ లీగ్ అంతర్జాతీయ మీట్లో ఈ జమైకా స్టార్ పురుషుల 200 మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని సాధించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఈవెంట్లో బోల్ట్ 19.89 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. అలోన్సో ఎడ్వర్డ్ (పనామా-20.04 సెకన్లు) రజతం, ఆడమ్ జెమిలి (బ్రిటన్-20.07 సెకన్లు) కాంస్యం సాధించారు. ఈ సీజన్లో బోల్ట్ 200 మీటర్ల రేసులో పాల్గొనడం ఇదే తొలిసారి. కాలి కండరాల గాయం కారణంగా ఇటీవల జరిగిన జమైకా ఒలింపిక్ ట్రయల్స్ నుంచి బోల్ట్ వైదొలిగాడు. ట్రయల్స్‌లో పాల్గొనకున్నా జమైకా దేశం బోల్ట్ ఎంట్రీని రియో ఒలింపిక్స్‌కు పంపించింది. -
ఎవరైతే మాకేంటి!
► ఆద్యంతం అద్వితీయ ప్రదర్శన ► 2015లో తమ ముద్రను చాటుకున్న ► అగ్రశ్రేణి క్రీడాకారులు వేదికలు మారినా... ప్రత్యర్థులు మారినా... కొత్త సవాళ్లు ఎదురైనా... తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ... అందరిలో ప్రత్యేకంగా నిలుస్తూ... ఈ ఏడాదీ పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు తమ జైత్రయాత్రను కొనసాగించారు. వచ్చే సంవత్సరంలో కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. టీం ఈవెంట్లతో పోలిస్తే వ్యక్తిగత క్రీడాంశాలకు చెందిన వారే ఈసారి తళుక్కుమనిపించారు. -సాక్షి క్రీడావిభాగం ‘రాకెట్’తో రఫ్ ఆడించారు... ఉత్సాహం ఉండాలేకాని విజయాలు సాధించేందుకు వయసు అడ్డంకి కాదని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మళ్లీ నిరూపించింది. మహిళల టెన్నిస్‌లో ఈ ఏడాది సెరెనా తన హవా కొనసాగించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ నల్లకలువ యూఎస్ ఓపెన్‌లో మాత్రం ఒత్తిడికి తలవంచింది. సెమీఫైనల్లో రొబెర్టా విన్సీ (ఇటలీ) చేతిలో ఓడిపోయింది. తద్వారా 1988లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఏడాది మొత్తం ఐదు టైటిల్స్‌ను సాధించిన సెరెనా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఏడాది మొత్తంలో కోటీ ఐదు లక్షల 82 వేల 642 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 70 కోట్ల 19 లక్షలు) సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ జోరు కొనసాగింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచినా జొకోవిచ్... ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో వరుసగా నాలుగో ఏడాది చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏడాది మొత్తంలో 82 మ్యాచ్‌ల్లో గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిన జొకోవిచ్ 11 టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. 2 కోట్ల 15 లక్షల 92 వేల 125 డాలర్ల (రూ. 143 కోట్లు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు. ‘బోల్ట్’ బిగించాడు... ఈ ఏడాది తాను బరిలోకి దిగిన అన్ని రేసుల్లో ఉసేన్ బోల్ట్ అజేయంగా నిలిచాడు. బీజింగ్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లతోపాటు 4్ఠ100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని తనకు తిరుగులేదని చాటుకున్నాడు. అయితే కొత్తగా ప్రపంచ రికార్డులు నమోదు చేయలేకపోయాడు. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ నుంచి గట్టిపోటీ తప్పదనుకున్నా... బోల్ట్ వేగం ముందు గాట్లిన్తోపాటు ఇతర అథ్లెట్స్ కూడా వెనుకబడిపోయారు. వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ఉండటంతో ఈ సంవత్సరం బోల్ట్ ఎంపిక చేసుకున్న కొన్ని ఈవెంట్స్‌లోనే పాల్గొన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన అతను ఈ మెగా ఈవెంట్లో తన స్వర్ణాల సంఖ్యను 11కు పెంచుకొని ఈ ఘనత సాధించిన ఏకైక అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు డెకాథ్లాన్ (పది క్రీడాంశాల సమాహారం) ఈవెంట్లో అమెరికాకు చెందిన యాష్టన్ ఈటన్ 9045 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. అదే జోరు... అదే ఫలితం ఫార్ములావన్‌లో వరుసగా రెండో ఏడాది తన హవా కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడోసారి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తొలిసారి 2008లో ఈ ఘనత సాధించిన అతను గతేడాది అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సంవత్సరం కూడా ఆద్యంతం అలరించిన హామిల్టన్ తన ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. ఈ సీజన్లో జరిగిన 19 రేసుల్లో హామిల్టన్ 10 రేసుల్లో విజేతగా నిలిచి, ఆరు రేసుల్లో రెండో స్థానాన్ని పొందాడు. కాసులు కురిపించిన బిగ్ ఫైట్... ఈ సంవత్సరం యావత్ క్రీడాప్రపంచం అభిమానులను ఆకర్షించిన ఈవెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మేవెదర్ (అమెరికా)- పకియావ్ (ఫిలిప్పీన్స్) బాక్సింగ్ బౌట్. లాస్వేగాస్లో మే 2వ తేదీన జరిగిన ఈ బౌట్ ద్వారా నమ్మశక్యంకాని రీతిలో రూ.2500 కోట్ల ఆదాయం వచ్చింది. తుది ఫలితంతో సంబంధం లేకుండా ఈ మొత్తంలో మేవెదర్‌కు రూ. 945 కోట్లు, పకియావ్కు రూ. 630 కోట్లు లభించాయి. నిర్ణీత 12 రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్లో మేవెదర్ పూర్తి ఆధిపత్యం చలాయించి పకియావ్ను ఓడించాడు. పకియావ్తో బౌట్ తర్వాత మరో బౌట్లో పాల్గొన్న మేవెదర్ అందులోనూ నెగ్గి తన ప్రొఫెషనల్ కెరీర్‌ను 49 విజయాలతో అజేయంగా ముగించాడు. మారిన్ మెరిసె... మహిళల బ్యాడ్మింటన్‌లో చైనా దూకుడుకు చెక్ పెడుతూ స్పెయిన్ అమ్మాయి కరోలినా మారిన్ ఈ ఏడాది తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్ (భారత్)ను ఓడించి వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచిన మారిన్... ఈ ఏడాది ఐదు సూపర్ సిరీస్ (ఆల్ ఇంగ్లండ్, మలేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, హాంకాంగ్) టైటిల్స్‌ను కైవసం చేసుకోవడం విశేషం. భళా... బార్సిలోనా క్లబ్ ప్రపంచ ఫుట్‌బాల్‌లోని అత్యంత మేటి క్లబ్‌లలో ఒకటైన బార్సిలోనా జట్టు ఈ ఏడాది నిలకడగా రాణించింది. స్పానిష్ లీగ్ లా లిగా టైటిల్‌ను నెగ్గిన బార్సిలోనా జట్టు ఆ తర్వాత అదే జోరును కొనసాగించి చాంపియన్స్ లీగ్, యూరోపియన్ సూపర్ కప్ టైటిల్స్‌ను హస్తగతం చేసుకుంది. లియోనెల్ మెస్సీ, నెమార్, పీకే, సురెజ్, ఇనియెస్టా లాంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన బార్సిలోనా జట్టు సీజన్ చివర్లో ప్రపంచ క్లబ్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచి ఏడాదిని ఘనంగా ముగించింది. -
బోల్ట్ ‘ట్రిపుల్’ ధమాకా
బీజింగ్ : బోల్ట్ బరిలో ఉంటే మిగతా వారు స్వర్ణ పతకం గురించి మర్చిపోవాలనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఈ జమైకా స్టార్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే 100, 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్ రేసుల్లో స్వర్ణ పతకాలను నెగ్గిన బోల్ట్... శనివారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో తన సహచరులు నెస్టా కార్టర్, అసఫా పావెల్, నికెల్ అష్మెడ్లతో కలిసి జమైకా జట్టును విజేతగా నిలిపాడు. జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో బోల్ట్కిది 11వ స్వర్ణం కాగా... ప్రస్తుత ఈవెంట్లో మూడో పసిడి పతకం కావడం విశేషం. రిలే ఫైనల్లో బ్రొమెల్, జస్టిన్ గాట్లిన్, టైసన్ గే, మైక్ రోడ్జర్స్లతో కూడిన అమెరికా బృందం తొలుత రెండో స్థానాన్ని పొందినా... చివరి అంచెలో నిబంధనలకు విరుద్ధంగా టైసన్ గే నుంచి నిర్ణీత పరిధి దాటి రోడ్జర్స్ బ్యాటన్ అందుకున్నట్లు తేలడంతో రేసు ముగిసిన కొన్ని నిమిషాలకు నిర్వాహకులు అమెరికా జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో తొలుత కాంస్యం నెగ్గిన చైనా జట్టుకు రజతం, నాలుగో స్థానాన్ని పొందిన కెనడా జట్టుకు కాంస్యం ఖాయమయ్యాయి. మహిళల 4ఁ100 మీటర్ల రిలేలోనూ జమైకా జట్టు కే పసిడి పతకం లభించింది. వెరోనికా, నటాషా, ఎలానీ థాంప్సన్, షెల్లీ ఫ్రేజర్లతో కూడిన జమైకా బృందం 41.07 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. డెకాథ్లాన్ ఈవెంట్ లో అమెరికా అథ్లెట్ యాష్టన్ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టిం చాడు. పది అంశాలతో కూడిన ఈ విభాగంలో ఈటన్ 9045 పాయిం ట్లు సంపాదించి... 9039 పాయింట్లతో ఇప్పటివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. భారత్‌కు చెందిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ (62.24 మీటర్లు) తొమ్మిదో స్థానాన్ని పొందగా... 50 కిలోమీటర్ల నడకలో సందీప్ కుమార్, మనీశ్ సింగ్ వరుసగా 26వ, 27వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. -
బోల్ట్ x గాట్లిన్
♦ 200 మీటర్ల ఫైనల్స్‌లోనూ అమీతుమీ ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బీజింగ్ : వరుసగా నాలుగో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉసేన్ బోల్ట్ (జమైకా)... ఈసారైనా బోల్ట్‌ను ఓడించాలనే పట్టుదలతో జస్టిన్ గాట్లిన్ (అమెరికా)... గురువారం జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో అమీతుమీ తేల్చుకోనున్నారు. బుధవారం జరిగిన సెమీఫైనల్స్ ద్వారా బోల్ట్ (19.95 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (19.87 సెకన్లు) ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిద్దరితోపాటు ఫెమీ ఒగునోడ్ (ఖతార్), రామిల్ గులియెవ్ (టర్కీ), జర్నెల్ హ్యూస్ (బ్రిటన్), జొబోడ్వానా (దక్షిణాఫ్రికా), నికెల్ అష్మెడ్ (జమైకా), అలోన్సో ఎడ్వర్డ్ (పనామా) కూడా ఫైనల్‌కు అర్హత పొందారు. 2009, 2011, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బోల్ట్ 200 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించగా... 2005 మెగా ఈవెంట్లో గాట్లిన్ విజేతగా నిలిచాడు. గత ఆదివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్లో గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న బోల్ట్ తుదకు సెకనులో వందోవంతు తేడాతో గట్టెక్కి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్ ఫైనల్స్‌లో మూడింట ఆఫ్రికా అథ్లెట్స్ స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. పురుషుల జావెలిన్ త్రోలో జూలియస్ యెగో (92.72 మీటర్లు) విజేతగా నిలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫీల్డ్ ఈవెంట్లో తొలిసారి కెన్యాకు పతకాన్ని అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో హువిన్ కియెంగ్ జెప్కెమోయ్ (కెన్యా-9ని:19.11 సెకన్లు) పసిడి పతకాన్ని సాధించింది. మహిళల పోల్‌వాల్ట్‌లో యారిస్లె సిల్వా (క్యూబా-4.90 మీటర్లు); పురుషుల 400 మీటర్ల విభాగంలో వేడ్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా-43.48 సెకన్లు); మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జుజానా హెజ్నోవా (చెక్ రిపబ్లిక్-53.50 సెకన్లు) స్వర్ణ పతకాలు గెలిచారు. టింటూ లూకాకు ‘రియో’ బెర్త్: పోటీల ఐదో రోజూ భారత్‌కు నిరాశే మిగిలింది. మహిళల 800 మీటర్ల విభాగంలో ప్రస్తుత ఆసియా చాంపియన్, కేరళ అమ్మాయి టింటూ లూకా 2ని:00.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని తొలి హీట్‌లో ఆరో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈ ప్రదర్శనతో టింటూ లూకా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లలితకు ఎనిమిదో స్థానం: మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్ రేసులో మహారాష్ట్ర అమ్మాయి లలితా శివాజీ బాబర్ 9ని:27.86 సెకన్లతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. 2000 మీటర్ల వరకు అగ్రస్థానంలో ఉన్న లలిత ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఈ ప్రదర్శనతో లలిత ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ట్రాక్ ఈవెంట్లో టాప్-8లో నిలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్ నేటి సాయంత్రం గం. 6.25కు స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
ఆఫ్రికా అథ్లెట్స్ అదుర్స్
మూడు విభాగాల్లో స్వర్ణాలు ♦ 200 మీటర్ల సెమీస్‌లోకి బోల్ట్, గాట్లిన్ ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బీజింగ్ : పేరుకు వెనుకబడిన దేశాలకు చెందిన వారైనా... ప్రపంచ పరుగుల వేదికపై పతకాల వేటలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన ఐదు ఫైనల్స్‌లో ఆఫ్రికా అథ్లెట్స్ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా రెండోసారి పసిడిపతకాన్ని దక్కిం చుకోగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కెన్యా యువతార నికోలస్ బెట్ తొలిసారి తమ దేశానికి స్వర్ణాన్ని అందించాడు. ఇక మహిళల 1500 మీటర్ల రేసులో గెన్‌జెబి దిబాబా విజేతగా నిలిచి ఈ మెగా ఈవెం ట్లో ఇథియోపియా పసిడి ఖాతాను తెరిచింది. నాలుగో రోజు పోటీలు ముగిశాక కెన్యా 4 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో ఉండటం విశేషం. ►లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత మోకాలి గాయంతో కొంతకాలం అథ్లెటిక్స్‌కు దూరంగా ఉన్న రుదీషా తాజా ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 800 మీటర్ల రేసును రుదీషా ఒక నిమిషం 45.84 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆడమ్ క్సాజోట్ (పోలండ్-1ని:46.08 సెకన్లు) రజతం, అమెల్ టుకా (బోస్నియా-1ని:46.30 సెకన్లు) కాంస్యం సాధించారు. 2011లో తొలిసారి ప్రపంచ టైటిల్ నెగ్గిన రుదీషా 2013లో గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ►పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో గతంలో ఏనాడూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గలేకపోయిన కెన్యాకు నికోలస్ బెట్ ఆ కొరతను తీర్చాడు. బెట్ 47.79 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా 1991లో శామ్యూల్ మెటెటె (జాంబియా) తర్వాత ఈ విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఆఫ్రికా అథ్లెట్‌గా బెట్ గుర్తింపు పొందాడు. ►మహిళల 1500 మీటర్ల రేసులో ఇథియోపియా అమ్మాయి గెన్‌జెబి దిబాబా 4ని:08.09 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. విఖ్యాత అథ్లెట్స్ తిరునిష్, ఎజెగాయెహు దిబాబాలకు సోదరి అయిన గెన్‌జెబి గత నెలలో మొనాకోలో జరిగిన మీట్లో 3ని:50.07 సెకన్లలో తన పేరిట ప్రపంచ రికార్డును లిఖించుకుంది. పురుషుల లాంగ్‌జంప్‌లో ఒలింపిక్ చాంపియన్ గ్రెగ్ రూథర్‌ఫర్డ్ (బ్రిటన్-8.41 మీటర్లు)... మహిళల డిస్కస్ త్రోలో డెనియా కాబాలెరో (క్యూబా-69.28 మీటర్లు) స్వర్ణ పతకాలు సాధించారు. ►పురుషుల 200 మీటర్ల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా), మాజీ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మూడో హీట్‌లో పాల్గొన్న బోల్ట్ 20.28 సెకన్లలో... నాలుగో హీట్‌లో బరిలోకి దిగిన గాట్లిన్ 20.19 సెకన్లలో గమ్యానికి చేరుకున్నారు. -
అందరి దృష్టి బోల్ట్ పైనే!
బీజింగ్: గత ఏడేళ్లుగా 100 మీటర్ల విభాగంలో పరాజయమెరుగని జమైకా విఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈ ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రోజున హీట్స్... ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్ రేసు జరుగుతాయి. బీజింగ్ ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన బర్డ్స్నెస్ట్ స్టేడియంలోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2011లో ప్రపంచ చాంపియన్‌షిప్ 100 మీటర్ల ఫైనల్లో ఫాల్స్ స్టార్ట్ మినహా బోల్ట్ 2008 నుంచి ఈ విభాగంలో అజేయుడుగా ఉన్నాడు. ఈసారి బోల్ట్‌కు అమెరికా స్టార్స్ జస్టిన్ గాట్లిన్, టైసన్ గేల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘ఈ నగరంతో నాకు గొప్ప అనుబంధం ఉంది. మళ్లీ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. నేను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. తొలిరోజు మూడు విభాగాల్లో ఫైనల్స్ (పురుషుల మారథాన్, 10,000 మీ., మహిళల షాట్‌పుట్ ) జరుగుతాయి.