
అథ్లెటిక్స్‌కు వేళాయె..!
ఒలింపిక్స్‌లో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే అథ్లెటిక్స్ పోటీలు నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 2008, 2012 గేమ్స్‌లో 100మీ. 200మీ. 4ఁ100మీ.లలో స్వర్ణాలతో అదరగొట్టిన బోల్ట్ ఆదివారం తొలిసారిగా ట్రాక్‌పై మెరవనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు 100మీ. హీట్స్‌లో, సోమవారం ఉదయం గం.6.55ని.కు ఫైనల్స్‌లో బోల్ట్ బరిలోకి దిగుతాడు. మహిళల 10 వేల మీ. పరుగులో వరుసగా మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచేందుకు చాంపియన్ తిరునేష్ దిబాబా (ఇథియోపియా) ఎదురుచూస్తోంది. మరోవైపు భారత్ నుంచి 36 మంది అథ్లెటిక్స్ బరిలోకి దిగుతున్నారు.