
హీరో ఎలక్ట్రిక్ నుంచి ఏవియర్ ఈ-సైకిల్
ధరలు రూ.18,990, రూ.19,290
హైదరాబాద్: హీరో ఎలక్ట్రిక్ సంస్థ వినూత్నమైన ఏవియర్-ఈ సైకిల్‌ను అందిస్తోంది. పర్యావరణాన్ని కాపాడేలా రూపొందించిన ఈ సైకిల్‌లో రెండు వేరియంట్‌లున్నాయని హీరో ఎలక్ట్రిక్ ఒక కంపెనీలో తెలిపింది. వీటి ధరలు రూ.18,990, రూ.19,290 (ఈ ధరలు ఢిల్లీకి వర్తిస్తాయి) అని పేర్కొంది. ఇవి ఐదు మెట్రో నగరాల్లో లభ్యమవుతున్నాయని, ఉద్యోగులకు, యువ ప్రొఫెషనల్స్‌కు, యువజనులను తగినట్లుగా, నగర జీవన విధానానికి అనువుగా రూపొందించామని వివరించింది.
అత్యధికంగా గంటకు 25 కిమీ. నడిచే ఈ సైకిల్‌లో 6 స్పీడ్ షిమానో గేర్లున్నాయని, ఈ సైకిల్ పరిధి 20 కిమీ. అని, ఈ సైకిల్‌లోని అల్లాయ్ చక్రాలు అత్యధికంగా 4 నుంచి 5 గంటలు పనిచేసేలా బ్యాటరీ ఉంటుందని, ఈజీ పోర్టబుల్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ హారన్‌వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.