ఈవీ డిమాండ్ పెరగడంతో జతకట్టిన హీరో-మహీంద్రా..! | Mahindra Group To Manufacture Hero Electric Vehicles Under Strategic Partnership | Sakshi
Sakshi News home page

ఈవీ డిమాండ్ పెరగడంతో జతకట్టిన హీరో-మహీంద్రా..!

Published Wed, Jan 19 2022 4:44 PM | Last Updated on Wed, Jan 19 2022 5:17 PM

Mahindra Group To Manufacture Hero Electric Vehicles Under Strategic Partnership - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో వాహనాల కొరతను అధిగమించేందుకు భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా & మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా గ్రూప్‌కి చెందిన పితంపూర్ ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా, ఎన్ వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొరతను అధిగమించే అవకాశం ఉంది.

హీరో ప్రస్తుతం తనకున్న లూధియానా ప్లాంట్ విస్తరణతో 2022 నాటికి ఏడాదికి 1 మిలియన్ ఈవీలను తయారు చేయాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రకు చెందిన ప్యుగోట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం వల్ల కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలను తయారు చేయడానికి ఆర్ అండ్ డి బృందాల మధ్య ఎటువంటి ఆటంకం లేకుండా నాలెడ్జ్ షేరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం భవిష్యత్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొరత ఏర్పడకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది రెండు కంపెనీలు తెలిపాయి. హీరో ఎలక్ట్రిక్ ఇప్పటివరకు 12 మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా 4 లక్షల కస్టమర్లను సంపాధించుకుంది. అలాగే, ఇండియా మొత్తం ఇప్పటి వరకు 2 వేల ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. 

(చదవండి: బేర్ దెబ్బకు 18 వేల పాయింట్స్ కిందకు పడిపోయిన నిఫ్టీ..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement