ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలోని ఆప్టిమా హెచ్‌ఎక్స్ సిరీస్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ 2022 హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. CX, CX ER వేరియంట్లలో రానుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ వేరియంట్ సింగిల్ బ్యాటరీతో వస్తుండగా..సీఎక్స్ ఈఆర్ డ్యూయల్ బ్యాటరీతో రానుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్‌మునుపటి మోడల్ కంటే 25 శాతం ఎక్కువ శక్తివంతమైనదిగా అంచనా వేయబడింది.దాంతో పాటుగా ఎలక్ట్రిక్ మోటారు సామర్థ్యం మునుపటి కంటే 10 శాతం ఎక్కువగా ఉండనుంది.
రేంజ్ ఎంతంటే..?
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్పెక్స్ వివరాలలోకి వెళితే...ఈ స్కూటర్‌లో 52.2Volt, 30ah లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. బేస్ CX వేరియంట్ 82 కిమీ పరిధిని అందించే ఒకే యూనిట్‌ను పొందుతుంది, అయితే CX ER డ్యూయల్ బ్యాటరీలతో అందించబడుతుంది. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కిమీల రేంజ్ వరకు ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్ 550W ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తాయి, ఇది గరిష్టంగా 45kmph వేగంతో 1.2kW (1.6 bhp) గరిష్ట అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ సమయం దాదాపు 4-5 గంటలు.
ఫీచర్ల విషయానికి వస్తే..!
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్, సీఎక్స్ ఈఆర్ రెండు వేరియంట్లలో ఒకే రకపు ఫీచర్లుతో రానున్నాయి. క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌ల్యాంప్‌లు, రిమోట్ కీతో కూడిన యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లను అందిస్తుంది. ధరల విషయానికొస్తే, Optima CX స్కూటర్ ధర Optima HX సిరీస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఈ రెండు మోడల్స్ ధరలు రూ. 60,000 నుంచి రూ. 70,000 మధ్య ఉండవచ్చునని తెలుస్తోంది. ఆప్టిమా సీఎక్స్ రెండు వేరియంట్‌లు బ్లూ, గ్రే , వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.
చదవండి: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..!
Comments
Please login to add a commentAdd a comment