హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాల్లో హీరో ఎలక్ట్రిక్ కొత్త రికార్డు నమోదు చేసింది. సవాళ్లు ఉన్నప్పటికీ 2022లో ఏకంగా 1,00,000 పైచిలుకు యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. దశాబ్దానికి పైగా మార్కెట్లో సంస్థ నాయకత్వాన్ని అమ్మకాల మైలురాయి ప్రతిబింబిస్తుందని హీరో తెలిపింది.ఆరు లక్షలకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది.
మూడేళ్లలో 50 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు.
25,000 మంది మెకానిక్‌లకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో శిక్షణ, పునర్ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. భాగస్వాముల సహకారంతో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
Comments
Please login to add a commentAdd a comment