UP CM
-
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. యోగి ఆదిత్యనాథ్ సూచనలు
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ కల. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ దేశాన్ని మోదీ చేతికి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' అన్నారు. ప్రజల ప్రతి ఓటు చాలా ముఖ్యమైందని, దేశాభివృద్ధికి కీలకమని అన్నారు. 2014 నుంచే దేశాభివృద్ధికి పునాది పడిందని.. తప్పకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, అది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆదిత్యనాథ్ అన్నారు. కులం, మతం, బుజ్జగింపులు, ఇతర ఎజెండాలకు ఓటు వేయకూడదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం.. ఉజ్వల్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ఆదిత్యనాథ్ సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా 'ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్' అనే నినాదాన్ని ఆదిత్యనాథ్ హైలెట్ చేశారు. 400 సీట్లను సొంతం చేసుకోవడమే లక్ష్యమని, దీనికోసం అందరూ ఏకం కావాలని కోరారు. పోలింగ్ బూత్‌లో ఓటు వేయడం ద్వారా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. -
డీప్‌ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో డీప్‌ఫేక్ (Deepfake) మహమ్మారిలా వ్యాపిస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. డీప్‌ఫేక్ బారినపడ్డ ప్రముఖుల జాబితాలోకి తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కూడా చేరారు. డయాబెటిస్ మెడిసిన్‌ను 'ఆదిత్యనాథ్' ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో వైరల్ అయిన తర్వాత, ఈ వీడియోకు కారణమైన ఫేస్బుక్ ఖాతాపై ఐపీసీ 419, 420, 511 సెక్షన్స్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రముఖులకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ యాక్టర్స్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్‌లకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. -
భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది: యూపీ సీఎం
ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' మళ్ళీ అధికారంలోకి వస్తే.. భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నారీ శక్తి వందన్ కార్యక్రమంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే.. దేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయం పెరుగుతుంది. ప్రజల జీవితాల్లో సుసంపన్నత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూ.679 కోట్లతో చేపట్టిన 673 అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మరోసారి మోదీ సర్కార్ వస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 వందలకు పైగా సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మన పూర్వీకులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధించిన అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయి. కానీ మహా మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి 'రామ్ లల్లా' ప్రతిష్టాపన కల కూడా మోదీ వల్ల సాధ్యమైందని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు దేశంలో షుగర్ బౌల్‌గా పేరుగాంచిన దేవరియా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నష్టపోయింది. దీంతో డియోరియా, ఖుషీనగర్లు వెనుకబడిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాలలో పేదరికం మరింత పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం (బీజేపీ) అధికారంలోకి వచ్చిన తరువాత చక్కర కర్మాగారాల పునరుద్ధరణ జరిగిందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డియోరియాలో పేద కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేసినట్లు ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు, అప్రూవల్ లెటర్స్, ఆయుష్మాన్ కార్డులు, స్మార్ట్ఫోన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. 'विकसित भारत' की परिकल्पना को साकार करने के लिए जन-जन से एक आवाज आ रही है... pic.twitter.com/Jm0bSMRTvf — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 10, 2024 -
యోగి సర్కార్ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ!
ఉత్తరప్రదేశ్‌లోని వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని 75 జిల్లాల్లో నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు దీపావళి మేళా నిర్వహించనున్నారు. పీఎం స్వనిధి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ మేళా జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పట్టణ జీవనోపాధి మిషన్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణ పౌరులకు అవసరమయ్యే ఉత్పత్తులను ఒకే చోట అందించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎకె శర్మ తెలిపారు. ఈ మేళాతో వీధి వ్యాపారులకు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం అందుతుందని అన్నారు. ఈ మేళాకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. మేళా జరిగే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, బోనస్‌ను కానుకగా ఇచ్చింది. అలాగే గృహిణులకు పీఎం ఉజ్వల పథకం కింద రెండు ఉచిత సిలిండర్లను బహుమతిగా అందించింది. ఈ కోవలోనే వీధి వ్యాపారులకు దీపావళి మేళా ద్వారా అదనపు ఆదాయానికి మార్గం చూపింది. ఇది కూడా చదవండి: అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్ -
.. నేను సీఎంగా ఉన్నందుకు అనుకున్నాను సార్!
సన్యాసులకు పాదాభివందనం నా అలవాటు.. అందుకే యోగీ ఆధిత్యనాథ్‌కు చేశా - రజినీకాంత్ -
సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జైలర్ సక్సెస్‌లో ఆయన ఉన్నారు. ఆగష్టు 10న విడుదలైన జైలర్ ఇప్పటికి కూడా కలెక్షన్స్‌లలో తగ్గడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాల యాత్రకు వెళ్లి వచ్చిన తలైవా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి రజనీ వెళ్లారు. ఆ సమయంలో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా) అయితే రజనీకాంత్ చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. తలైవా తీరును కొందరు తప్పుపట్టినా మరికొందరు మాత్రం సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థించారు. రజినీకాంత్ ఎందుకలా చేశాడంటూ నెట్టింట భారీ చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని తలైవాపై పలు ప్రశ్నలు వచ్చాయి. తాజాగ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రజనీ ఇదే విషయంపై మీడియాతో ఇలా స్పందించారు. ' యోగులు, సన్యాసిల పాదాలను తాకి, వారి ఆశీర్వాదం తీసుకోవడం నా అలవాటు, వారు నా కంటే చిన్నవారైనా, నేను ఆ పని తప్పకుండా చేస్తాను. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించాను. అంతకు మించి మరో ఉద్దేశ్యం లేదు.' అని ఆయన తెలిపారు. రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో జైలర్ దూసుకెళ్తుండటంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జైలర్ ద్వారా తనకు భారీ విజయాన్ని అందించినందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినీ ప్రేమికులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే) -
సీఎం పాదాలకు మొక్కిన తలైవా.. మండిపడుతున్న నెటిజన్స్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తలైవా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు ప్రత్యేకంగా లక్నో వెళ్లారు. (ఇది చదవండి: యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!) అయితే యోగిని కలిసిన రజినీకాంత్ ఎవరూ ఊహించని విధంగా ఆయన కాళ్లకు మొక్కారు. లక్నోలోని యూపీ నివాసానికి వెళ్లిన సమయంలో యోగి పాదాలకు నమస్కరించారు. అయితే రజినీకాంత్ చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో తలైవా తీరును తప్పుబడుతున్నారు. మరికొందరైతే సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఎందుకలా చేశాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది,. అయితే రజినీకాంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి కాళ్లు మొక్కలేదని.. యోగి సన్యాసి కాబట్టే అలా చేశాడని అంటున్నారు. రజినీకాంత్‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ అని.. యోగి గతంలో గోరఖ్ పూర్ పీఠాధిపతి పదవిలో ఉండేవారని.. అదే భక్తి భావంతో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారని భావిస్తున్నారు. ఏది ఏమైనా వయసులో చిన్నవాడైనా యోగి కాళ్లకు తలైవా నమస్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: ఖుషి రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు అన్ని కోట్లు తీసుకున్నారా?) Rajnikanth who is both bigger in stature and age than Yogi Adityanath is touching his feet. Rajnikanth is 72, Yogi is 51. Why is a superstar touching the feet of a politician? He lost all respect today. pic.twitter.com/edY8rjJ6g9 — Roshan Rai (@RoshanKrRaii) August 19, 2023 అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు వెళ్లిన రజినీకాంత్ ఆయనతో కలిసి చూడలేకపోయారు. అత్యవసర పనుల కారణంగా యోగి ఆదిత్యనాథ్ అందుబాటులో లేకపోవడంతో.. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి జైలర్ చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాతనే లక్నోలోని యోగి ఆదిత్యనాథ్ నివాసానికి వెళ్లి కలిశారు. కాగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. -
సీఎం యోగిని చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్లో ప్రేమకోణం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రేమ కోణం ఉన్నట్లు విచారణలో తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై కోపంతో ఓ యువకుడు అతని ఫోన్ దొంగిలించి సీఎంకు చంపేస్తానని కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేయసి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఫోన్ చోరీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడ్ని 18 ఏళ్ల అమీన్‌గా గుర్తించారు. ఏం జరిగిందంటే..? మంగళవారం ఉదయం 112 నంబర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. యూపీ పోలీసుల హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్‌కు కూడా ఈ సందేశాన్ని పంపాడు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు ఆ నంబర్‌ను ట్రేస్ చేశారు. లక్నోలో ఉంటున్నాడని తెలిసి వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే తన ఫోన్‌ను రెండు రోజుల క్రితమే ఎవరో దొంగిలించారని, ఈ కాల్ తాను చేయలేదని సజ్జాద్ హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పొరుగింటి వారిని పోలీసులు వాకబు చేశారు. అప్పుడే అమీన్ గురించి వాళ్లు చెప్పారు. హుస్సేన్‌ను ఇరికేందుకు అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అమీన్ వద్దకు చేరుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ కూతుర్ని తాను ప్రేమించానని, ఆయన తమ ప్రేమకు ఒప్పుకోలేదనే ఇలా చేసినట్లు విచారణలో తెలిపాడు. హుస్సేన్‌పై ప్రతీకారంతోనే ఫోన్ దొంగిలించి సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు అంగీకరించాడు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..? -
మోదీ@20 పుస్తకావిష్కరణ... ఒక ప్రధాని ఉండేవారంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ యూపీ సీఎం
వారణాసి: యూపీలోని వారణాసిలో రుద్రాక్ష్ కన్వెక్షన్ సెంటర్లో మోదీ@20 అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఒకప్పుడూ ఒక ప్రధాని ఉండేవారంటూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పకుండానే ఆయనతో మోదీని పోల్చారు. ఆయనకు భిన్నంగా ప్రస్తుత ప్రధాని వారసత్వం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే భారత్‌ని ఏక్ భారత్, శ్రేష్ట భారత్‌గా మార్చాలనే సంకల్పంతో ఉన్న మోదీ భారత్‌కి లభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత్ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేసేలా ఆదర్శంగా నిలించిందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద మూలాలను శాశ్వతంగా అంతం చేయడంలో ప్రధాని వెనుకాడడం లేదని కొనియాడారు. ఇదే మోదీ నాయకత్వ సామర్థ్యం అని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు సోమ్‌నాథ్ పునరుద్ధరణ కోసం రాష్ట్రపతిని పంపని ఒక ప్రధానిని చూశాం, అలాగే భవ్య శ్రీరామ నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధానిని కూడా చూశాం అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులలో మన ప్రధాని ఒకరు కావడం మనకు గర్వకారణమని అన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, దాదాపు వందల ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటన్‌ని వెనక్కినెట్టి మరీ ఈ స్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. (చదవండి: గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం) -
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. యూపీ పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ వాట్సాప్‌కు ఈ సందేశం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డయల్ 112 హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు షాహిద్ అనే వ్యక్తి ఆ మెసేజ్‌ను పంపించినట్లు గుర్తించామన్నారు. బాంబు పెట్టి ముఖ్యమంత్రిని హత్య చేస్తానని సందేశంలో రాశాడని పోలీసులు తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయం స్టేషన్ కమాండర్ సుభాష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సైబర్ సెల్, నిఘా బృందాలు సైతం పని చేస్తున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే? -
'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం
UP CM Yogi Adityanath Meets And Blesses Team Major: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. తాజాగా ఇలాంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. 'మేజర్' మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ) ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. కాగా ఇటీవల మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫండ్‌కు సంబంధించిన విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చిత్ర యూనిట్ సమావేశమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సీడీఎస్, ఎన్డీఏ ఆశావహులకు శిక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపింది. దీంతో దేశానికి సేవ చేయాలనే వారి కలలు సాకారం అవుతాయని చిత్రబృందం పేర్కొంది. చదవండి:కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్ స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
Sakshi Cartoon: బుల్డోజర్ సంస్కృతిని అడ్డుకోండి..
బుల్డోజర్ సంస్కృతిని అడ్డుకోండి.. ‘సుప్రీం’కు న్యాయ నిపుణులు లేఖ -
పాక్ గెలుపు సంబురాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు: యూపీ సీఎం
Those Celebrating Pakistan Win To Face Sedition Charges: టీ20 ప్రపంచకప్-2021లో భారత్‌పై పాక్ గెలుపొందిన అనంతరం సంబురాలు చేసుకున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అలా చేసిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. సీఎం ఆదేశాలతో యూపీ పోలీసులు ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. पाक की जीत का जश्न मनाने वालों पर देशद्रोह लगेगा: मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज pic.twitter.com/34DEij8y3t — Yogi Adityanath Office (@myogioffice) October 28, 2021 వీరిలో నలుగురు పాక్ అనుకూల నినాదాలు చేశారని రుజువు కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్) సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్ తొలిసారి పాక్ చేతిలో ఓటమిని చవిచూడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. UP Police have booked 7 people in 5 districts and taken 4 people in custody for allegedly raising pro-Pak slogans or celebrating Pakistan's victory over India in the T20 Cricket World Cup match that took place on Oct 24: CMO pic.twitter.com/o1ceq5L7ED — ANI UP (@ANINewsUP) October 27, 2021 అయితే, భారత్‌లో ఉంటున్న కొందరు మాత్రం పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ.. పాక్ అనుకూల నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన నఫీసా అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది. ఇందుకు ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు -
సీఎం ఆర్డర్ ఆమెను పిలవండి
కరోనాను కంట్రోల్లో పెట్టేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దగ్గర ఉన్న ‘టీమ్ 11’ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది! యూపీ బ్యూరోక్రసి మొత్తం కరోనాతో మంచం పట్టేసింది. ఆ టీమ్‌లోని సభ్యులైన అడిషనల్ చీఫ్ సెక్రెటరీకి శనివారం కోవిడ్ ఎటాక్ అయింది. డీజీపీకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డి.ఎం.) హుటాహుటిన క్వారెంటైన్‌కు వెళ్లిపోయారు. యోగికి ఏం పాలుపోలేదు. లక్నోలో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. కాసేపు తలపట్టుకుని, డాక్టర్ రోషన్ జాకబ్ ఎక్కడ? అని అడిగారు యోగి. ఆమె డాక్టర్ కారు. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. తక్షణం ఆమెను పిలిపించారు. లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమించారు! కరోనా ఇక తన గొయ్యి తాను తవ్వుకున్నట్లే! ఎందుకంటే.. స్కెచ్ వేసి, స్పాట్ పెట్టి ఎంతటి సమస్యనైనా ఫినిష్ చేసేస్తారని రోషన్ జాకబ్‌కు పేరు! ఇవాళ్టి నుంచీ రోషన్ జాకబ్ లక్నో జిల్లా మేజిస్ట్రేట్. అయితే శనివారమే ఆమె ఆ పనిలోకి దిగిపోయారు. కరోనాను కట్టడి చేసే పని. ఆ సీట్లో ఉన్న అభిషేక్ ప్రకాశ్‌కి కరోనా రావడంతో, అత్యవసరంగా ఆమెను నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆమెకే ఎందుకు? అక్కడికే వస్తున్నాం. ఇప్పటికే ఆమె రెండు పదవుల్ని నిర్వహిస్తున్నారు. ఇది మూడోది! ప్రస్తుతం యూపీ జియాలజీ అండ్ మైనింగ్కి ఆమె స్పెషల్ సెక్రెటరీ, డైరెక్టర్. ఇప్పుడిక లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కూడా. ఏప్రిల్ 15న లక్నో సిటీలో నమోదైన కరోనా కేసులు 35,865. రాష్ట్రంలో మిగతాచోట్లకంటే ఎక్కువ. ‘టీమ్ 11’ ఆపలేకపోయింది. ఆపలేకపోగా తనే కరోనా బారిన పడింది. 16వ తేదీ కూడా కేసులేం తగ్గలేదు. 17న రోషన్ జాకప్‌కి పిలుపు. ‘టేక్ ద చార్జ్ ఇమ్మీడియట్లీ’. గోండా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు రోషన్ జాకబ్ ఎలాంటి చార్జ్‌నైనా రోషన్ సవాలుగా తీసుకుంటారు. ఆమె దగ్గరో ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం సమస్యను చుట్టుముట్టి, మట్టుపెడతారు. పరిస్థితి చక్కబడుతుంది. యూపీలోని గోండా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె ఏం చేశారో చూడండి. జిల్లా అభివృద్ధిలో మహిళల ఉపాధి పథకాలను భాగం చేశారు. ‘ఉమెన్ ఎంప వర్మెంట్’ కోసం ప్రత్యేకంగా ఆమె ఏమీ పని చేయలేదు. మహిళల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడేలా చేశారు. స్త్రీ సాధికారత ప్రభావం స్త్రీల వరకే ఉంటుందా! పిల్లలు శుభ్రంగా చదువుకుంటారు. పెద్దలు బాధ్యత నేర్చుకుంటారు. ఇల్లు, ఊరు, సమాజం మెరుగవుతాయి. గోండా అలాగే క్లీన్ అయింది. కాన్పూర్ డి.ఎం.గా కూడా చేశారు రోషన్. అక్కడైతే ‘మై సిటీ’అని భారీ ప్రాజెక్టునే ప్రారంభించారు. ఆరేళ్లనాటి సంగతి ఇది. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించడం, పరిశుభ్రత, చెత్త పారేయడం, విద్యు™Œ వినియోగం, నీటి సరఫరా, మురుగు నీరు సాఫీగా ప్రవహించేలా చేయడం.. ఈ ఆరు అంశాల్లో నగర ప్రజల్ని భాగస్వాముల్ని చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే ఆ ఆధికారుల దృష్టికి సమస్య వెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమస్య పరిష్కారం అయిందీ లేనిదీ తెలిపే వ్యవస్థను కూడా. రోషన్ వచ్చాక సిటీ మొత్తం మారిపోయింది. ప్రజల్ని కలుపుకుని పోతే ‘పదండి చేద్దాం’ అని ముందుకు కదులుతారు. ప్రజల్ని ఆదేశిస్తే ‘అది మీ పని కదా’ అని వెనక్కి అడుగేస్తారు. రోషన్ సక్సెస్ మంత్రం అదే. ∙∙ రోషన్ జాకబ్ 2004 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి. యూపీకి తొలి మహిళా మైనింగ్ డైరెక్టర్. గత ఏడాది లాక్డౌన్లో కూడా ఆమె మైనింగ్ వర్క్‌ని నడిపించారు! దేశంలో ఇంకే రాష్ట్రంలోని మైనింగ్ డైరెక్టర్ కూడా ఇంత చొరవ చూపించలేదు. ఆమెను చూశాకే మిగతా రాష్ట్రాలు మైనింగ్ పనులను పునఃప్రారంభించాయి. ‘‘కార్మికుల ఉపాధికి విరామం వస్తే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది’’ అంటారు రోషన్. మరి కరోనా వస్తే! రాకుండా అన్నీ జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆనాడు ఆమె పని తీరు ఫలితాలను కళ్లారా చూసింది కనుకనే యోగి ప్రభుత్వం ఇప్పుడామెకు లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ బాధ్యతలు కూడా అప్పగించింది. 43 ఏళ్ల రోషన్ జాకబ్ కేరళ అమ్మాయి. -
యోగి ఆదిత్యానాథ్‌కు బాంబు దాడి హెచ్చరిక
లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపుతామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపంది. యూపీ పోలీస్ ప్రధాన కార్యాలయం వాట్సాప్ నెంబర్‌కు అభ్యంతరకర పదజాలంతో ఈ మెసేజ్ వచ్చింది. ఓ వర్గానికి యూపీ సీఎం ముప్పుగా పరిణమించారని అంటూ బాంబు దాడితో యోగి ఆదిత్యానాథ్‌ను మట్టుబెడతామని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం అర్ధరాత్రి ఈ మెసేజ్ రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారుదీనిపై లక్నోలోని గోమతినగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మెసేజ్ పంపిన మొబైల్ నెంబర్ కాల్ డిటైల్స్‌ను పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి : వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన సర్కార్ -
యూపీ: మరో కీలక నిర్ణయం
లక్నో: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సరిహద్దు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకెళ్లేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. నోయిడా, ఘజియాబాద్, బులంద్‌షహార్, అలీఘర్ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులకు తాగునీరు, ఆహారం వంటి సదుపాయాలు కల్పించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన సమీక్షలో సీఎం వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించగానే రవాణాశాఖ అధికారులు డ్రైవర్లు, కండక్టర్లతో సంప్రదించినట్లు అధికారి తెలిపారు. దీంతో లక్నోలోని చార్బాగ్ బస్‌స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవస్థీ, లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ కుమార్ పాండే వలస కార్మికుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ ఈనెల 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి!
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జరిగిన ఆందోళనకు, నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన యోగీ ప్రభుత్వం ఆందోళన కారులకు నోటీసులు పంపింది. ఈ నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి రూ .14.86 లక్షలు రికవరీ కోసం దాదాపు 28 మందికి నోటీసులు అందాయి. అంతేకాదు దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్ కోసం కూడా పరిహారం చెల్లించాలని కూడా యూపీ సర్కార్ ఆదేశించింది. కాగా గతవారం ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో సీఏఏ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమని ఆరోపిస్తూ 31మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని, తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పోలీసులు కనీసం 21 గురు మైనర్లను అదుపులోకి తీసుకుని, 48 గంటల పాటు చిత్ర హింసలకు గురిచేశారని హఫింగ్టన్ పోస్ట్ నివేదించింది. స్థానిక పత్రికల కథనాలు, బాధితుల ఇంటర్వ్యూల (విడుదలైన 21 మందిలో ఐదుగురిని) ఆధారంగా బహిరంగ ప్రదర్శనకు ఎప్పుడూ హాజరుకావద్దంటూ వారిని బెదిరించడంతోపాటు తీవ్రంగా కొట్టారని తెలిపింది. చేసింది, అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ డీజీపి ఓపీ సింగ్, బిజ్నోర్ జిల్లా కలెక్టర్ రామకాంత్ పాండే , బిజ్నోర్ ఎస్పీ సంజీవ్ త్యాగి ఇంకా స్పందించాల్సి వుందని పేర్కొంది. చదవండి : వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం -
జర్నలిస్టుల అరెస్ట్ : యూపీ సీఎంపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకరంగా పోస్ట్‌లు చేశారనే ఆరోపణలపై ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూపీ సీఎం యోగి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసత్య కథనాలు ప్రచురించే జర్నలిస్టులతో పాటు తనపై విషప్రచారం సాగించే ఆరెస్సెస్, బీజేపీ ప్రేరేపిత శక్తులను జైళ్లలో పెడితే వార్తాపత్రికలు, న్యూస్‌ఛానెళ్లకు సిబ్బంది కొరత తీవ్రతరమవుతుందని రాహుల్ ట్వీట్ చేశారు. యూపీ సీఎం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని, అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు. కాగా, యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్ట్‌లు షేర్ చేశారంటూ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా సహా ఐదుగురు జర్నలిస్టులను యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం యూపీ పోలీసులను ఆదేశించింది. -
‘నా భర్త అరెస్ట్ అక్రమం’
సాక్షి, న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్టులు చేసినందుకు అరెస్ట్ అయిన ఢిల్లీ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా విడుదల కోరుతూ ఆయన భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారనే ఆరోపణలపై శనివారం నుంచి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తన భర్త కనోజియాను అరెస్ట్ చేసే క్రమంలో సరైన పద్ధతులను పోలీసులు పాటించలేదని, ఆయన అరెస్ట్ అక్రమమని జగీష అరారా పేర్కొన్నారు. తన భర్తను కేవలం ఐదు నిమిషాల్లో అదుపులోకి తీసుకున్నారని, దుస్తులు మార్చుకుని ఆయన పోలీసుల వెంట వెళ్లారని అరోరా చెప్పారు. కనోజియాపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ అక్రమమని, ఆయన అరెస్ట్‌కు ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని అరోరా న్యాయవాది షాదన్ ఫరసత్ అన్నారు. పరువునష్టం చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో మేజిస్ర్టేట్ చొరవ తీసుకోవాలని పోలీసులు కాదని న్యాయవాది చెప్పారు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అభియోగాలు బెయిల్ ఇవ్వదగినవేనని అన్నారు. తన భర్తను తక్షణమే విడుదల చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ అరోరా సుప్రీం కోర్టును కోరారు. సుప్రీం కోర్టు మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది. కాగా, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యోగిపై పరువుకు భంగం కలిగేవిధంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందనందుకు అతన్ని అరెస్ట్ చేసినట్లు హజరాత్‌ఘంజ్ పోలీసు అధికారులు తెలిపారు. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు పోస్ట్‌ను షేర్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం వారందరనీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సీఎం యోగి తనని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారని.. తనుకు ఆయనతో ఎప్పటి నుంచో సంబంధం ఉందంటూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతన్న వీడియోను అతను షేర్ చేశాడు. -
‘దీదీ తీరు ప్రజాస్వామ్యానికే చేటు’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. సీబీఐ ఉదంతం నేపథ్యంలో మమతా బెనర్జీ ధర్నా చేపట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. ముఖ్యమంత్రే ధర్నాకు దిగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అభ్యంతరం వ్యక్తం చేశారు. పురూలియాలో మంగళవారం ప్రచార ర్యాలీలో పాల్గొన్న యోగి మమతా దీక్షను ఎద్దేవా చేశారు. అవినీతిపై విచారణకు ఆమె అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా పురూలియా ర్యాలీకి హాజరయ్యేందుకు యోగి హెలికాఫ్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించడంతో లక్నో నుంచి జార్ఖండ్‌లోని బొకారోకు చాపర్‌లో వచ్చిన యోగి అక్కడి నుంచి 50 కిమీ దూరంలోని పురూలియాకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల ర్యాలీలకు సైతం ఇటీవల బెంగాల్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ అధికారుల దాడులకు నిరసనగా మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. -
‘యోగిజీ..ముందు యూపీని చక్కదిద్దండి’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో పార్టీ ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు సంసిద్ధమైన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేసే ముందు ఆయన తన రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో యోగి హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ముందుగా యూపీపై దృష్టిపెట్టమని యోగిని కోరండంటూ మండిపడ్డారు. ‘యూపీలో ఎంతో మంది అమాయకులను చంపేశారు, పోలీసులనూ హత్య చేశారు. ఎంతో మందిని ఊచకోత కోశారు. సొంత రాష్ట్రంలో ముఖం చెల్లని యోగి బెంగాల్ చుట్టూ తిరుగుతున్నా’రని ఆమె ధ్వజమెత్తారు. మరోవైపు యోగి ఆదిత్యానాథ్ ర్యాలీలకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మంగళవారం ఆయన టెలిఫోన్ ద్వారానే ఆయా వేదికల వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ బృందం దాడులు చేపట్టడాన్ని నిరసిస్తూ ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు. -
పశ్చిమ బెంగాల్లో యోగి ర్యాలీకి దీదీ షాక్
-
యోగి ర్యాలీకి దీదీ బ్రేక్
లక్నో : పశ్చిమ బెంగాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీకి ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని యూపీ సీఎం కార్యాలయం పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ దినాజ్పూర్లో ఆదివారం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు సైతం మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఇది ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్టకు సంకేతమని యూపీ సీఎం సమాచార సలహాదారు మృత్యుంజయ్ కుమార్ అన్నారు. కాగా, బలూర్‌ఘట్ ఎయిర్‌పోర్ట్‌లో యోగి చాపర్‌కు అనుమతి నిరాకరించినందుకు నిరసనగా దినాజ్పూర్లో జిల్లా మేజిస్ర్టేట్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. యోగి విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరణపై జిల్లా మేజిస్ర్టేట్ సరైన వివరణ ఇవ్వలేకపోయారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సైతం అధికారులు తొలుత అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. -
వారిని సరిహద్దుల్లోనే మట్టుబెడతాం..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసిన 9 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశిస్తే వారిని మట్టుబెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను భగ్నం చేసేందుకు వారు గంగా జలాలను విషపూరితం చేయాలని కుట్ర పన్నారనే అనుమానాల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర ఏటీఎస్ బృందాన్ని ఆయన అభినందిస్తూ వీరు యూపీలో ప్రవేశిస్తూ తక్షణమే అంతమొందిస్తామన్నారు. ముంబైలో శుక్రవారం జరిగిన 31వ యూపీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు. కుంభమేళాలో విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా మీరు చాకచక్యంగా వ్యవహరించారని ఈ కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి యూపీ సీఎం అభినందించారు. ఐసిస్ ఉగ్రవాదులు యూపీలో ప్రవేశిస్తే వారిని తమ రాష్ట్ర సరిహద్దులోనే మట్టుబెడతామని స్పష్టం చేశారు. అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. -
ఆ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కుట్ర..
లక్నో : పోలీస్ అధికారి సహా ఇద్దరు మరణించిన బులంద్‌షహర్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ వ్యక్తులే ఈ అల్లర్లకు కుట్ర జరిపారా అనేది తాము తేల్చుతామని స్వామి చెప్పుకొచ్చారు. యూపీ తగలబడుతుంటే యోగి ఆదిత్యానాథ్ ప్రచారంలో బిజీగా మారారనే కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో భారత్ తగులబడలేదా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీలో ఎలాంటి విచారణ లేకుండానే వేలాది మంది అమాయక ప్రజలను జైళ్లలో నిర్భందించిన కాంగ్రెస్ యూపీ సీఎంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో గోవధ వదంతుల నేపథ్యంలో హింసాత్మక నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అల్లరిమూకలు పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలకు నిప్పంటించి రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లర్ల ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ వర్మ సహా స్ధానిక యువకుడు మరణించారు. -
రేపు వారణాసిలో ప్రధాని పర్యటన
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని రెండు భారీ జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. 34 కిలోమీటర్ల పరిధిలో రూ 1571 కోట్లతో వీటిని నిర్మించారు. వారణాసి రింగ్ రోడ్డు తొలి దశను 16.55 కిలోమీటర్లలో రూ 759.36 కోట్లతో చేపట్టారు. రూ 812 కోట్లతో 17 కిలోమీటర్ల పొడవైన బబత్‌పూర్-వారణాసి రోడ్డును 56వ నెంబర్ జాతీయ రహదారిపై పూర్తిచేసినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇక కేంద్ర ప్రభుత్వ జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా గంగా నదిపై మల్టీ మోడల్ వాటర్‌వేస్ టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. పర్యావరణ హితంగా సరుకుల రవాణాను అభివృద్ధి చేసే క్రమంలో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతోంది. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని వెంట యూపీ గవర్నర్‌రామ్ నాయక్, సీఎం యోగి ఆదిత్యానాథ్ పలువురు కేంద్ర మంత్రులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
‘అయోధ్య’పై త్వరలో శుభవార్త
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే భక్తులు ఓ శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం రామ భక్తులు మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత విద్య ప్రమాణాలపై హరిద్వార్‌లో జరిగిన జ్ఞానకుంభ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈసారి దీపావళి వేడుకలను రాముడి జన్మ స్థలంలో జరుపుకునేందుకు దక్షిణ కొరియా నుంచి ఓ ఉన్నత స్థాయి బృందం వస్తోందని చెప్పారు. జ్ఞానకుంభ్ కార్యక్రమంలోనే యోగా గురు బాబా రాందేవ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు రామ మందిర నిర్మాణానికి వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆలయ నిర్మాణాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని బీజేపీ నేతలైన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు వ్యాఖ్యానించారు. మరోవైపు రామాలయ నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 3 వేల మంది సాధువులు, సన్యాసులు ఢిల్లీలోని తాల్కటోరా మైదానంలో శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం కొత్త చట్టం లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని దేశంలో హిందూ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారతీయ సంత్ సమితి డిమాండ్ చేసింది. మరో కేంద్ర మంత్రి ఉమాభారతి ఢిల్లీలో మాట్లాడుతూ ‘హిందువులు ప్రపంచంలోనే అత్యంత సహనపరులు. అయితే అయోధ్యలో రామాలయ పరిసరాల్లో మసీదును కూడా కట్టాలనే మాటలు హిందువులను అసహనానికి గురిచేస్తాయి’ అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తనతో కలిసి ఆలయానికి పునాది రాయి వేయాలని ఆమె ఆహ్వానించారు. -
సొంత నియోజకవర్గంపై సీఎం దృష్టి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌పై దృష్టి సారించారు. గత మార్చిలో గోరఖ్‌పూర్ లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అధికార బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్ నుంచి ఆదిత్యనాథ్ ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. యూపీ సీఎంగా యోగి ఎన్నిక కావడంతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్‌లో ఎస్పీ-బీఎస్సీ కూటమి విజయం సాధించి బీజేపీకి షాక్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గోరఖ్‌పూర్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని యోగి పట్టుదలతో ఉన్నారు. గడిచిన రెండు నెలల్లో పదిసార్లు గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దానిలో భాగంగా ఎయిమ్స్, వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్సు లాంటి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. పర్యటన అనంతరం గోరఖ్‌పూర్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యేలు, నేతలతో యోగి చర్చించారు. బీజేపీకి కంచుకోటగా పేరున్న గోరఖ్‌పూర్‌లో అధికార పార్టీ ఓడిపోవడం కమలనాథులకు మింగుడుపడటం లేదు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సొంత స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఎస్పీ-బీఎస్పీ కూటమి రానున్న ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలుచేసి, అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. -
యోగి ఆదిత్యనాథ్ అనుచిత ఆగ్రహం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో గురువారం నాడు కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ రైలు, ఓ స్కూల్ వ్యాన్ ఢీకొన్న సంఘటనలో 13 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నినాదాలు ఆపండి, ఇది విషాధకర సంఘటన. మీ నాటకాలు కట్టి పెట్టండి. నా మాటలు ఆలకించి మీ నాటకాలు ఆపండి!’ అంటూ ఆదిథ్యనాథ్ ఆవేశంగా మాట్లాడారు. జరిగిన దుర్ఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం, చేయూత అందించాల్సిన ముఖ్యమంత్రి ఇలా ‘మీ నాటకాలు ఆపండి’ అంటూ మాట్లాడం పట్ట బాధితుల తల్లిదండ్రులే కాకుండా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతులంతా డివైన్ స్కూల్‌కు చెందిన పిల్లలే. అందరూ పదేళ్లలోపు వారే. యోగికి సంబంధించిన ఈ వివాదాస్పద వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అధికారం కోసమే వాళ్ల రాజీ
లక్నో : బీజీపీని దెబ్బకొట్టి అధికారం చేజిక్కిచుకోవాలనే ఉద్దేశంతోనే ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలుపుతున్నాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విమర్శించారు. అధికారమే పరమాధిగా మాయావతి-అఖిలేష్‌లు చేతులు కలిపి రాజీకొచ్చారని యోగి ఆరోపించారు. శనివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో వారి కూటమి విజయం సాధించినా, 2019 ఎన్నికల్లో మాత్రం వాళ్ల ప్రభావం ఉండబోదని చెప్పారు. ‘రానున్న ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేది తేల్చుకోండి’ అంటూ విపక్షాలకు ఆయన సవాలు విసిరారు. ఇక అతి విస్వాసమే గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమన్న ఆయన.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్కౌంటర్లపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ... శాంతి భద్రతల కోసం, క్రిమినల్స్‌ను కట్టడి చేయటం కోసం ఇలాంటి చర్యలు తప్పేం కాదని సమర్థించుకున్నారు. -
యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏమయ్యాయి..?
సాక్షి,న్యూఢిల్లీ: ఆగ్రా ఫతేపూర్ సిక్రీలో విదేశీ దంపతులపై జరిగిన దాడిని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే యోగి ఆధిత్యానాథ్ ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్వ్కాడ్స్ ఏమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఫతేపూర్ సిక్రీని సందర్శించిన జంట అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై దాడులు జరిగాయని అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా యాంటీ రోమియో బృందాలు ఏం చేస్తున్నాయని అఖిలేష్ నిలదీశారు. కాగా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. యూపీ సర్కార్‌ను దీనిపై నివేదిక కోరానని, దుండగుల దాడిలో గాయపడ్డ స్విస్ దంపతులను తమ మంత్రిత్వ శాఖ అధికారలు పరామర్శిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. స్విస్ దంపతులపై దాడి ఘటనకు సంబంధించి నలుగురు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటనకు బాధ్యుడైన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
సోఫా, రెడ్‌కార్పెట్, ఏసీ వద్దు: సీఎం
లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): తన పర్యటనల సందర్భంగా ఎటువంటి అదనపు ఏర్పాట్లు చేయొద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల దియోరియా, గోరఖ్పూర్లలోని అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అధికారులు హడావుడి పడుతూ చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు ఇబ్బంది పడ్డారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ఏసీ, రెడ్ కార్పెట్, సోఫాలు సమకూర్చవద్దని అధికారులను ఆదేశించారు. అధికార దర్పాన్ని ప్రదర్శించుకునే ఇటువంటి చర్యలతో సీఎం చాలా అసహనంగా ఉన్నారని ఆ ప్రకటనలో కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలన విభాగాల అధిపతులకు ఆదేశాలు అందాయి. జూలై 8వ తేదీన గోరఖ్‌పూర్‌లో సీఎం పర్యటించిన సందర్భంగా అధికారులు.. కిలోమీటర్ మేర ఎర్ర తివాచీ పరిచారు. దారి పొడవునా ప్రజలు, నివాసాలు కనిపించకుండా రెండు వైపులా తెల్లటి కర్టెన్లు ఏర్పాటు చేశారు. అమరడైన సైనికుడి కుటుంబాన్నిపరామర్శిండానికి యోగి వెళ్లిన సమయంలో అధికారులు సైనికుడి ఇంట్లో కాషాయ రంగు కర్టెన్లు, ఎయిర్ కూలర్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఖరీదైన సోఫా ఏర్పాటు చేశారు. మే 12వ తేదీన డియోరియాలో అమర సైనికుడి నివాసానికి వెళ్లిన సందర్భంలోనూ ఇవే హంగులు, ఆర్భాటాలు ఏర్పాటు చేశారు. ఆయన పర్యటన ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వాటన్నింటిని తొలగించారు. అప్పట్లోనే వీటి విషయమై సీఎం ఆదిత్యనాథ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అదే తీరు కొనసాగటంతో సీఎం కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. -
సీఎం ఆఫీసు వద్ద విషాదం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(లోక్ భవన్) వద్ద విషాదం చోటుచేసుకుంది. విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ఇనుపగేటు మీద పడటంతో తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలి తల్లి నిర్మాణ పనుల్లో కూలిగా పనిచేస్తోంది. అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారంలో వీరు నివసిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి లక్నోలో భారీ వర్షం కురుస్తుండటంతో పనులు జరగలేదు. సాయంత్రానికి వర్షం తగ్గడంతో ఆట నిమిత్తం పాప బయటికొచ్చి అనూహ్యంగా ప్రమాదానికిగురైంది. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూసింది. అంతకు ముందురోజే నిలిపిన భారీ ఇనుపగేటు.. వర్షం కారణంగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించాల్సిఉంది. లోక్‌భవన్‌కు భారీ హంగులు యూపీ సీఎం కార్యాలయమైన లోక్‌భవన్‌ను భారీ ఎత్తున విస్తరించే పనులు 2016లో(అఖిలేశ్ హయాంలో) ప్రారంభమయ్యాయి. సుమారు ఆరున్నర ఎకరాల ప్రాంతంలో రూ.602కోట్ల వ్యయంతో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడున్న కార్యాలయం చిన్నదిగా ఉండటంతో మరింత సౌకర్యవంతమైన, విశాలమైన భవంతులను కడుతున్నారు. -
నేలపై కూర్చుంటాను. ప్రత్యేక ఏర్పాట్లొద్దు: సీఎం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరుకు యోగి అయినా విలాసవంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమరుడైన ఓ బీఎస్ఎఫ్ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం యోగి వెళ్లిన సందర్భంగా ఆయన ఇంటిలో ఏసీ, సోఫా, కార్పెట్లను అధికారులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. వారి ఇంటి నుంచి సీఎం యోగి వెళ్లిపోగానే వాటిని అధికారులు తొలగించి, తమతోపాటు తీసుకెళ్లారు. సీఎం యోగి ఎక్కడికి వెళ్లినా ఇదేవిధంగా అధికారులు విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆసక్తికరమైన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో పర్యటనలు, తనిఖీలు, పథకాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు తన కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 'నాగురించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దు. మామూలు నేల మీద కూర్చునే వ్యక్తుల్లో నేను ఒకడిని' అని సీఎం యోగి అన్నారు. -
ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నుంచి గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ‘ఈ రోజుల్లో సన్యాసులకు ప్రజలు భిక్ష కూడా వేయడం లేదు. ప్రధాని మోదీ ఏకంగా నాకు ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. సానుకూలంగా ఎలా ఆలోచించాలి, గొప్ప పనులు ఏవిధంగా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాన’ని సీఎం యోగి చెప్పారు. తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని పేర్కొన్నారు. ‘రేపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ప్రమాణ స్వీకారానికి ముందురోజు అమిత్ షా నాతో చెప్పారు. హఠాత్తుగా అలా చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా దగ్గర ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయ’ని వెల్లడించారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. యూపీ పట్టిన రోగం ఏంటో తనకు తెలుసునని, దాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తానని సీఎం యోగి చెప్పారు. -
యోగి ఆధిత్యనాథ్‌పై కేసులేమవుతాయి?
లక్నో: పద్దెనిమిది సంవత్సరాల క్రితం, 1999, ఫిబ్రవరి 10వ తేదీన భారతీయ జనతా పార్టీకి చెందిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆధిత్యనాథ్ తన సాయుధ అనుచరులతో కలసి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లా పాంచ్రుఖియా గ్రామంలో ఓ ముస్లింల శ్మశానాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరమికొట్టారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై అప్పటి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుపుతున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు, పారిపోతున్న ఆధిత్య బృందానికి తారసపడ్డారు. వారిపై ఆగ్రహంతో ఆధిత్యనాథ్ బృందం వారిపైకి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ నాయకుడు తలత్ అజీజ్‌కు వ్యక్తిగత అంగరక్షుకుడిగా విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సత్యప్రకాష్ యాదవ్ ఆ కాల్పుల్లో గాయపడి తదనంతరం మరణించారు. ఆదేరోజు సాయంత్రం ఆధిత్యనాథ్, ఆయన 24 మంది అనుచరులపై మహారాజ్ గంజ్ పోలీసు స్టేషన్లో హత్యాయత్నం, దొమ్మి, అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉండడం, ముస్లింల పవిత్ర స్థలంలోకి అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రవేశించడం తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ఇప్పటికీ ఆ అభియోగాలు విచారణలోనే ఉన్నాయి. వాటిని రాష్ట్ర పోలీసు విభాగంలోని సీబీసీఐడి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రయ్యారు. ఆధిత్యనాథ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ఏడాదిలోగానే అంటే 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో ముస్లింల శ్మశానాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన అనంతరం, గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2002 ఆధిత్యనాథ్ హిందూ యువ వాహిణిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2007 వరకు 24 మత ఘర్షణలు జరగ్గా, పలువురి ప్రాణాలను బలితీసుకున్న ఘర్షణలు ప్రధానంగా ఏడు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆధిత్యనాథ్, ఆయన అనుచరులపై పలు కేసులు దాఖలయ్యాయి. ఆ కేసులు కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర పోలీసుల విచారణలోనే ఉన్నాయి. 2007 వరకు పలు మత ఘర్షణల్లో ఆధిత్యనాథ్ ప్రత్యక్షంగా పాల్గొనగా, అప్పటి నుంచి తెర వెనక పాత్రకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ మత ఘర్షణలను రెచ్చగొడుతున్నారు. ఈ ప్రసంగాలకు సంబంధించి కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న ఆధిత్యనాథ్‌పై రాష్ట్ర పోలీసులు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. -
శాంతిభద్రతలే తొలి ప్రాధాన్యత
డీజీపీకి సూచించిన యూపీ సీఎం ⇒ 15 రోజుల్లో అధికారులు ఆస్తులు వెల్లడించాలి ⇒ అలహాబాద్‌లో బీఎస్పీ నేత హత్యపై సీరియస్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నట్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్, డీజీపీ జావీద్ అహ్మద్, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేబాషిష్ పాండాలతో సమావేశమ్యారు. వారికి బీజేపీ మేనిఫెస్టోను అందజేసిన సీఎం.. వీటి అమలు దిశగా కార్యాచరణను మొదలుపెట్టాలని ఆదేశించారు. అలహాబాద్‌లో జరిగిన బీఎస్పీ కార్యకర్త హత్యపై స్పందిస్తూ.. శాంతిభద్రతల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డీజీపీకి సూచించారు. దీంతోపాటుగా రాష్ట్రంలోని 75 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు, ఇతర పాలనాపరమైన సమస్యపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం.. సోమవారం అధికారులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో స్థిర, చరాస్తుల వివరాలన్నీ అందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ కూడా ఆదిత్యనాథ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 47 మంది మంత్రులకు త్వరలోనే శాఖలు కేటాయించనున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలహాబాద్‌లో బీఎస్పీ నేత హత్య: అలహాబాద్ సమీపంలోని మవాయిమా పోలీసుస్టేషన్ సమీపంలో బీఎస్పీకి చెందిన మహ్మద్ షమీ (60) అనే నేతను గుర్తుతెలియని ఆదివారం రాత్రి వ్యక్తులు కాల్చి చంపారు. సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే ఈ ఘటన జరగటం కలకలం రేపింది. కాగా, నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా పశువులను వధిస్తుండటంతో అలహాబాద్‌లో రెండు కబేళాలను అధికారులు మూసేశారు. -
‘యోగీ నాతో నిర్మొహమాటంగా చెప్పారు’
న్యూఢిల్లీ: తనకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కావాలని ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనతో చాలా నిర్మొహమాటంగా చెప్పేశారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్ర మైనందున తన తర్వాత స్థానంలో ఇద్దరు ఉండి బాధ్యతలు పంచుకుంటే తనకు పరిపాలన కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన చెప్పారని తెలిపారు. ‘వారు ముగ్గురు ముగ్గురే. వాళ్లది చాలా గొప్ప సమన్వయం’ అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేశవ్ ప్రసాద్ మౌర్యను, దినేశ్ శర్మను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరి ముగ్గురి పేర్లను శనివారమే ప్రకటించారు. యోగీ మంచి నిజాయితీ పరుడని, ఆయనను వేలెత్తి చూపించే అవకాశమే లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని ప్రతి క్షణం తపించే ఆయన కల నేడు సీఎంగా మారుతుండటంతో నెరవేరిందని చెప్పారు. -
‘ఐదుసార్లు గెలవడం చిన్న విషయం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాము ఎంపిక చేసిన యోగి ఆదిత్యనాథ్ సచ్ఛీలుడని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనను ఎవరూ వేలెత్తి చూపించలేరని పేర్కొన్నారు. ఒకే నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందడడం మామూలు విషయం కాదన్నారు. గోరఖ్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ ఐదు పర్యాయాలు గెలిచిన సంగతి తెలిసిందే. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం సరైందేనని వెంకయ్యనాయుడు అన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బహిరంగంగా తనను ఆదిత్యనాథ్ కోరారని వెల్లడించారు. మీరు ముగ్గురు మంచి కాంబినేషన్ అవుతారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
‘సంబరాల పేరుతో ఓవర్ యాక్షన్ వద్దు’
-
‘సంబరాల పేరుతో ఓవర్ యాక్షన్ వద్దు’
లక్నో: సంబరాల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యానాథ్ తన మద్దతుదారులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. సంబరాల పేరుతో గొడవలకు దిగేవారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వేడుకల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని, ఇటువంటి వారిపై పోలీసులు తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్న ఆయన ఈ రోజు ఉదయం డీజీపీ జావేద్ అహ్మద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి దేవశిష్ పాంగా, లక్నో ఎస్ఎస్ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సమీక్షించారు. కాన్షీరాం స్మృతి ఉప్వన్ కు వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ మధ్యాహ్నం లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉప్వన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
తెరపైకి రామ మందిరం!
లక్నో: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపికతో రామ జన్మభూమిలో మందిర నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పలు వేదికలపై యోగి రామ మందిర నిర్మాణం చేపట్టి తీరతామని బహిరంగంగానే ప్రకటించటం.. యాదృచ్ఛికంగా అదే వ్యక్తి సీఎంకానుండటంతో ‘అయోధ్య’పై హిందువుల్లో ఆశలు పెరిగాయి. 2014 బీజేపీ మేనిఫెస్టోలోనూ రామమందిర అంశం ప్రముఖంగా ఉంది. తాజా ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని చేర్చినా అభివృద్ధి ఎజెండాతోనే బీజేపీ ప్రచారం చేసింది. ప్రముఖులను పక్కనపెట్టి యోగిని హఠాత్తుగా తెరపైకి తీసుకోవటం వెనక కచ్చితమైన కారణం అంతుచిక్కటం లేదు. అయితే కొత్త సీఎంను.. 2019 ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఎంపిక చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వారం రోజులు తీవ్ర తర్జన భర్జనలు జరిపిన అనంతరం హిందుత్వ ఐకాన్‌గా పేరున్న ఆదిత్యనాథ్‌ను సీఎంగా ఎంపిక చేసింది. ఇదంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హిందువుల ఓటును ఆకర్శించేందుకే అయిఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆరెస్సెస్ మూలాలున్న కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలను కాకుండా అసలు ఆరెస్సెస్ వాసనలేమీ లేని ఖట్టర్ హిందూనేత ఆదిత్యను ఎంపిక చేశారనుకుంటున్నారు. ప్రస్తుతానికి మందిర నిర్మాణం అంశం కోర్టు పరిధిలో ఉన్నా.. అడపాదడపా దీన్ని ప్రజలకు గుర్తుచేస్తూ వచ్చిన ఆదిత్య సీఎం అయితే.. మందిర నిర్మాణం తప్పక జరుగుతుందని హిందువులు భావిస్తున్నారు. -
అతివాదికి అందలం
హిందువులను క్రైస్తవంలోకి మార్చేందుకే మదర్ థెరీసా భారత్‌కు వచ్చారు – థెరీసాపై యోగి వివాదాస్పద వ్యాఖ్య షారుక్ ఖాన్.. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాషలో మాట్లాడుతున్నారు. ప్రజలు నీ సినిమాలు చూడకపోతే రోడ్డున పడతావ్ - యోగి యూపీని, భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చేంతవరకూ విశ్రమించను. –2005లో ఘర్‌వాపసీ’ కార్యక్రమంలో.. హిందూ అతివాదిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్‌కు యూపీ పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆర్ఎస్ఎస్ మూలాలు లేనప్పటికీ... సొంతగా ‘హిందూ యువ వాహిని’ని స్థాపించిన యోగి హిందూత్వ అతివాదిగా ముద్ర పడ్డారు. మతమార్పిడులపై, బుజ్జగింపు రాజకీయాలపై (మైనారిటీలను సంతృప్తి పర్చే రాజకీయాలపై), హిందూత్వ అతివాద భావాలపై ముక్కుసూటిగా, తన భావాలను వ్యక్తపరుస్తారు. స్వతంత్రంగా వ్యహరించే స్వభావమున్న ఈ గోరక్నాథ్ మఠాధిపతి అధికారం పీఠంపై కూర్చున్నాక... సరైన ‘చెక్’ లేకపోతే మోదీ అండ్ కోకు ఇబ్బందికరంగా మారొచ్చనే విమర్శలొస్తున్నాయి. మఠాధిపతిగా.. చరిత్రాత్మక గోరఖ్‌పూర్ పట్టణంలో 52 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొన్న గోరఖ్‌నాథ్ మఠం చాలా సుప్రసిద్ధం. గోరఖ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మఠం ప్రభావం చాలా ఉంటుంది. ఈ మఠాధిపతులు 1967 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఈ మఠం పీఠాధిపతి అయిన అవైద్యనాథ్ ఓసారి ఉత్తరాఖండ్‌లోని తన ఊరినుంచి అజయ్ మోహన్ బిస్త్ అనే సైన్స్ గ్రాడ్యుయేట్‌ను గోరఖ్‌పూర్‌కు తీసుకువచ్చారు. 23 ఏళ్ల వయసులో సన్యాసం ఇప్పించి.. ఆదిత్యనాథ్‌గా నామకరణం చేసి 1994లో తన వారసుడిగా ప్రకటించారు. 1997లో స్థానికంగా బ్రాహ్మణులు– ఠాకూర్ల మధ్య గొడవల్లో ఠాకూర్ల నాయకుడు చనిపోవటంతో ఆదిత్యనాథ్ నాయకత్వ బాధ్యతలు అందుకున్నారు. 1998లో తొలిసారిగా బీజేపీ టికెట్‌పై గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచి 26 ఏళ్ల వయసులో లోక్‌సభలో అడుగుపెట్టారు. 12వ లోక్‌సభలో ఆయనే అత్యంత పిన్న వయస్కుడు. అప్పటినుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. హిందువులపై ఎక్కడే చిన్నదాడి జరిగినా.. ఆయన అక్కడికి వెంటనే తన అనుచరులతో కలిసి వెళ్లిపోతారు. 2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన మతఘర్షణల సమయంలో అరెస్టు అయి 15 రోజులు జైల్లో ఉన్నారు. 2014 సెప్టెంబరులో అవైద్యనాథ్ పరమపదించడంతో గోరఖ్‌నాథ్ మఠానికి ఈయన మహంత్ (మఠాధిపతి) అయ్యారు. ఈయనపై హత్యాయత్నంతో పాటు పలు క్రిమినల్ కేసులున్నాయి. అల్లర్లను రెచ్చగొట్టడం, ఖబరస్తాన్ల్లోకి బలవంతంగా చొచ్చుకెళ్లడం, ఇతరుల ప్రాణాలకు, భద్రతకు ముప్పు కలిగించడం, భయబ్రాంతులకు గురిచేయడం.. ఇలా పలు అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దర్బార్తో ప్రజలకు చేరువ గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం ఆదిత్యనాథ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. జనం బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వందల కొద్దీ లేఖలను రాస్తుంటారు. మఠానికి అనుబంధంగా ఉండే ఆయుర్వేద ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి ప్రజలకు వైద్య సేవలు అందేలా చేశారు. మఠాధిపతిగా గౌరవం.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడం ఆయనపై అభిమానాన్ని మరింత పెంచింది. బీజేపీతో సంబంధాలు కమలం గుర్తుపై పోటీచేస్తున్నప్పటికీ తన అవసరం బీజేపీకి ఉంది కాని... పార్టీ అవసరం తనకు లేదనే ధోరణి ఆయనది. పలు సందర్భాల్లో పార్టీ విప్‌ను బహిరంగంగానే ధిక్కరించారు. 2014లో ఐదోసారి ఎంపీగా గెలిచిన యోగికి పూర్వాంచల్ కోటాలో మంత్రి పదవి ఇవ్వొచ్చు. కానీ మోదీ ఇవ్వలేదు. 2016లో ఎయిమ్స్ శంకుస్థాపన వచ్చినపుడు గోరఖ్‌నాథ్ మఠానికి వచ్చిన ప్రధానిని కలిసిన కొందరు సాధువులు.. యోగిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరగా మోదీ మౌనం వహించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనతో ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో 2016లో మంత్రిపదవి ఇవ్వజూపగా తిరస్కరించారు. సీఎం పదవిపై ఎప్పటినుంచో ఆశలు యూపీ రాజకీయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన నేత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా ఢిల్లీకి మారడం, పలువురు సీనియర్లు క్రియాశీల రాజకీయాలకు దూరమవటంతో సీఎం పదవిపై యోగి చాలాకాలంగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ వ్యూహాత్మకంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. తన అనుచరులకు కోరినన్ని టికెట్లు ఇవ్వకున్నా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొన్న ఆదిత్యనాథ్.. కమళ దళపతి అమిత్ షాకు ఈసారి బాగా సహకరించారు. యూపీ అంతటా కలియదిరిగి ప్రచారం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ తర్వాత స్టార్ క్యాంపెయినర్ యోగియే. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రాజపుత్ర యోగి
యూపీ సీఎంగా రాజపుత్ర వర్గానికి చెందిన ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేయటం ద్వారా మరోసారి బ్రాహ్మణేతరులకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ. మొదటి సీఎం కల్యాణ్‌సింగ్ లోధా (బీసీ) కాగా, తర్వాత సీఎంలు రాంప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్ (రాజ్‌పూత్)లు అగ్రవర్ణాలవారు. అయితే, బ్రాహ్మణాధిపత్యం ఎక్కువనే ప్రచారం ఉన్నప్పటికీ ఈ వర్గానికి ఇంతవరకు సీఎం పదవిని ఇవ్వలేదు. 1946 నుంచీ కాంగ్రెస్ తరఫున 10 మంది సీఎంలు అయితే.. వారిలో ఆరుగురు (పండిత గోవిందవల్లభ్ పంత్, సుచేతా కృపలాణీ, కమలాపతి త్రిపాఠీ, హెచ్ఎన్ బహుగుణ, ఎన్డీ తివారీ, శ్రీపతి మిశ్రా) బ్రాహ్మణులే. 21 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ పాలన తర్వాత 1967లో జాట్‌నేత చౌధరీ చరణ్ సింగ్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ పాలనలో బ్రాహ్మణ, కాయస్థ, వైశ్య వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రులయ్యారు. బ్రాహ్మణుల తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బీసీ నేతగా రాంనరేశ్ యాదవ్ తొలిసారి 1977లో (జనతాపార్టీ) సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే రాజపుత్ర నేతలు వీపీ సింగ్ (1980లో), వీర్‌బహాదూర్ సింగ్(1985లో) సీఎంలయ్యారు. మధ్యలో 6నెలలు కాంగ్రెసేతర సంకీర్ణ సర్కారును నడిపిన సీఎం త్రిభువన్ నారాయణ్ సింగ్ కూడా రాజపూత్ వర్గానికి చెందినవారే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పాలరాతి మందిరంపై పచ్చని మచ్చలు
లక్నో: ప్రఖ్యాత ప్రపంచ వారసత్వ కట్టడం తాజ్‌మహల్‌పై ఏర్పడుతున్న పచ్చని మచ్చలకు కారణాలు అన్వేషించి దానికి పరిష్కార మార్గాలను తెలియజేస్తూ తనకు నివేదించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం ప్రభుత్వ అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. పాలరాతి మందిరమైన తాజ్‌మహల్‌పై ఏర్పడుతున్న మచ్చలకు యమునానదిలో పారవేస్తున్న కాలుష్య వ్యర్థాలు కారణం కావచ్చని, ఇది కాకుండా ఇతరత్రా కారణాలు ఉంటే వాటిని పరిశీలించి వాస్తవాలు కనుగొనాలని సీఎం ఆగ్రా డివిజినల్ కమిషనర్,జిల్లా మేజిస్ట్రేట్, పీడబ్లూడీ విభాగం, ఆర్కియాలజీ, కాలుష్యనియంత్రణ మండలి అధికారులను కోరారు. కాగా కాలుష్యంబారిన పడుతున్న తాజ్ పరిరక్షణా చర్యలపై గతవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు, యూపీ ప్రభుత్వానికి, నోటీసులు జారీచేసిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పై చర్యలకు ఉపక్రమించింది. -
అఖిలేష్ యాదవ్ థ్యాంక్స్ : జయలలిత
టీనగర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు రాష్ట్ర సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో రాష్ట్రానికి పలువురు ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమిళనాడుకు రూ.25 కోట్ల రూపాయల నిధులను అందజేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో ముఖ్యమంత్రి జయలలిత అఖిలేష్ యాదవ్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె రాసిన లేఖలో ఈ విధంగా తెలిపారు. రాష్ట్రంలో వరద నివారణ పనులు వేగవంతంగా జరుగుతున్న స్థితిలో ఇందుకు సాయపడే విధంగా తమరు అమూల్యమైన నిధిగా రూ.25 కోట్లు కేటాయించి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
మావాడు.. పనికిమాలిన సీఎం: ఎమ్మెల్సీ
''ఇప్పుడున్నది అసలు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి.. వెంటనే ఆయనను మార్చేసి అనుభవజ్ఞుడైన, సమర్థుడైన కొత్త ముఖ్యమంత్రిని పెట్టండి. లేకపోతే పార్టీ మనుగడే అనుమానంలో పడుతుంది'' అని ఓ ఎమ్మెల్సీ తమ సొంత పార్టీ ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్సీ పేరు.. దేవేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన చెప్పిన ముఖ్యమంత్రి.. అఖిలేష్ యాదవ్. ఆయన సూచన చేసినది.. సాక్షాత్తు పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్‌కి. ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసే అన్ని సంస్థలలోను అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని దేవేంద్ర ప్రతాప్ ఇటీవలే ఆరోపించారు. యూపీపీఎస్సీ గత రెండేళ్లలో చేసిన నియామకాలు అన్నింటి మీదా సీబీఐ దర్యాప్తు చేయించాలని జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు. నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న తర్వాత ఇప్పటికీ అఖిలేష్ యాదవ్ ఒక గుర్తింపు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారని, చాలా సందర్భాల్లో ఆయన పనితీరు సరిగా ఉండట్లేదని సింగ్ తాజాగా చెప్పారు. యూపీ చరిత్రలోనే అత్యంత బలహీనమైన, అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. ఉత్తరప్రదేవ్ రాష్ట్రానికి అఖిలేష్ ఓ బండలా తగులుకున్నారని విమర్శించారు. అందువల్ల పార్టీ బతికుండాలంటే వెంటనే సీఎంను మార్చేయాల్సిందిగా నేతాజీని (ములాయం) కోరతున్నానని ఆయన విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. -
సిఎం అఖిలేష్‌తో భేటీ కానున్న కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందం గురువారం ఉదయం లక్నో బయలుదేరి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కేటీఆర్ బృందం భేటీ కానున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై యూపీ సిఎం ఆసక్తి కనిబరిచారు. దీంతో అఖిలేష్ ఆహ్వానం మేరకు ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ బృందం ఆయనకు తెలియజేయనున్నారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. కేటీఆర్‌తో పాటు అధికారులు రేమండ్ పీటర్, సురేందర్ రెడ్డి లక్నో వెళ్లారు. -
గజేంద్ర కుటుంబానికి రూ.5 లక్షల సాయం
లక్నో: భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సహాయం ప్రకటించారు. పార్టీ తరుపున అతడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించనున్నట్లు శుక్రవారం తెలియజేశారు. గజేంద్ర మరణం తనను ఎంతో బాధించిందని, అతడి మరణంపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. దేశంలో రైతులు సంక్షభ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పిన ఆయన అకాల వర్షాల కారణంగా వారు మరింత ప్రమాదంలో పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణకు కలిసి కట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. -
హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం: అఖిలేష్ యాదవ్
-
అఖిలేష్ కాన్వాయ్‌పై అంజన్ అనుచరుల దాడి