సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తలైవా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు ప్రత్యేకంగా లక్నో వెళ్లారు.
(ఇది చదవండి: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!)
అయితే యోగిని కలిసిన రజినీకాంత్ ఎవరూ ఊహించని విధంగా ఆయన కాళ్లకు మొక్కారు. లక్నోలోని యూపీ నివాసానికి వెళ్లిన సమయంలో యోగి పాదాలకు నమస్కరించారు. అయితే రజినీకాంత్ చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో తలైవా తీరును తప్పుబడుతున్నారు. మరికొందరైతే సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఎందుకలా చేశాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది,.
అయితే రజినీకాంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి కాళ్లు మొక్కలేదని.. యోగి సన్యాసి కాబట్టే అలా చేశాడని అంటున్నారు. రజినీకాంత్‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ అని.. యోగి గతంలో గోరఖ్ పూర్ పీఠాధిపతి పదవిలో ఉండేవారని.. అదే భక్తి భావంతో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారని భావిస్తున్నారు. ఏది ఏమైనా వయసులో చిన్నవాడైనా యోగి కాళ్లకు తలైవా నమస్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
(ఇది చదవండి: ఖుషి రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు అన్ని కోట్లు తీసుకున్నారా?)
Rajnikanth who is both bigger in stature and age than Yogi Adityanath is touching his feet.
— Roshan Rai (@RoshanKrRaii) August 19, 2023
Rajnikanth is 72, Yogi is 51.
Why is a superstar touching the feet of a politician? He lost all respect today. pic.twitter.com/edY8rjJ6g9
అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు వెళ్లిన రజినీకాంత్ ఆయనతో కలిసి చూడలేకపోయారు. అత్యవసర పనుల కారణంగా యోగి ఆదిత్యనాథ్ అందుబాటులో లేకపోవడంతో.. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి జైలర్ చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాతనే లక్నోలోని యోగి ఆదిత్యనాథ్ నివాసానికి వెళ్లి కలిశారు. కాగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment