సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జైలర్ సక్సెస్‌లో ఆయన ఉన్నారు. ఆగష్టు 10న విడుదలైన జైలర్ ఇప్పటికి కూడా కలెక్షన్స్‌లలో తగ్గడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాల యాత్రకు వెళ్లి వచ్చిన తలైవా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి రజనీ వెళ్లారు. ఆ సమయంలో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది.
(ఇదీ చదవండి: రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా)
అయితే రజనీకాంత్ చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. తలైవా తీరును కొందరు తప్పుపట్టినా మరికొందరు మాత్రం సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థించారు. రజినీకాంత్ ఎందుకలా చేశాడంటూ నెట్టింట భారీ చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని తలైవాపై పలు ప్రశ్నలు వచ్చాయి.
తాజాగ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రజనీ ఇదే విషయంపై మీడియాతో ఇలా స్పందించారు. ' యోగులు, సన్యాసిల పాదాలను తాకి, వారి ఆశీర్వాదం తీసుకోవడం నా అలవాటు, వారు నా కంటే చిన్నవారైనా, నేను ఆ పని తప్పకుండా చేస్తాను. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించాను. అంతకు మించి మరో ఉద్దేశ్యం లేదు.' అని ఆయన తెలిపారు. రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో జైలర్ దూసుకెళ్తుండటంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జైలర్ ద్వారా తనకు భారీ విజయాన్ని అందించినందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినీ ప్రేమికులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు.
(ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే)
Comments
Please login to add a commentAdd a comment