UP CM Yogi Adityanath Gets Death Threats In WhatsApp, Probe Begins - Sakshi
Sakshi News home page

Yogi Adityanath Death Threats: చంపేస్తామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు

Published Tue, Aug 9 2022 5:54 PM | Last Updated on Tue, Aug 9 2022 6:16 PM

Utter Pradesh CM Yogi Adityanath Gets Death Threat Over WhatsApp - Sakshi

లక్నో:  ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. యూపీ పోలీస్‌ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ వాట్సాప్‌కు ఈ సందేశం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డయల్‌ 112 హెల్ప్‌లైన్‌ వాట్సాప్‌ నంబర్‌కు షాహిద్‌ అనే వ్యక్తి ఆ మెసేజ్‌ను పంపించినట్లు గుర్తించామన్నారు. బాంబు పెట్టి ముఖ్యమంత్రిని హత్య చేస్తానని సందేశంలో రాశాడని పోలీసులు తెలిపారు. 

పోలీస్‌ ప్రధాన కార్యాలయం స్టేషన్ కమాండర్‌ సుభాష్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లక్నోలోని సుశాంత్‌ గోల్ఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సైబర్‌ సెల్‌, నిఘా బృందాలు సైతం పని చేస్తున్నాయని చెప్పారు.

ఇదీ చదవండి: ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement