అభివృద్ధి చెందిన భారత్ కోసం.. యోగి ఆదిత్యనాథ్ సూచనలు | Every Vote Can Prove to Be Helpful Changing India Destiny Says Yogi Adityanath | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చెందిన భారత్ కోసం.. యోగి ఆదిత్యనాథ్ సూచనలు

Published Sat, Apr 6 2024 8:10 PM | Last Updated on Sat, Apr 6 2024 8:19 PM

Every Vote Can Prove to Be Helpful Changing India Destiny Says Yogi Adityanath - Sakshi

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ కల. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ దేశాన్ని మోదీ చేతికి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' అన్నారు. ప్రజల ప్రతి ఓటు చాలా ముఖ్యమైందని, దేశాభివృద్ధికి కీలకమని అన్నారు.

2014 నుంచే దేశాభివృద్ధికి పునాది పడిందని.. తప్పకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, అది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆదిత్యనాథ్ అన్నారు. కులం, మతం, బుజ్జగింపులు, ఇతర ఎజెండాలకు ఓటు వేయకూడదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం.. ఉజ్వల్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ఆదిత్యనాథ్ సూచించారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా 'ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్' అనే నినాదాన్ని ఆదిత్యనాథ్ హైలెట్ చేశారు. 400 సీట్లను సొంతం చేసుకోవడమే లక్ష్యమని, దీనికోసం అందరూ ఏకం కావాలని కోరారు. పోలింగ్ బూత్‌లో ఓటు వేయడం ద్వారా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement