Treat
-
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
కోమాలో నుంచి కోలుకున్నానని వెరై‘టీ’ విందు
సాక్షి, చిల్పూరు: కోమలోనుంచి కోలుకున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు వెరై‘టీ’ విందు ఇచ్చారు. 12 రోజులపాటు రోజుకు వంద మందికి ఇస్తానని ప్రకటించాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు భిక్షపతి ఉప్పరి పని మేస్త్రీ. జూలై 13న ఇంట్లో సజ్జపైనున్న వస్తువును తీస్తూ జారిపడ్డాడు. తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరు రోజుల తరువాత కోమానుంచి తేరుకున్నాడు. 51 రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయి అతను స్వగ్రామం చేరుకున్నాడు. ఇది తనకు పునర్జన్మని, దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు 12 రోజుల పాటు రోజుకు వందమందికి చాయ్ అందిస్తానని ప్రకటించాడు. గ్రామంలోని రవి హోటల్ వద్ద ఈ ‘టీ’ విందును సర్పంచ్ రూప్లానాయక్ చేతుల మీదుగా ప్రారంభించాడు. (క్లిక్: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి) -
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. యూపీ పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ వాట్సాప్‌కు ఈ సందేశం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డయల్ 112 హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు షాహిద్ అనే వ్యక్తి ఆ మెసేజ్‌ను పంపించినట్లు గుర్తించామన్నారు. బాంబు పెట్టి ముఖ్యమంత్రిని హత్య చేస్తానని సందేశంలో రాశాడని పోలీసులు తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయం స్టేషన్ కమాండర్ సుభాష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సైబర్ సెల్, నిఘా బృందాలు సైతం పని చేస్తున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే? -
కేన్సర్ చికిత్సకు కీటో డైట్ అండ!
ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రచారంలోకి వచ్చిన కీటో డైట్ కేన్సర్ చికిత్సకు మరింత బలం చేకూర్చగలదని అంటున్నారు కొలంబియా యూనివర్శిటీకి చెంది వెయిల్ కార్నెల్ మెడిసిన్ సంస్థ శాస్త్రవేత్తలు. మన శరీంలో ఇన్సులిన్ కారణంగా చైతన్యవంతమయ్యే ఫాస్పాడైలినోసిటోల్ –3 (పీఐ3కే) అనే ఎంజైమ్‌లో మార్పులు జరిగితే కేన్సర్లు వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే రసాయనాల ద్వారా కేన్సర్‌కు చెక్ పెట్టాలన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం అయితే ఈ మందుతో అంతగా ఫలితం లేకపోయింది. దీనికి కారణం ఏమిటని పరిశోధించినప్పుడు.. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం మందుపై దుష్ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. దీంతో తాము కీటోడైట్‌తో ఇన్సులిన్ మోతాదులను తక్కువ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నించామని.. ఆ పరిస్థితుల్లో పీఐ3కే ఉత్పత్తిని నిలిపివేసే మందులు మెరుగ్గా పనిచేశాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లూయిస్ సి కాంట్లీ తెలిపారు. పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే మందులు దాదాపు 20 వరకూ ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉన్నాయని, మందు వాడినప్పుడు కొందరిలో ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా పెరిగిపోయాయని వివరించారు. దీంతో వారికి ఆ మందు ఇవ్వడం నిలిపివేయాల్సి వస్తోందని, కీటోడైట్‌తో ఇన్సులిన్‌ను సమర్థంగా నియంత్రించగలిగితే ఈ మందుతో జరిపే కేన్సర్ చికిత్స మరింత ప్రభావశీలంగా ఉంటుందన్నది తమ అంచనా అని చెప్పారు. -
మెరుగైన కేన్సర్ చికిత్సకు సులువైన మార్గం!
కేన్సర్ చికిత్సలో ఓ చిత్రమైన చిక్కు ఉంది. మరీ ముఖ్యంగా కీమోథెరపీ విషయంలో. ఏ మందు ఎవరికి పనిచేస్తుందో కచ్చితంగా చెప్పడం కష్టం. మందు వాడాలి. పనిచేయకపోతే మళ్లీ కణితి నమూనా సేకరించి ఇంకో మందును ఉపయోగించాలి. ఇదీ ఇప్పటివరకూ జరుగుతున్న పద్ధతి. ఇకపై మాత్రం ఈ అవస్థల అవసరం ఉండదు. జర్మనీలోని హైడల్‌బర్గ్ యూనివర్సిటీ అధ్యాపకుడు, భారతీయ సంతతి శాస్త్రవేత్త ఉత్తరాల రమేశ్ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు అతితక్కువ కాలంలో బోలెడన్ని కీమోథెరపీ మందులను పరీక్షించవచ్చు. అతిసూక్ష్మమైన గొట్టాలతో తయారైన ఓ యంత్రంతో ఒకట్రెండు మందులు కలిపి, లేదా విడివిడిగా రాత్రికిరాత్రి పరీక్షించవచ్చు, అరచేతిలో ఇమిడిపోయే ఈ యంత్రం ఏకంగా వెయ్యి రకాల కాంబినేషన్లను పరిశీలించగలదు. దీనివల్ల పదేపదే బయాప్సీలు చేయాల్సిన అవసరం ఏర్పడదని.. రోగులకు సరిపడే మెరుగైన మందును ఎంచుకోవడం సాధ్యమవుతుందని రమేశ్ అంటున్నారు. రోగి శరీరం నుంచి సేకరించిన కణితి కణాలు అతితక్కువ సంఖ్యలో వాడుకుంటూ మందులు పరిశీలించవచ్చునని చెప్పారు. ఈ పరికరాన్ని తాము ఇప్పటికే నలుగురు కేన్సర్ రోగులపై పరీక్షించి మెరుగైన ఫలితాలు సాధించామని వివరించారు. -
కోడల్నీ కుటుంబ సభ్యురాలుగా చూడాలి..
కోడలికి కుటుంబంలో కనీస గౌరవం కూడ దక్కడం లేదని, కోడల్ని బయటి వ్యక్తిగాకాక, కూతురుగా చూసే సంప్రదాయం అలవరచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైవాహిక జీవితాల్లో వచ్చే గొడవల్లో కోడల్ని పరాయి మనిషిగా చూస్తున్నారని, ఆమెను ఓ అద్దెకు తెచ్చుకున్న సేవకురాలిగానే తప్పించి స్వంత మనిషిగా స్వీకరించలేకపోతున్నారని, ముఖ్యంగా భారత దేశంలో కోడళ్ళు అనేక సందర్భాల్లో తీవ్ర వేధింపులకు గురౌతున్నారని భారత ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. వివాహం తర్వాత అత్తవారింటికి వచ్చే కోడలు... ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి వ్యక్తి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అంతేకాక ఆమెను భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు, కోడలుగా కాక కూతురుగా చూడాలని సూచించింది. కోడలికి ఇచ్చే సమానత్వం, గౌరవం నాగరిక సమాజంలోని సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్త చేతిలో చిత్రహింసలకు గురై ఆత్మ హత్య చేసుకున్న భార్య కేసుకు తీర్పు ఇచ్చిన సందర్భంలో, భర్తకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు... అత్తవారింట్లో కోడల్ని చూడాల్సిన విధానానంపై ప్రకటన చేసింది. వరకట్నదాహం, దురాశతో మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడంతో ఒక్కోసారి వధువులు ప్రాణాలను సైతం తీసుకోవడం క్రూరత్వానికి నిదర్శనమని, ఇది అత్యంత సిగ్గు పడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నో కోరికలతో, కలలుగన్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన వధువులు అవమాన భారంతోనో, భరించలేని బాధలతోనో ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా అత్తింటి రాక్షసత్వానికి పరాకాష్ట అని అభిప్రాయపడింది. కొందరు బాధలను భరిస్తూ బానిసలుగా బతుకుతున్నారని అటువంటి పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తులు రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాల ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ప్రకటనను దేశవ్యాప్తంగా మహిళా సంఘాలే కాక, ప్రజలు సైతం స్వాగతించారు. -
లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో తొలిసారి అడుగుపెట్టాడు. అయితే టోక్యో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఆడేందుకు సానియా వెళ్లడంతో షోయబ్ కొంత నిరాశ పడినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే సానియా కెరీర్ గ్రాఫ్ ఊపందుకున్న తరుణంలో షోయబ్, ఆమె కుటుంబానికి ఇవేమి నిరాశ కలిగించే అంశంగా కనిపించడంలేదు. సానియా లేకున్నా ఆమె కుటుంబ సభ్యులు షోయబ్, పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్ జట్టుకు ఘనంగా ఆతిధ్యమిచ్చారు. సానియా నివాసంలో లాహోర్ లయన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తోపాటు ఇతర ఆటగాళ్లకు హైదరాబాదీ బిర్యానిని మీర్జా కుటుంబం రుచి చూపించారు. సానియా లేకున్నా పాక్ జట్టుకు ఘనంగా విందును ఏర్పాటు చేశారు. సానియా నివాసంలో జరిగిన విందు హాజరైన తన సహచర క్రికెటర్లకు ఏలోటు రాకుండా ఈ హైదరాబాదీ అల్లుడు షోయబ్ ఏర్పాట్లను చూసుకున్నారట.