లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ! | Shoaib Malik Treats Lahore Lions to Biryani at Sania Mirza's Place | Sakshi
Sakshi News home page

లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!

Sep 22 2014 11:22 AM | Updated on Sep 2 2017 1:48 PM

లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!

లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో తొలిసారి అడుగుపెట్టాడు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో తొలిసారి అడుగుపెట్టాడు. అయితే టోక్యో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఆడేందుకు సానియా వెళ్లడంతో షోయబ్ కొంత నిరాశ పడినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే సానియా కెరీర్ గ్రాఫ్ ఊపందుకున్న తరుణంలో షోయబ్, ఆమె కుటుంబానికి ఇవేమి నిరాశ కలిగించే అంశంగా కనిపించడంలేదు. సానియా లేకున్నా ఆమె కుటుంబ సభ్యులు షోయబ్, పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్ జట్టుకు ఘనంగా ఆతిధ్యమిచ్చారు. 
 
సానియా నివాసంలో లాహోర్ లయన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తోపాటు ఇతర ఆటగాళ్లకు హైదరాబాదీ బిర్యానిని మీర్జా కుటుంబం రుచి చూపించారు. సానియా లేకున్నా పాక్ జట్టుకు ఘనంగా విందును ఏర్పాటు చేశారు. సానియా నివాసంలో జరిగిన విందు హాజరైన తన సహచర క్రికెటర్లకు ఏలోటు రాకుండా ఈ హైదరాబాదీ అల్లుడు షోయబ్ ఏర్పాట్లను చూసుకున్నారట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement