hyderabadi biryani
-
తాజా సర్వే.. కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్
సాక్షి,హైదరాబాద్ : కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతిన్నది. తాజాగా, వెలుగులోకి వచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ చివరిగా నిలిచింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించింది. అందులో కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం అప్రతిష్టను మూటగట్టుకుంది. 62శాతం హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు ఎన్సీఆర్బీ నిర్వహించిన సర్వేలో తేలింది. -
హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరీ చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నెం–1 గా మ్యాంగో లస్సీ... ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ నిలిచింది. ఇది అనేకమందికి, నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్కు మూడో ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్‌లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్ బిర్యానీ ఆరు, షాహి పనీర్ ఏడు, చోలే భటూర్ ఎనిమిది, తందూరీ చికెన్ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి. -
హైదరాబాదీ బిర్యానీకి కమిన్స్ ఫిదా.. తొలిసారి ఇలా!
సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయ్యాడు. కమ్మని బిర్యానీ రుచితో కడుపు నిండిపోయిందని.. మరో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన పనిలేదంటూ చమత్కరించాడు.తన కుటుంబం తొలిసారి భారత్‌కు వచ్చిందని.. వారితో కలిసి హైదరాబాద్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. తమకు రుచికరమైన భోజనం అందించిన హోటల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.కుటుంబంతో కలిసి అక్కడ దిగిన ఫొటోలను కమిన్స్ ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ తమ సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, టీ20లలో నాయకుడిగా పెద్దగా అనుభవం లేని ఈ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌ను ఎంపిక చేసి రైజర్స్ రిస్క్ తీసుకుందని చాలా మంది భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కమిన్స్.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసి రికార్డులు సృష్టించింది. కెప్టెన్‌గా భేష్ అనిపిస్తున్న ఈ పేస్ బౌలర్.. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టాడు.కాగా గురువారం నాటి ఉప్పల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయింది. తదుపరి ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా కమిన్స్ బృందం తలపడనుంది.చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ -
ఆ టేస్టే వేరు!
నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ ప్యాలెస్‌లోని రాయల్ కిచెన్‌లో వందలాది మంది వంటగాళ్లు ఉండేవారు. వీరు దేశవిదేశాలకు చెందిన వంటలను వండి వడ్డించేవారు. ఫలక్‌నుమా, చౌమొహల్లా తదితర ప్యాలెస్‌లు ఎప్పుడూ విందులు వినోదాలతో సందడిగా ఉండేవి. ప్రపంచంలో ఎక్కడా లేని బిర్యానీ ఘుమఘుమలు నగరంలోనే ఉన్నాయి. నిజానికి కుతుబ్‌షాహీల కాలంలోనే బిర్యానీ సిటీకి పరిచయమైంది. సైనికులకు బలవర్థకం కోసం ఆహారంతో మాంసం కలిపి ఇచ్చేవారు. ఇదే కాలక్రమంలో బిర్యానీగా మారింది. సరికొత్త రుచులను సంతరించుకొని రూమీ బిర్యానీ, రా బిర్యానీ, దుల్హన్ బిర్యానీ, మహబూబీ బిర్యానీ, షెనా బిర్యానీ, ముర్గా బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ... ఇలా అనేక రుచులను ప్రపంచానికి పరిచయం చేసింది. బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, పాయా షోర్వా, రోటీ... ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదీ రుచులెన్నో వాటి ఘనతలన్నీ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఇలాంటి వంటకాలెన్నో మన సొంతం. సంస్కృతీ సంప్రదాయాలను సమున్నతంగా ఆవిష్కరించే భాగ్యనగరం రుచులకు పెద్ద పీట వేసింది. కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల పాలనతో వెరైటీ వంటకాలకు అడ్డాగా మారింది. బిర్యానీ పర్షియన్ వంటకమే అయినప్పటికీ నగరమే ప్రపంచానికి దాని రుచిని చూపించింది. హలీమ్‌తో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది.ఓవైపు సంప్రదాయ వంటకాలవైభవాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఆధునిక రుచులను అందిపుచ్చుకుంది. అందుకే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు మన సిటీ ఇటీవల అర్హత సాధించింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో ఈ గుర్తింపు లభించింది. సాక్షి, సిటీబ్యూరో: వైవిధ్య భరితమైన సాంస్కృతిక నగరం హైదరాబాద్. వందల ఏళ్ల మహోన్నతమైన చారిత్రక, వారసత్వ పరిమళాలు ఇప్పటికీ గుబాళిస్తూనే ఉంటాయి. విభిన్న సాంస్కృతిక సమూహాలు, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు హైదరాబాద్ సాంస్కృతిక వైభవానికి వన్నెలద్దాయి. పర్షియా నుంచి వచ్చిన కుతుబ్‌షాహీలు హైదరాబాద్ ప్రజలతో మమేకమయ్యారు. తెలుగు, పర్షియన్, ఉర్దూ భాషల మేళవింపుతో అద్భుతమైన దక్కనీ ఉర్దూ వాడకంలోకి వచ్చింది. ‘ఆదాబ్’, ‘తస్లీమ్’, ‘ఖుదా–హఫీజ్’ వంటి మర్యాదపూర్వకమైన పలకరింపులు ఈ నేల సొంతం. భాషలకు అతీతమైన భావసమైక్యత కూడా హైదరాబాద్ సొంతమే. ఆసఫ్ జాహీల పాలనలో ఈ సాంస్కృతిక వైవిధ్యం మరింత పరిమళభరితమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన ఆహారపదార్థాలు, వెరైటీ రుచులు కూడా హైదరాబాద్ ప్రత్యేకమే. పర్షియన్ వంటకమే అయినా ప్రపంచానికి బిర్యానీ రుచిని చూపించింది హైదరాబాదే. లండన్ వంటి నగరాల్లో ‘హైదరాబాద్ బిర్యానీ ’ రెస్టారెంట్లు వెలిశాయి. ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్, లుక్మీ వంటి స్నాక్స్ భాగ్యనగరం ప్రత్యేకం. వందల ఏళ్లుగా విభిన్న రుచులను ఒక వారసత్వ సంపదగా ప్రపంచానికి పరిచయం చేసిన హైదరాబాద్ నగరం ఈ ఏడాది యునెస్కో ప్రపంచంలోని 66 క్రియేటివ్ సిటీస్ జాబితాలో సమున్నతంగా చేరింది. రుమాలీ రోటీ చార్ రుమాలీ ... ఏక్ తలాహువ (వేయించిన మాంసం) లావో.. అని యువకులు ఎక్కువగా ఆర్డర్ ఇస్తారు. రాత్రి వేళ డిన్నర్లో దీన్ని ఎక్కువగా తింటారు. మైందా పిండితో తయారు చేసిన ఈ రొట్టె పరిమాణంలో రుమాల్ అంత ఉంటుంది. కాగితం కంటే కూడా పల్చగా ఉంటుంది. మైదాతో పాటు కోడిగుడ్లు, పాలు, వెన్నతో రొట్టెను తయార చేస్తారు. వీటిని నిప్పుల పెనంపైన కాల్చుతారు. ఒక్కోటి రూ. 10 ఉంటుంది. బిరియానీఘుమఘుమలు.... నవాబులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. మహబూబ్ అలీఖాన్ ప్యాలెస్‌లోని రాయల్ కిచెన్‌లో వందలాది మంది వంటవాళ్లు పని చేసేవారు. దేశవిదేశాలకు చెందిన అద్భుతమైన వంటలను వండి వడ్డించేవారు. ఫలక్‌నుమా, చౌమొహల్లా వంటి ప్యాలెస్‌లు నిత్యం విందులు, వినోదాలతో సందడిగా ఉండేవి. ప్రపంచంలో ఎక్కడా లేని బిర్యానీ ఘుమఘుమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. నిజానికి కుతుబ్‌షాహీల కాలంలోనే బిర్యానీ వంటకం నగరానికి పరిచయమైంది. సైనికులకు బలవర్ధకమైన ఆహారం కోసం అన్నంతో పాటు మాంసం కలిపి అందజేసిన ఆహారం (పర్షియన్ సాంప్రదాయ వంటకం) కాలక్రమంలో బిర్యానీ అయింది. సరికొత్త రుచులను సంతరించుకుంది. రూమీ బిర్యానీ, రా బిర్యానీ, దుల్హన్ బిర్యానీ, మహబూబీ బిర్యానీ, షెనా బిర్యానీ, ముర్గా బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ వంటి అనేక రకాల బిర్యానీలను హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం చేసింది. మహబూబ్ అలీ ప్యాలెస్‌లో కనీసం 650 రకాల ఆహారపదార్థాలను తయారు చేసేవారు. ఆయన మంచి భోజనప్రియుడు. దేశవిదేశాలకు చెందిన అతిథులు ప్రతి నిత్యం ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. ఒక్క బిర్యానీలే కాకుండా ఖబూలీ, కిచిడీ చిరోంజీ, కిచిడి మాంగ్, ఆసఫియా దూపియాజా, దూపియాజా ఆస్మాన్జాహీ,భూనా గోష్, గుర్దా సీనా మొగులాయి,లివర్ కర్రీ, గోట్ టంగ్, గ్రీన్ చిల్లీస్ దోపియాజా, కోఫ్త, పొటాటో కుర్మ, శేమానీ కుర్మా, అచరీ గోష్, చికెన్ మొగులాయి, ఫిష్ కోఫ్త వంటి అనేక రకాల అద్భుతమైన మాంసాహార వంటలు చేసేవారు. కబాబ్స్ అనే వంటకం,పులావ్ లక్నో నుంచి వచ్చాయి. కుర్మ, బేషనీ, రోటీ మొగలులు పరిచయం చేసినవే. కిచిడి, తందూర్ పార్శీలు పరిచయం చేసిన ఆహారం. ఉస్మాన్ అలీఖాన్ సైతం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. రొట్టెలు .. లొట్టలేసుకుంటూ తినాల్సిందే నగరాన్ని పాలించిన నవాబుల ఆహారపు అలవాట్లు ఇక్కడి జీవనశైలిలో భాగమయ్యాయి. వందల ఏళ్ల క్రితమే రకరకాల రోటీలు ప్రజల ఆహారమయ్యాయి. ఇప్పటికీ పాతబస్తీవాసులకు రోటీతోనే దినచర్య మొదలవుతుంది. వందలాది కుటుంబాలు అనేక తరాలుగా రోటీలను తయారు చేసి ప్రజలకు అందజేస్తున్నాయి. తమ పూర్వీకుల నుంచి మొదలైన రోటీ తయారీని ఒక వారసత్వ వృత్తిగా కొనసాగిస్తున్నాయి. పాతబస్తీ కేంద్రంగా తయారయ్యే అనేక రకాల రోటీలు పోషకాల ఖజానాలు. ఒక్క పురానీహవేలీలోనే 30కు పైగా రోటీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. నాన్, షీర్మాల్, కుల్చా, తందూరీ, రుమాలీ, వర్ఖీ రోటి, పరాట,పుల్క రోటీలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాలకు ఈ రోటీలు ఎగుమతి అవుతున్నాయి. వాహ్.. హలీమ్... పసందైన రుచిని, చక్కటి ఆరోగ్యాన్ని, అద్భుతమైన శక్తిసామర్థ్యాలను అందజేసే హలీంకు అందరూ సలాం అంటూ వాలిపోతారు. ఒకప్పుడు ముస్లిం వంటకంగా మొదలైన హలీం ఇప్పుడు మతాలకతీతంగా, అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే ఆహార పదార్థంగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీలాగే నగర ప్రజల ఫేవరేట్ డిష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. భౌగోళిక సూచీ (జియోగ్రాఫికల్ ఇండెక్స్) గుర్తింపును కూడా దక్కించుకుంది. ఏటా రూ.700 కోట్లకు పైగా అమ్మకాలతో దేశవిదేశాలకు చెందిన ఆహార ప్రియుల మనస్సు దోచుకుంటోంది మన ‘హైదరాబాద్ హలీం. ఆరో నిజాం హయాంలోనే పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించిన వంటకాలలో ఓ ప్రత్యేక వంటకం గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్‌ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అలా పర్షియాతో పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. అక్కడి వంటకాల కంటే అద్భుతమైన రుచిని సంతరించుకుంది. ఇరాన్, ఇరాక్,తదితర దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరువాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వచ్చి చేరాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. ఇప్పుడు దేశవిదేశాల్లోనే హైదరాబాద్ హలీం పేరు వింటే చాలు లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, అమెరికా, బ్రిటన్లలో ఎంతో డిమాండ్ ఉన్న వంటకం హైదరాబాద్ హలీం. నోరూరించే పాయా షోర్వా... చలికాలంలో చక్కటి ఆహారం పాయా షోర్వా. దాంతో పాటు జబాన్ (నాలుక), జబడా ( తలకాయకూర ) కూడా నోరూరిస్తాయి. వణికించే చలిలో ఉదయం, సాయంత్రం పాయా షోర్వా తాగేస్తే ఆ మజాయే వేరు. శరీరంలో వేడినిచ్చే వంటకం ఇది. పాయాతో పాటు, మరగ్ (మటన్ సూప్)లను ఔషధ దినుసులు, మసాలాలతో తయారు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు , నాలుక, తలకాయ ఇందుకోసం వినియోగిస్తారు. కుతుబ్ షాహీలు, ఆసీఫ్ జాహీల కాలంలో కూడా శుభకార్యాలు, ప్రభుత్వ వేడుకలు జరిగినప్పుడు పాయా, మరగ్‌లను వడ్డించే వారు. అ రోజుల్లో కేవలం వేడుకల్లో తయారు చేసే వంటకం ఇప్పుడు అన్ని సీజన్లలో లభిస్తుంది. కానీ చలికాలంలో దీని వినియోగం ఎక్కువ. పాయా షోర్వాలాగే నహారీ (మేకకాళ్లతో ) షోర్వా కూడా వందల ఏళ్లుగా హైదరాబాద్ వంటకమైంది. రోటీతో పాటు దీన్ని నంజుకొని తింటారు.ఉదయం తింటే సాయంత్రం వరకు ఆకలి వేయదు. ఇందులో పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయి. చక్కటి బలవర్ధకమైన ఆహారం. నిజాం నవాబుల కాలంలో పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో ఉన్న హోటళ్లతోపాటు ఖిల్వత్, షేయరాన్ తదిర ప్రాంతాల్లో నహరీ షోర్వా హోటళ్లు వెలిసాయి. హోటల్లలో నహారీ షోర్వాతో పాటు కుల్చా రోటీ కూడా అందుబాటులోకి తెచ్చారు. వర్ఖీ పరాటా... మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీలతో కలిపి వర్ఖీ పరాటా తింటే ఆ రుచియే వేరు.పాలు, మైదాపిండి, గుడ్డు, పెరుగు. ఉప్పుల మిశ్రమాన్ని పెద్దసైజులో రొట్టెలాగా తÐయారు చేసి దీన్ని నెయ్యిలో వేయిస్తారు. ఎక్కువగా దీన్ని మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తింటారు. పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో ఎంతో మంది దీన్ని తినడానికి పాతబస్తీకి వస్తుంటారు. ఇది కేవలం పాలబస్తీలోనే లభిస్తుంది. దీని ధర రూ. 15 ఉంటుంది. తందూర్కీ రోటీ.. పాతబస్తీలో ఏ హోటల్‌కు వెళ్లినా ‘‘ ఏక్ తందూరీ మటన్ మసాలా లావో’’ అనే మాటలు యథాలాపంగా వినిపిస్తాయి. మైదాపిండి, పాలు, మొక్కజొన్న పిండి మిశ్రమంతో తందూరీ రొట్టె తయారు చేస్తారు. ఎక్కువ శాతం మధ్యాహ్న భోజనంలో తందూరీని మటన్, చికెన్‌తో లాగిస్తారు. ఒక్కోటి రూ. 12 ఉంది. ఇది కూడా మొగలాయి వంటకమే. నాన్‌రోటీ.. మైదాపిండి, గోధుమ పిండి, పెరుగు, పాలు మిశ్రామాన్ని నాలుగు పలకలగా తయారుచేసి 8 గంటల పాటు ఆరబెడుతారు. ఆ తరువాత ప్రత్యేకమైన బట్టీల్లో వేడిచేస్తారు. ఈ రోటీలకు నెయ్యిరాసుకొని తింటే రుచికరంగా ఉంటాయి. ఉదయాన్నే గొర్రె, మేక ఎముకలతో తయారు చేసిన నహారీ (సూప్)తో రోటీ నంజుకొని తినడం ఒక చారిత్రక ఆహారపు అలవాటు. మధ్యాహ్నం నాన్ రోటీలను కబాబ్‌లతో తింటే ఆ మాజాయే వేరు. ఒక్కోటి రూ.15 ఉంటుంది. నాన్ రోటీ లేకుండా ఎలాంటి శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. పెళ్లిళ్లలో నాన్, చికెన్‌ఫ్రై తప్పకుండా ఉండాల్సిందే. రోజుకు వెయ్యికి పైగా నాన్లు విక్రయిస్తున్నట్లు 166 ఏళ్ల పురాతన నాన్ దుకాణ యజమానీ ఖాజీ అబ్దుల్ హమీద్ చెప్పారు. ఈ నాన్ రోటీల్లోనూ గుండ్రంగా ఉంటే షీర్మాల్ అనీ, చిన్న పరిమాణంలో ఉంటే కుల్చా అనీ అంటారు. -
హైదరాబాద్ బిర్యానీకి ‘జీఐ’ నిరాకరణ
హైదరాబాద్: హైదరాబాద్ అంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది బిర్యానీనే. నిజాం నవాబుల కాలంలో తొలిసారి తయారైన ఈ వంటకానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంత ప్రశస్తిగాంచిన ఈ వంటకం భౌగోళిక సూచీ (జీఐ–జియోగ్రాఫికల్ ఇండికేషన్ )ను సాధించడంలో మాత్రం విఫలమైంది. బిర్యానీకి సంబంధించిన చారిత్రక ఆధారాలను, భౌగోళిక సూచీ సాధించడానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో దరఖాస్తుదారుడు విఫలమయ్యాడనీ, అందువ్లల జీఐ ఇవ్వలేమని చెన్నైలోని భౌగోళిక సూచీ నమోదు కేంద్రం తాజాగా తెలిపింది. 2009లో ‘దక్కనీ బిర్యానీ మేకర్స్ అసోసియేషన్ ’ అనే సంస్థ బిర్యానీకి భౌగోళిక సూచీ కోసం దరఖాస్తు చేసింది. -
హైదరాబాదీ బిర్యానీ.. ఫెయిలైంది!
మన హైదరాబాదీ బిర్యానీ అంటే చాలు.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాలకు చెందినవాళ్లు, సినీ తారలు, క్రికెటర్లు, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లయినా సరే హైదరాబాద్ వచ్చారంటే చాలు.. ఇక్కడి బిర్యానీ తినకుండా వెళ్లలేని పరిస్థితి. కానీ ఇంతటి ఫేమస్ బిర్యానీ ఒక్క విషయంలో మాత్రం ఫెయిలైంది. తొలిసారిగా నిజాం నవాబులు హైదరాబాద్‌కు పరిచయం చేసిన ఈ బిర్యానీ.. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ సంపాదించలేకపోయింది. ఈ ట్యాగ్ కోసం హైదరాబాద్‌లోని అసోసియేషన్ ఆఫ్ బిర్యానీ మేకర్స్ వాళ్లు దరఖాస్తు చేశారు. తమకు 'హైదరాబాదీ బిర్యానీ' అనే ట్యాగ్ కావాలన్నారు. కానీ.. దాని మూలాలను నిరూపించే చారిత్రక సమాచారాన్ని అందించడంలో మాత్రం వాళ్లు విఫలమయ్యారు. దాంతో మన బిర్యానీకి జీఐ ట్యాగ్ రాలేదు. ఏవైనా ఉత్పత్తులు ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయనుకుంటే వాటికి జీఐ ట్యాగ్ ఇస్తారు. అప్పుడు ఆ పేరును ట్యాగ్ పొందినవాళ్లు తప్ప వేరే ఎవ్వరూ వాడుకోడానికి వీలుండదు. హైదరాబాదీ బిర్యానీకి జీఐ ట్యాగ్ కావాలని మనవాళ్లు 2009 ఏప్రిల్‌లోనే దరఖాస్తు చేశారు. దాంతో.. తమ నిబంధనల మేరకు తగిన పత్రాలు అందించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. హైదరాబాదీ బిర్యానీకి సంబంధించిన చారిత్రక ఆధారాలు (గెజిట్ పబ్లికేషన్ల లాంటివి) సమర్పించాలని తెలిపింది. కానీ.. అలాంటివాటిని చూపించలేకపోయారు. 2010 ఆగస్టు నెలలో మరోసారి ఈ అంశం మీద చర్చ జరిగింది. అప్పుడు కూడా డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ బిర్యానీ తయారీదారుల సంఘం వాళ్ల నుంచి సమాధానం ఏమీ రాకపోవడంతో 2013 జూలైలో మరోసారి లేఖ రాశారు. దరఖాస్తులో ఉన్న లోటుపాట్లను సవరించాల్సిందిగా చెప్పారు. అయినా సమాధానం ఏమీ రాకపోవడంతో.. తమ సూచనలు పాటించడం లేదంటూ 2016 మే నెలలో ఇంకోసారి గట్టిగా చెప్పారు. ఈసారి కూడా సమాధానం ఏమీ రాకపోవడంతో ఈ సంవత్సరం జనవరి 23న చిట్టచివరిసారిగా షోకాజ్ నోటీసు జారీచేశారు. అప్పుడు కూడా సంఘం మౌనంగానే ఉండిపోయింది. దాంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పేశారు. దాంతో ఇక మన హైదరాబాదీ బిర్యానీకి జీఐ ట్యాగ్ రావడం కలలో కూడా జరగదని తేలిపోయింది. -
సింధు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయ్!
రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది పీవీ సింధు. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ గా మారిపోయింది. ఆమెకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా మారుమోగనున్నాయి. కానీ ఆమె అందరిలాంటి సిటీ అమ్మాయే. బాలీవుడ్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం. అలాగే ఐస్ క్రీమ్ అన్నా, హైదరాబాదీ బిర్యానీ అన్నా మక్కువ. అందుకే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం సినిమాలు, బిర్యానీ ఎదురుచూస్తున్నాయి. 'రుస్తుం', 'మహెంజోదారో' వంటి కొత్త హిందీ సినిమాల గురించి సింధు నన్ను చాలాసార్లు అడిగింది. తను ఇక్కడి వచ్చాక ఐస్ క్రీమ్, బిర్యానీ తినాలనుకుంటోంది' అని సింధు తండ్రి పీవీ రమణ 'ఇండియా టుడే'కు తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో బయట వండిన ఆహారం సింధు తినకుండా తాము చర్యలు తీసుకున్నామని, ఆమె కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. -
హైదరాబాద్ రండి.. మా బిర్యానీ పెడతాం: కేసీఆర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు అందరూ హైదరాబాద్ రావాలని.. వస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ బిర్యానీ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తమకు పొరుగు రాష్ట్రాలన్నింటితో సత్సంబంధాలు కావాలని, ఏ రాష్ట్రంతోనూ కొట్లాడబోమని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. అన్నింటితోనూ మంచి సంబంధాలే కోరుకుంటున్నట్లు చెప్పారు. గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో ఎంఓయూ మీద సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ప్రధానంగా నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు చెప్పామని గుర్తుచేశారు. అలా నీళ్లు ఇవ్వడంలో ఇప్పుడు పడినది పెద్ద ముందడుగని అన్నారు. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని, మనం మనం గొడవపడితే ప్రయోజనం ఉండదని, కొన్ని నీళ్లు మహారాష్ట్ర వాడుకుంటే కొంత మనం వాడుకుందామని ఏపీ ముఖ్యమంత్రికి కూడా చెప్పానని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ఐదు బ్యారేజీలు కడతారని, నీళ్ల పంపిణీ విషయంలో ఇది మంచి ముందడుగు అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణకు కూడా దీనివల్ల మేలు కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. -
హైదరాబాదీలతో బిర్యానీ గురించే...
♦ సచిన్ సరదా కబుర్లు ♦ నగరంలో మాస్టర్ సందడి సాక్షి, హైదరాబాద్ : మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు నగరంతో ఎంతో అనుబంధం ఉంది. తన కెరీర్లో పలు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇక్కడ ఆడిన సచిన్‌కు... వ్యక్తిగతంగా కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో దానిని అతను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘ఒకసారి అంబటి రాయుడుతో నేను 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడాను. ఆ తర్వాత సహచరుడు ఒకరు ఇంత సేపు క్రికెట్ గురించి మాట్లాడి ఉండకపోవచ్చని అన్నాడు. అతను అన్నది నిజమే. నేను అంతసేపు హైదరాబాదీ బిర్యానీ గురించి, దాని విశేషాల గురించే మాట్లాడాను. ఇది రాయుడు ఒక్కడితోనేకాదు. ఓజాతో కూడా ఈ విషయంపై తరచూ చర్చిస్తూనే ఉంటా. ఎప్పటికైనా హైదరాబాదీ బిర్యానీ ప్రత్యేకమే. అన్నట్లు నేను ఎప్పుడు నగరానికి వచ్చినా ప్రియమిత్రుడు లక్ష్మణ్ నా కోసం బిర్యానీ సిద్ధం చేయిస్తాడు‘ అని సచిన్ చెప్పాడు. కొన్నాళ్ల క్రితం తాజ్ ఫలక్నుమాను కుటుంబసమేతంగా సందర్శించిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. ఆ కట్టడం నిర్మాణ శైలి, గొప్పతనం తనను ఆకట్టుకున్నాయన్నాడు. సచిన్ స్మాష్: హైదరాబాద్‌లో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన గేమింగ్ జోన్ స్మాష్‌ను సచిన్ సందర్శించాడు. దేశంలో ముంబై, ఢిల్లీల తర్వాత మూడోది ఇక్కడ ఏర్పాటైంది. శ్రీపాల్ మొరాఖియా అనే వ్యాపారవేత్తకు చెందిన ఈ స్మాష్ కంపెనీకి సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వాస్తవంలో లేకున్నా ఉన్నట్లుగా భ్రమింపజేసే అనేక వర్చువల్ గేమ్‌లు ఇక్కడే ఆడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన పిల్లలతో కలిసి ఇలాంటి గేమ్‌లు తరచూ ఆడుతుంటానని, ఈ సమయంలో తాము స్నేహితుల్లా వ్యవహరిస్తామన్నాడు. ఈ గేమ్ జోన్లో భాగంగా ఉన్న క్రికెట్లో మనకు నేరుగా మలింగ, మెక్గ్రాత్లాంటి బౌలర్లు బౌలింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. సచిన్ బౌలింగ్ చేసినప్పుడు కూడా చాలా వేగంగా బంతి వస్తుంది. దీనిపై మాస్టర్ మాట్లాడుతూ... ‘నేనూ 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలని ఒకప్పుడు కలగనేవాన్ని. స్మాష్ బౌలింగ్ మెషీన్ దానిని నిజం చేసింది’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. -
బిర్యానీకి గట్టిపోటీ ఇస్తున్న హాలీమ్
-
పార్లమెంటు క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ!
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదీ బిర్యానీ ఇకపై పార్లమెంటు క్యాంటీన్లో భోజనప్రియులకు ఆహ్వానం పలకనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే క్యాంటీన్లో బిర్యానీని అందుబాటులోకి తీసుకువస్తామని పార్లమెంటు ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఏపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బిర్యానీతో పాటు మిర్చ్ కా సాలన్, షాహీ తుక్డా, కుబానీ కా మీఠాలను సైతం క్యాంటీన్లలో వడ్డించనున్నారు. ఎంపీ లాడ్స్ నిధులను రూ. 50 కోట్లకు పెంచాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. -
లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో తొలిసారి అడుగుపెట్టాడు. అయితే టోక్యో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఆడేందుకు సానియా వెళ్లడంతో షోయబ్ కొంత నిరాశ పడినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే సానియా కెరీర్ గ్రాఫ్ ఊపందుకున్న తరుణంలో షోయబ్, ఆమె కుటుంబానికి ఇవేమి నిరాశ కలిగించే అంశంగా కనిపించడంలేదు. సానియా లేకున్నా ఆమె కుటుంబ సభ్యులు షోయబ్, పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్ జట్టుకు ఘనంగా ఆతిధ్యమిచ్చారు. సానియా నివాసంలో లాహోర్ లయన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తోపాటు ఇతర ఆటగాళ్లకు హైదరాబాదీ బిర్యానిని మీర్జా కుటుంబం రుచి చూపించారు. సానియా లేకున్నా పాక్ జట్టుకు ఘనంగా విందును ఏర్పాటు చేశారు. సానియా నివాసంలో జరిగిన విందు హాజరైన తన సహచర క్రికెటర్లకు ఏలోటు రాకుండా ఈ హైదరాబాదీ అల్లుడు షోయబ్ ఏర్పాట్లను చూసుకున్నారట. -
బిర్యాని కోసం హోటల్ మారిన ధోని
హైదరాబాద్: సెలబ్రిటీస్‌కు కోపం వచ్చిన సంతోషం వచ్చిన పట్టలేమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో మరోసారి రుజువైంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూడా అయిన ధోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు హైదరాబాద్ వచ్చి గ్రాండ్ కాకతీయ హోటల్లో విడిది చేసిన ధోనికి హైదరాబాద్ బిర్యానితో అతిథ్యం ఇప్పించాలని కోరిక కలిగింది. అదే విషయాన్ని ధోనికి తెలిపారు. అందుకు ధోని సానుకూలంగా స్పందించాడు. దాంతో అంబటి రాయుడు ఇంటి నుంచి తయారు చేయించిన బిర్యాని తీసుకుని హోటల్ కు వచ్చాడు. అయితే బయట ఆహారాన్ని అనుమతించమంటూ హోటల్ సిబ్బంది అంబటిరాయుడుకి బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదే విషయాన్ని అంబటి రాయుడు... ధోనికి తెలిపాడు. ధోని ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దీంతో అప్పటికప్పుడు హోటల్ మారుతున్నట్లు ధోని ప్రకటించి... తాజ్ కృష్ణాకు పయనమైయ్యాడు. ధోనిని బీసీసీఐ అధికారులు అనుసరించారు. -
బిర్యాని కోసం హోటల్ మారిన ధోని
-
ఇక రైళ్లలోనూ హైదరాబాదీ బిర్యానీ
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో ప్రకటించినట్లుగా ముందుగానే వండి తినేందుకు సిద్ధంగా ఉండే ఆహారాన్ని రైళ్లలో సరఫరా చేసేందుకు ఐటీసీ, ఎంటీఆర్, హల్దీరామ్ వంటి అగ్రశ్రేణి క్యాటరింగ్ సంస్థలను రంగంలోకి దించినట్లు రైల్వే అధికారి ఒకరు వివరించారు. చికెన్ చెట్టినాడ్, హైదరాబాదీ బిర్యానీ, సాంబార్ అన్నం, రాజ్మా చావల్ తదితర వంటకాలను రాజధాని, దురంతో, శతాబ్ది సహా ఆరు రైళ్లలో వారంపాటు ప్రయోగాత్మకంగా అందిస్తామన్నారు. ప్యాకింగ్ చేసి ఉండే ఈ వంటకాలను వడ్డించేందుకు ముందుగా మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేస్తే సరిపోతుందన్నారు. ఈ విధానంపై ప్రయాణికుల నుంచీ వచ్చే స్పందననుబట్టి ఇతర రైళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.