హైదరాబాద్ బిర్యానీకి ‘జీఐ’ నిరాకరణ
హైదరాబాద్: హైదరాబాద్ అంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది బిర్యానీనే. నిజాం నవాబుల కాలంలో తొలిసారి తయారైన ఈ వంటకానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంత ప్రశస్తిగాంచిన ఈ వంటకం భౌగోళిక సూచీ (జీఐ–జియోగ్రాఫికల్ ఇండికేషన్ )ను సాధించడంలో మాత్రం విఫలమైంది.
బిర్యానీకి సంబంధించిన చారిత్రక ఆధారాలను, భౌగోళిక సూచీ సాధించడానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో దరఖాస్తుదారుడు విఫలమయ్యాడనీ, అందువ్లల జీఐ ఇవ్వలేమని చెన్నైలోని భౌగోళిక సూచీ నమోదు కేంద్రం తాజాగా తెలిపింది. 2009లో ‘దక్కనీ బిర్యానీ మేకర్స్ అసోసియేషన్ ’ అనే సంస్థ బిర్యానీకి భౌగోళిక సూచీ కోసం దరఖాస్తు చేసింది.