పార్లమెంటు క్యాంటీన్‌లో హైదరాబాద్ బిర్యానీ! | Hyderabad biryani in Parliament canteen! | Sakshi
Sakshi News home page

పార్లమెంటు క్యాంటీన్‌లో హైదరాబాద్ బిర్యానీ!

Published Wed, Sep 24 2014 9:05 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

పార్లమెంటు క్యాంటీన్‌లో హైదరాబాద్ బిర్యానీ! - Sakshi

పార్లమెంటు క్యాంటీన్‌లో హైదరాబాద్ బిర్యానీ!

 న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదీ బిర్యానీ ఇకపై పార్లమెంటు క్యాంటీన్‌లో భోజనప్రియులకు ఆహ్వానం పలకనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే క్యాంటీన్‌లో బిర్యానీని అందుబాటులోకి తీసుకువస్తామని పార్లమెంటు ఫుడ్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఏపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

బిర్యానీతో పాటు మిర్చ్ కా సాలన్, షాహీ తుక్‌డా, కుబానీ కా మీఠాలను సైతం క్యాంటీన్లలో వడ్డించనున్నారు. ఎంపీ లాడ్స్ నిధులను రూ. 50 కోట్లకు పెంచాలని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement