Parliament canteen
-
పార్లమెంట్లో హైదరాబాద్ బిర్యానీ ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: రాయితీలు ఎత్తివేయడంతో పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి. రాయితీ ఎత్తేసిన తర్వాత కొత్త ధరలతో మెనూను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ మేరకు క్యాంటీన్ కూడా సిద్ధమైంది. అయితే రాయితీ ఎత్తివేయగా ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అందరి ఫేవరేట్‌గా ఉండే హైదరాబాద్ బిర్యానీ ఎంత అనే ప్రశ్న వస్తోంది. ఈ క్యాంటీన్లో ప్రస్తుతం రూ.150కి హైదరాబాద్ మటన్ బిర్యానీ లభిస్తోంది. ఈ బిర్యానీ రాయితీతో రూ.65కే వచ్చేది. ఇక నాన్ వెజ్ బఫే కొత్త ధర రూ.700 ఉంది. మెనూలో అత్యధిక ధర ఉన్నది ఈ పదార్థానికే. అతి తక్కువ ధర అంటే చపాతీనే. ఒక చపాతీ రూ.3కు అందుబాటులో ఉంది. కొత్త ధరల ప్రకారం శాకాహార భోజనానికి రూ.100. ఉడకబెట్టిన కూరగాయలు గతంలో రూ.12 ఉండగా ఇప్పుడు రూ.50కి పెరిగింది. అయితే రాయితీలను ఎత్తివేయడంతో లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఏడాదికి దాదాపు రూ.8 కోట్లు ఆదా అవుతోంది. ఈ క్యాంటీన్లో మొత్తం 58 ఆహార పదార్థాలు ఉన్నాయి. -
పార్లమెంట్ క్యాంటీన్లో మోదీ భోజనం.. బిల్లు రూ. 29
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ క్యాంటీన్లో సందడి చేశారు. పార్లమెంట్ భవనంలో 70వ నెంబర్ గదిలోని క్యాంటీన్‌కు సోమవారం వచ్చారు. క్యాంటీన్లో మోదీ ఎంపీలతో కలసి భోజనం చేశారు. మోదీ భోజనం చేయడానికి పార్లమెంట్ క్యాంటీన్‌కు రావడంతో అక్కడున్న ఎంపీలు ఆశ్చర్యపోయారు. మోదీ ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేశారు. మోదీ శాఖహారం తీసుకుని, దాని బిల్లు 29 రూపాయలు చెల్లించారు. అనంతరం మోదీ క్యాంటీన్లోని రిజిస్టర్లో అన్నదాత ధన్యవాదాలంటూ రాశారు. -
పార్లమెంటు క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ!
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదీ బిర్యానీ ఇకపై పార్లమెంటు క్యాంటీన్లో భోజనప్రియులకు ఆహ్వానం పలకనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే క్యాంటీన్లో బిర్యానీని అందుబాటులోకి తీసుకువస్తామని పార్లమెంటు ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఏపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బిర్యానీతో పాటు మిర్చ్ కా సాలన్, షాహీ తుక్డా, కుబానీ కా మీఠాలను సైతం క్యాంటీన్లలో వడ్డించనున్నారు. ఎంపీ లాడ్స్ నిధులను రూ. 50 కోట్లకు పెంచాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. -
‘పార్లమెంటు క్యాంటీన్ తిండితో ఎంపీలకు అనారోగ్యం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ క్యాంటీన్ అందించే అహారం నాసిరకంగా ఉందని పలువురు ఎంపీలు బుధవారం రాజ్యసభలో ఫిర్యాదు చేశారు. ఈ తిండి తిని ఎంపీలు అనార్యోగం బారిన పడుతున్నారని జేడీయూ ఎంపీ కేసీ త్యాగి తెలిపారు. ఎస్పీ సభ్యులు రామ్‌గోపాల్ యాదవ్, జయాబచ్చన్‌లు అస్వస్థతకు గురయ్యారన్నారు. ‘సభ్యుల నోళ్లు మూయించేందుకు పకడ్బందీగా కుట్ర పన్నారు’ అని చెణుకు విసిరారు. క్యాంటీన్‌కు ఆహారాన్ని గుజరాత్ నుంచి తెప్పిస్తున్నారని విపక్ష సభ్యులు అన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య స్పందిస్తూ.. ‘కొందరు గుజరాత్ గురించి కలకంటూనే ఉన్నారు. నేనేం చేయగలను?’ అని అన్నారు. క్యాంటీన్లో ఉదయం 6 గంటలకు వండిన ఆహారాన్ని రాత్రివరకు పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా చెప్పారు.