లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపుతామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపంది. యూపీ పోలీస్ ప్రధాన కార్యాలయం వాట్సాప్ నెంబర్‌కు అభ్యంతరకర పదజాలంతో ఈ మెసేజ్ వచ్చింది. ఓ వర్గానికి యూపీ సీఎం ముప్పుగా పరిణమించారని అంటూ బాంబు దాడితో యోగి ఆదిత్యానాథ్‌ను మట్టుబెడతామని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గురువారం అర్ధరాత్రి ఈ మెసేజ్ రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారుదీనిపై లక్నోలోని గోమతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మెసేజ్ పంపిన మొబైల్ నెంబర్ కాల్ డిటైల్స్‌ను పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment