లక్నో : పశ్చిమ బెంగాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీకి ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని యూపీ సీఎం కార్యాలయం పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ దినాజ్‌పూర్‌లో ఆదివారం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు సైతం మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఇది ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్టకు సంకేతమని యూపీ సీఎం సమాచార సలహాదారు మృత్యుంజయ్ కుమార్ అన్నారు.
కాగా, బలూర్‌ఘట్ ఎయిర్‌పోర్ట్‌లో యోగి చాపర్‌కు అనుమతి నిరాకరించినందుకు నిరసనగా దినాజ్‌పూర్‌లో జిల్లా మేజిస్ర్టేట్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. యోగి విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరణపై జిల్లా మేజిస్ర్టేట్ సరైన వివరణ ఇవ్వలేకపోయారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సైతం అధికారులు తొలుత అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment